
24/07/2025
ADONI QETTA NEWS..
ఆదోని ట్రాఫిక్ ఏఎస్ఐ కి ప్రత్యేక ప్రశంస పత్రం
ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ ట్రాఫిక్కును నియంత్రించడంలో వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించడంలో మంచి నైపుణ్యత ప్రదర్శించిన ఏఎస్ఐ ఆర్ లక్ష్మన్నకు జిల్లా ఎస్పీ ప్రత్యేక వృత్తి నైపుణ్యత ప్రశంస పత్రం అందజేశారు. గురువారం కర్నూల్ లో జరిగిన జిల్లాక్రైమ్ మీటింగ్ సందర్భంగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా ఆదోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ లక్ష్మన్న వృత్తి నైపుణ్యత ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం పై పట్టణ ప్రజల హర్షం వ్యక్తం చేస్తున్నారు.!