Pastor Pavan Babu - EAC Church

Pastor Pavan Babu - EAC Church Pastor Pavan Babu

16/08/2025
మన దేశము కొరకు ప్రార్థించుట కొరకు ఈ నెల 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:30 నుండి 9:30 వరకు ఇబ్రహీంపట్నం లో ఉన్న బేతేలు చర్చిలో...
13/08/2025

మన దేశము కొరకు ప్రార్థించుట కొరకు ఈ నెల 15వ తేదీ శుక్రవారం ఉదయం 6:30 నుండి 9:30 వరకు ఇబ్రహీంపట్నం లో ఉన్న బేతేలు చర్చిలో దైవజనులు పరిచారకులు అందరం కలిసి ప్రార్థించుకునే చక్కని అవకాశం ఇదే అందరికీ మా ప్రేమ పూర్వక ఆహ్వానం 🙏🙏

03/08/2025
 #
03/08/2025

#

ఎడారిలో సెలయేర్లు :_*ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు*_ (మార్కు 2:2). సముద్రం అడుగున పోలిప్ లు అనబడే జీవులు కాల్షియం ధా...
31/07/2025

ఎడారిలో సెలయేర్లు :

_*ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు*_ (మార్కు 2:2).

సముద్రం అడుగున పోలిప్ లు అనబడే జీవులు కాల్షియం ధాతువులతో తమ కోసం బ్రహ్మాండ మైన ప్రవాళాలను నిర్మించుకుంటాయి. ప్రవాళాలు అనేవి గవ్వల్లా విడివిడిగా ఉండకుండా మొత్తంగా కలిసిపోయి ఒక్కోసారి పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగంలో ఏర్పడుతుంటాయి. పోలిప్ ల వంటి అత్యల్పమైన జీవులకి తాము నిర్మించుకునే గూళ్ళవలన క్రొత్త ద్వీపాలు ఏర్పడతాయని తెలియదు. కాని క్రమక్రమంగా దానిమీద జంతువులు నివసిస్తాయి. మొక్కలు పెరుగుతాయి.

దేవుని సైన్య సమూహంలో నీ స్థానం ఎక్కడో అట్టడుగున ఉంటే సణుగుకోకు. ఫిర్యాదులు చేయకు. దేవుని చిత్తానికి ఎదురు చెప్పడానికి ప్రయత్నించకు. దేవుడు నిన్నక్కడ ఉంచాడు అంతే. సముద్రంలోని పోలిప్ జీవులు లేకుండా పగడాల ద్వీపాలు “కోరల్స్”ను ఎవరు కట్టగలరు? దేవుడు ఆత్మీయ పోలిప్లుగా ఉండడానికి కొందరిని ఎన్నుకుంటాడు. మనుషుల కంటికి కనబడకుండా వాళ్ళు పనిచెయ్యాలి. కాని వాళ్ళ పనిని పరలోకం అంతా తేరిపారజూస్తుంటుంది. వారు పరిశుద్ధాత్మచేత బలపర్చబడతారు.

యేసు ప్రభువు బహుమానాలిచ్చే రోజు వస్తుంది. హల్లెలూయ! ఆయన పొరపాట్లేమీ చెయ్యడు. నీకు అంత మంచి బహుమానం ఎలా దొరికింది అని మనుషులు ఆశ్యర్యపోతారు. ఎందుకంటే నీ పేరు వాళ్ళెప్పుడూ వినలేదు మరి.

*పోరాటంలో నువ్వెక్కడ నిలిచావో*
*అదే నీ స్థానం*
*ముఖాన్ని తిప్పేసుకోకు*
*ఇక్కడ నాకేం పని లేదనుకుని*

*దేవుడు ఎందుకోసమో ఉంచాడు నిన్నక్కడ*
*అది ఎక్కడైనా దానికోసం నిన్నెన్నుకున్నాడు*
*నమ్మకంగా పనిచెయ్యి, అది ఎక్కడైనా*

*కవచం ధరించు విశ్వాస పాత్రుడిగా ఉండు*
*పనిలోనైనా విశ్రాంతిలోనైనా*

*ఏది ఏమైనా సందేహాలు మాత్రం మాను*
*దేవుని త్రోవలు శ్రేష్టం*

*పోరాటంలో గాని, విశ్రమంలోగాని*
*నీ యజమాని నీకిచ్చిన పని ఇదే*
*నమ్మకంగా చెయ్యి దీన్ని.*

విశ్వాసులంతా గుమికూడిన కూటాలనూ, ప్రోత్సాహపరిచే శిఖరాగ్రాలనూ సహాయకరమైన వ్యక్తుల సహవాసాన్నీ వదలడానికి సంకోచించనక్కరలేదు. ఎమ్మాయికి ప్రయాణం కట్టవలసివస్తే, లేక మాసిదోనియ తీరానికి సువార్త వ్యాప్తికి వెళ్ళవలసి వస్తే సందేహమక్కరలేదు. ఎందుకంటే దేవుడు మనల్నక్కడ ఉంచబోతున్నాడని మనలో నిశ్చయత ఉంటుంది. మనం మన దైనందిన వ్యవహారాల్లో మునిగి ఉన్నప్పుడు, ఉన్నట్టుండి ఆయన మనల్ని సరిహద్దు ప్రాంతాలకి పంపిస్తాడు, తనకోసం వాటిని గెలిచి స్వాధీనపరచుకొమ్మని.

https://youtu.be/IjvwrJRyCfs?si=UVLS9wIe-vY3NuFX
04/07/2025

https://youtu.be/IjvwrJRyCfs?si=UVLS9wIe-vY3NuFX

ఈ వీడియో ఎవరి మెప్పు కోసమో లేక ఎవరినో బాధ పెట్టాలని కాదు... ఇది హృదయ వేదనతో సత్య ప్రతిష్ట కోసం మాత్రమే చేస్తున్నా....

Address

Emmanuel Apostolic Church
Amaravati
522237

Telephone

+919948775317

Website

Alerts

Be the first to know and let us send you an email when Pastor Pavan Babu - EAC Church posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pastor Pavan Babu - EAC Church:

Share