
16/05/2024
పేదల ఖాతాల్లోకి డబ్బులు వేయనివ్వకుండా ఎన్నికల నిబంధనలు అడ్డుకున్నాయంటూ... ఎలక్షన్లకి మూడు రోజుల ముందు ఎన్నో నాటకాలు ఆడిన జగన్ సర్కారు... తీరా ఎన్నికలయ్యాక ఇక పేదలతో పనేముంది అనుకుంది. సంక్షేమ పథకాల నిధులతో కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించేందుకు సిద్ధపడింది.
పేదలకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని గమనించిన చంద్రబాబు గారు డీబీటీ పథకాలకు నిధులు తక్షణం విడుదల చేసేలా చర్యలు చేపట్టాలంటూ గవర్నర్ కు లేఖ రాసారు. వెంటనే స్పందించిన గవర్నర్ ఆర్థికశాఖ అధికారులకు నిర్ధిష్ట ఆదేశాలు జారీ చేయడంతో... పేదల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయి