Aha Amaravati

Aha Amaravati Aha Amaravati | News • Insights • Entertainment
Bringing you the latest updates, cultural insights, and engaging content. DM for collaborations!

01/08/2026

AhaAmaravati | అమరావతిలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్ కేవలం రహదారి కాదు. సుమారు 21 కి.మీ. పొడవైన ఈ ప్రధాన కారిడార్, రాజధానిని NH-16తో అనుసంధానించనుంది. ఇందులో స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, తాగునీటి నెట్‌వర్క్, అండర్‌గ్రౌండ్ విద్యుత్ & ICT కేబుల్స్, గ్యాస్ పైప్‌లైన్లు, విశాలమైన ఫుట్‌పాత్‌లు, సైక్లింగ్ ట్రాక్‌లు, గ్రీన్ బఫర్‌లతో కూడిన ప్రపంచ స్థాయి పట్టణ మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నారు.

31/07/2026

AhaAmaravati | అమరావతిలో నీరుకొండ రిజర్వాయర్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 440 ఎకరాల్లో, 0.4 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు రాజధానికి తాగునీటి భద్రత, నీటి నిల్వ–పంపిణీ, వరద నియంత్రణకు కీలకంగా మారనుంది. ప్రాజెక్టులో భాగంగా 158 ఎకరాల్లో గ్రీన్ ల్యాండ్‌స్కేప్ కూడా అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచ బ్యాంక్, ADB సహకారంతో ఈ ప్రాజెక్టు అమలవుతోంది.

30/07/2026

AhaAmaravati | అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా వరధి నుంచి రైల్వే బ్రిడ్జి వరకు నిర్మిస్తున్న 1.7 కి.మీ. రిటైనింగ్ వాల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 2,000 పైల్స్‌లో 700కు పైగా పూర్తి కాగా, రోజుకు 10–15 పైల్స్ నిర్మిస్తున్నారు. 9 మీటర్ల ఎత్తు, 40–45 మీటర్ల లోతైన పైలింగ్తో నిర్మిస్తున్న ఈ రిటైనింగ్ వాల్‌ను పనులు ప్రారంభమైన నాటి నుంచి 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

29/07/2026

AhaAmaravati | ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7 ఐకానిక్ వండర్స్ నిర్మాణాన్ని చేపడుతోంది. ఇందులో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, హెచ్‌ఓడీ టవర్స్, గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి అమరావతిని ఆధునిక పాలన, న్యాయ వ్యవస్థ, విద్య, ఆర్థిక అభివృద్ధికి ప్రతీకగా నిలబెట్టనున్నాయి.

28/07/2026

AhaAmaravati | ప్రజారాజధాని అమరావతిలో ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస టవర్లు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. 10.40 ఎకరాల విస్తీర్ణంలో 12 టవర్లుగా నిర్మించిన ఈ సముదాయంలో మొత్తం 288 ఆధునిక ఫ్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. అంతర్గత నిర్మాణ పనులు, విద్యుత్, లిఫ్ట్‌లు, అగ్నిమాపక వ్యవస్థలు, ల్యాండ్‌స్కేపింగ్ తదితర పనులు పూర్తికావడంతో, ఆగస్టు 13న ఈ టవర్లను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) సాధారణ పరిపాలన శాఖ (GAD)కు అప్పగించేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

27/07/2026

AhaAmaravati | అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్ (Phase-3)లో భాగంగా బకింగ్‌హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవల వంతెనపై తారుపూత (bituminous/asphalt surfacing) పనులు కొనసాగుతుండగా, అధికారులు పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతతో పాటు గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ వంతెన పూర్తయితే అమరావతికి కరకట్ట రోడ్‌తో ప్రత్యామ్నాయ అనుసంధానం లభించి, సీడ్ యాక్సెస్ రోడ్ ద్వారా జాతీయ రహదారి (NH-16) వైపు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.

26/07/2026

AhaAmaravati | మంగళగిరి మండలం నిడమర్రు LEAP మోడల్ స్కూల్ ఆధునిక సౌకర్యాలతో విశేష ఆకర్షణగా నిలుస్తోంది. రూ.16 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, సైన్స్ ల్యాబ్స్, క్రీడా వసతులు తదితర సదుపాయాలు ఉన్నాయి. అడ్మిషన్లకు భారీ స్పందన రావడంతో అన్ని సీట్లు భర్తీ కాగా, పాఠశాల యాజమాన్యం "No Admissions" బోర్డు ఏర్పాటు చేసింది.

24/07/2026

AhaAmaravati | గుంటూరు నగరంలో శంకర్ విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణం కొనసాగుతుండగా, నందివెలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. దాదాపు 70 ఏళ్ల నాటి పాత వంతెన స్థానంలో ₹98 కోట్లతో నాలుగు లేన్ల శంకర్ విలాస్ ROB నిర్మించబడుతోంది. నగర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, కీలక రహదారుల అనుసంధానాన్ని మెరుగుపరచడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.

23/07/2026

AhaAmaravati | గుంటూరు నగరంలోని రోడ్ల విస్తరణ పనుల పురోగతిని సమీక్షించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్, నిలిచిపోయిన పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Address

Amaravati

Alerts

Be the first to know and let us send you an email when Aha Amaravati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share