Yellutla villeage information

  • Home
  • Yellutla villeage information
తాడిపత్రిలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని 1116 లడ్డూలతో శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ
03/09/2025

తాడిపత్రిలో భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని 1116 లడ్డూలతో శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అలంకరణ

తాడిపత్రిలో సోమవారం సందర్భంగా విశేష అలంకరణలో శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి
01/09/2025

తాడిపత్రిలో సోమవారం సందర్భంగా విశేష అలంకరణలో శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి

తాడిపత్రిలో శోభయాత్రలో గణనాథులు దర్శనం
31/08/2025

తాడిపత్రిలో శోభయాత్రలో గణనాథులు దర్శనం

31/08/2025

తాడిపత్రిలో వినాయక నిమజ్జనం వేడుకలు

తాడిపత్రి మీదుగా వెళ్ళే వాహనదారులకు ముఖ్య గమనిక.. ట్రాఫిక్ మళ్లింపు అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నుండి నంద్యాల కడప కు వ...
30/08/2025

తాడిపత్రి మీదుగా వెళ్ళే వాహనదారులకు ముఖ్య గమనిక.. ట్రాఫిక్ మళ్లింపు

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నుండి నంద్యాల కడప కు వెళ్లే వాహనాలను వినాయక నిమజ్జనం వేడుకలు సందర్భంగా ఆదివారం డైవర్ట్ చేసినట్లు తాడిపత్రి టౌన్ సీఐ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. అనంతపురం నుండి కడపకు వెళ్లేందుకు శివుడి విగ్రహం నుండి ఆటోనగర్ మీదుగా, అనంతపురం నంద్యాలకు శ్రీకృష్ణదేవరాయలు సర్కిల్ మీదుగా చుక్కలూరు బ్రిడ్జి సజ్జలదిన్నె క్రాస్ బుగ్గ మీదుగా, కడప నుంచి నంద్యాలకు వెళ్లాలన్న ఇదే మార్గం గుండా వెళ్లాలని సూచించారు. ఆగస్టు 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

తాడిపత్రిలో రికార్డు స్థాయిలో వినాయక లడ్డు వేలం పాట..!అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రజక వీధి వక్రతుండా యూనియన్ ఆధ...
30/08/2025

తాడిపత్రిలో రికార్డు స్థాయిలో వినాయక లడ్డు వేలం పాట..!

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రజక వీధి వక్రతుండా యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద లడ్డు వేలంపాట రికార్డు స్థాయిలో పలికింది. రూ. 5,116లతో ప్రారంభమైన వేలంపాట చివరకు రూ. 2,55,116లు పలికింది. హోరాహోరీగా సాగిన వేలం పాటలో చవ్వ రవికాంత్ రెడ్డి, శివకుమార్ రెడ్డిల మధ్య ఉత్కంఠ భరితంగా సాగింది. చివరికి శివకుమార్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది రూ. 1,20,000లకు ఏటూరి చంద్రశేఖర్ దక్కించుకున్నారు.

30/08/2025

సరికొత్త పద్ధతిలో సైబర్ నేరగాళ్లు మోసం.. వాట్సాప్ కాల్ లిఫ్ట్ చేసాడు బ్యాంకు ఖాతా ఖాళీ..

అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోని శివకుమార్ తన ఫోన్ కొచ్చిన వాట్సప్ వాయిస్ కాల్ లిఫ్ట్ చేయడంతో తన ఖాతాలో ఉన్నటువంటి నగదు సైబర్ నేరగాళ్లు దోచుకున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బనగానపల్లి మండలం కు చెందిన శివకుమార్ వినాయక చవితి సందర్భంగా తన అత్తగారు ఊరైన తాడిపత్రికి వచ్చాడు. పూజ సామాగ్రి కొనుగోలు చేస్తున్న సమయంలో వాట్సాప్ వాయిస్ కాల్ రావడంతో చూసుకోకుండా లిఫ్ట్ చేసాడు. కేవలం 23 సెకన్ల లోనే ఖాతా మొత్తం ఖాళీ అయిందని పేర్కొన్నారు.

తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరుకోనలో ప్రత్యేకణకరణాలు శ్రీ రంగనాథ స్వామి
30/08/2025

తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరుకోనలో ప్రత్యేకణకరణాలు శ్రీ రంగనాథ స్వామి

30/08/2025

తాడిపత్రిలో పురాతన నాణెములు ప్రదర్శన

విద్యార్థులకు రాజుల కాలంలో వాడిన నాణెముల చరిత్రను పరిచయం చేసేందుకు తాడిపత్రిలోని ప్రకాశం హైస్కూల్‌లో ప్రాచీన నాణేల ప్రదర్శన నిర్వహించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ ప్రదర్శనలో క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం నాటి నాణేలతో పాటు ఇతర దేశాల్లో వాడిన నాణేలను విద్యార్థులకు చూపించారు. నిర్వాహకుల్లో ఒకరైన విష్ణు భగవాన్ మాట్లాడుతూ ప్రదర్శనకు అవార్డులు కూడా లభించాయన్నారు.

పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ అటవీ ప్రాంతంలోని గాలిమరల మార్గంలో రేసింగ్ కార్లు
29/08/2025

పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామ అటవీ ప్రాంతంలోని గాలిమరల మార్గంలో రేసింగ్ కార్లు

29/08/2025

అనంతపురం జిల్లాలో రేసింగ్ కార్లు, బైకులు ప్రత్యక్షం
-- పుట్లూరు మండలం ఎల్లుట్ల, జంగంరెడ్డిపేట గ్రామ అటవీ ప్రాంతంలో గాలిమరల మార్గంలో ప్రత్యక్షం
-- రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్న రేసింగ్ కార్లు బైకులు
-- ఆసక్తిగా తిలకిస్తున్న స్థానిక ప్రజలు
-- ఎందుకు రేసింగ్ కార్లు బైకులు వచ్చాయి.. ఎందు కోసం చేస్తున్నారంటూ స్థానికులు ప్రశ్నలు








#తాడిపత్రి
#

తాడిపత్రిలో వినాయక నిమజ్జనం వేడుకలపై అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేక దృష్టితాడిపత్రి మండలంలో వినాయక నిమజ్జనం ...
29/08/2025

తాడిపత్రిలో వినాయక నిమజ్జనం వేడుకలపై అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేక దృష్టి

తాడిపత్రి మండలంలో వినాయక నిమజ్జనం వేడుకలపై అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. మండల వ్యాప్తంగా సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలలో స్వయంగా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేస్తున్నారు. ముఖ్యంగా ఆలూరు, చిన్నపోలమడ, సజ్జలదిన్నె గ్రామాలలో సీఐ శివగంగాధర్ రెడ్డి, ఎస్సై ధరణి బాబులతో కలిసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Address


Telephone

+917989559385

Website

Alerts

Be the first to know and let us send you an email when Yellutla villeage information posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Yellutla villeage information:

  • Want your business to be the top-listed Media Company?

Share