12/12/2025
🕉️ 13 డిసెంబర్ 2025 🕉️ శనివారం గ్రహ బలం పంచాంగం
శనివారం గ్రహాధిపతి "శనైశ్చరుడు" మరియు "రాహువు".
శనైశ్చరుని అధిష్టాన దైవం "శ్రీ బ్రహ్మ దేవుడు", మరియు "శ్రీ యమధర్మ రాజు". శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం శనైశ్చరాయ నమః ||
2. ఓం బ్రహ్మణే నమః ||
3. ఓం యమాయ నమః ||
4. ఓం విష్ణవే నమః ||
శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహా విష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని, సందర్శించండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి.
రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గా దేవి, మరియు నాగ (సర్ప) దేవతలు. రాహువు అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
1. ఓం రాహవే నమః ||
2. ఓం దుం దుర్గాయై నమః ||
3. ఓం సర్పేభ్యో నమః ||
రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గ మాత ఆలయాలను రాహుకాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) సందర్శించండి. శ్రీ దుర్గ సప్త శ్లోకి స్తోత్రం, శ్రీ దుర్గ సూక్తం పఠించండి.
శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయాల్సిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకండి.
గ్రహ బలం కొరకు, శనివారం నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించండి. శనివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ఆయుష్షు పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తుంది, ప్రతి పనిలో శుభం చేకూరుతుంది.
అమృత కాలం:
01:40 AM – 03:26 AM
దుర్ముహూర్తం:
08:00 AM – 08:44 AM
వర్జ్యం:
03:06 PM – 04:52 PM
🕉️🕉️
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, మార్గశీర్ష మాసం, కృష్ణ పక్షం,
తిథి:
నవమి: డిసెంబర్ 12 02:57 PM నుండి డిసెంబర్ 13 04:38 PM వరకు
దశమి: డిసెంబర్ 13 04:38 PM నుండి డిసెంబర్ 14 06:50 PM వరకు
నవమి మంచి పనులకు, ముఖ్యమైన వ్యాపారాలకు, ప్రతికూలమైన రిక్త తిథి. నవమి శత్రువులను నిర్మూలించడానికి, విధ్వంసక చర్యలకు, హింసకు, వాదనలు, పోటీ, శారీరక వ్యాయామం, క్రీడలు, పనిముట్లతో పని చేయడం వంటి పనులకు అనుకూలమైన తిథి.
నవమి తిథి శ్రీ పార్వతి దేవి, శ్రీ దుర్గ మరియు ఇతర శక్తి అమ్మవారి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పఠించడానికి, శ్రీ లలిత అమ్మవారి ఆరాధనకు, శ్రీ లలిత అమ్మవారి మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.
🕉️🕉️
నక్షత్రం:
హస్త: డిసెంబర్ 13 05:50 AM నుండి డిసెంబర్ 14 08:18 AM వరకు