06/11/2025
ఈ నెల 8వ తేదీన భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్.సవిత తెలిపారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ ఉత్సవానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరుకానున్నట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొనట్లు మంత్రి సవిత వెల్లడించారు....
ఈ నెల 8వ తేదీన భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభు....