
08/07/2025
వర్షాకాలంలో సీజనల్ అంటువ్యాధులు, జ్వరాలు ప్రభలకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఏపీ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి విజయానంద్ చెప్పారు. సీజనల్ వ్యాధుల నివారణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి సిఎస్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాకాలంలో అధికంగా జ్వరాల కేసులు నమోదైతే ఆ ప్రాంతాలలో తక్షణమే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఆదేశించారు. దిగువ ప్రాంతాలలో నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. దోమల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. వైరల్ ఫీవర్ వచ్చే ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనుబంధ శాఖలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలన్నారు. డెంగ్యూ చికెన్ గునియా, మలేరియా, వైరల్ ఫీవర్ లు నమోదైతే తక్షణమే స్పందించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.సమావేశానికి బాపట్ల జిల్లా నుంచి కలెక్టర్ వెంకట మురళి ,అధికారులు పాల్గొన్నారు .