JSB With You

JSB With You సమాచారం సూటిగా తెలుగులో..

జగన్కు స్వాగతం పలికిన పుంగనూరు ఎమ్మెల్యే "పెద్దిరెడ్డి"కర్నూలు పర్యటనకు విచ్చేసిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి...
13/08/2026

జగన్కు స్వాగతం పలికిన పుంగనూరు ఎమ్మెల్యే "పెద్దిరెడ్డి"

కర్నూలు పర్యటనకు విచ్చేసిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓర్వకల్లు విమానాశ్రయంలో గురువారం స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే విరూపాక్షిని మిలాకత్లో కలిసేందుకు వెళుతున్న జగన్తో పాటు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.

NMMS స్కాలర్షిప్కు ముగ్గురు విద్యార్థినిలు "ఎంపిక"గుడిపల్లి మోడల్స్ స్కూల్లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు నేషనల్ ...
13/08/2026

NMMS స్కాలర్షిప్కు ముగ్గురు విద్యార్థినిలు "ఎంపిక"

గుడిపల్లి మోడల్స్ స్కూల్లో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్'కు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ హరిణి తెలిపారు.
9వ తరగతి చదువుతున్న రుజువు, లక్ష్మి, కావ్యశ్రీ NMMS కు ఎంపికవగా వీరికి 9 నుంచి 12వ తరగతి వరకు ప్రతి సంవత్సరం రూ.12000 స్కాలర్షిప్ అందుతుందని తెలిపారు.

దొంగలు బీభత్సం - దాదాపు కోటి రూపాయల విలువ గల సొత్తు చోరీ..?మదనపల్లె పోస్టల్ అండ్ టెలికం కాలనీలో దొంగలు ఇంటిలో చొరబడి బీభ...
13/08/2026

దొంగలు బీభత్సం - దాదాపు కోటి రూపాయల విలువ గల సొత్తు చోరీ..?

మదనపల్లె పోస్టల్ అండ్ టెలికం కాలనీలో దొంగలు ఇంటిలో చొరబడి బీభత్సం సృష్టించడం పాఠకులకు తెలిసింది.
దొంగల ముఠా ఇంటి కిటికీ గ్రిలు విరచి లోనికి ప్రవేశించారు.
బీరువాలు, కబోడీలలో ఉన్న విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకుని వెళ్లారు.
సుమారు అర్థగంట పాటు దొంగలు ఇంట్లో బీభత్సం సృష్టించి విలువైన పరికరాలను చెల్లాచెదురు చేసిన దృశ్యం, కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది.

13/08/2026

చంద్రగిరి వద్ద పంటలపై ఏనుగుల దాడులు.

పోలీస్ పై దాడి చేసిన యువకుడిని బేడీలు వేసి నడిరోడ్డుపై "నడిపించారు"శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన యు...
13/08/2026

పోలీస్ పై దాడి చేసిన యువకుడిని బేడీలు వేసి నడిరోడ్డుపై "నడిపించారు"

శ్రీకాళహస్తిలో హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన యువకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..
ప్రధాన నిందితడుడికి సంకెళ్లు వేసి ప్రధాన రహదారిలో నడిపించుకుని కోర్టుకు తీసుకెళ్లారు.
తమ వాహనం మొరాయించడంతో నడిపించుకుంటూ తీసుకెళ్లాల్సి వచ్చిందని సీఐ వెంకటేశ్ తెలిపారు.

14న కార్వేటినగరంలో ఉచితంగా హెల్మెట్ల "పంపిణీ"కార్వేటినగరంలో ఈనెల 14న ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తామని సీఐ హనుమంతప్ప, ...
13/08/2026

14న కార్వేటినగరంలో ఉచితంగా హెల్మెట్ల "పంపిణీ"

కార్వేటినగరంలో ఈనెల 14న ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేస్తామని సీఐ హనుమంతప్ప, ఎస్ఐలు తెలిపారు.
ఎమ్మెల్యే డా. థామస్ చేతుల మీదుగా దాత మాదిరాజు గణేష్ రాజు ఆధ్వర్యంలో 1,000 హెల్మెట్లను సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల రైతులు, పోలీసులు, యువత, నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

వైసిపి అధినేత జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ "భరత్"వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లా కుప్పం వైసిపి నేత ఎమ్మెల్స...
13/08/2026

వైసిపి అధినేత జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ "భరత్"
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని చిత్తూరు జిల్లా కుప్పం వైసిపి నేత ఎమ్మెల్సీ భరత్ బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు.
కుప్పం నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను వివరించారు.

ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చిన "భార్య"అన్నమయ్య జిల్లా పీలేరులో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛే...
13/08/2026

ప్రియుడుతో కలిసి భర్తను హతమార్చిన "భార్య"

అన్నమయ్య జిల్లా పీలేరులో సంచలనం సృష్టించిన భర్త హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
నిద్రమాత్రలు ఇచ్చి గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత ఇనుప రాడ్, రాయితో తలపై దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు.

పీలేరు పట్టణంలోని డిష్ కాలనీకి చెందిన మంగినేని ఉమాదేవి (41)కు, చంద్రగిరి మండలానికి చెందిన చారాల సుబ్రహ్మణ్యం (32)తో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సంబంధానికి భర్త మంగినేని వెంకట సుబ్రహ్మణ్యం అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరూ అతడిని హత్య చేయాలని పథకం వేసినట్లు వెల్లడించారు.

ఆగస్టు 7 రాత్రి సుమారు 8:30 గంటలకు సుబ్రహ్మణ్యం ఇచ్చిన నిద్రమాత్రలను ఉమాదేవి ఇడ్లీ, సాంబారు, చట్నీలో కలిపి భర్తకు పెట్టినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం రాత్రి 11:30 గంటల సమయంలో భర్త గాఢ నిద్రలోకి వెళ్లిన తర్వాత సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి పిలిపించినట్లు చెప్పారు.

ఇద్దరూ కలిసి నిద్రిస్తున్న వెంకట సుబ్రహ్మణ్యంపై ఇనుప రాడ్, గుండ్రాయితో దాడి చేసి తల పగలగొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య అనంతరం నేరాన్ని రోడ్డు ప్రమాదంగా నమ్మించేలా చేయాలని నిందితులు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సుమారు 2:30 గంటలకు మృతదేహాన్ని సుబ్రహ్మణ్యంకు చెందిన హోండా యాక్టివాపై తీసుకెళ్లి మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారిపై పడేసినట్లు చెప్పారు.

అనంతరం రక్తపు మరకలు ఉన్న బట్టలు, ఇనుప రాడ్, గుండ్రాయిని గోనె సంచిలో వేసి కట్టకింద ఉన్న కుంటలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.

మొగరాల జడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ యువజన "దినోత్సవం"తిరుపతి జిల్లా పాకాల మండలం, మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వా...
13/08/2026

మొగరాల జడ్పీ హైస్కూల్లో అంతర్జాతీయ యువజన "దినోత్సవం"

తిరుపతి జిల్లా పాకాల మండలం, మొగరాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామి వివేకానంద స్ఫూర్తితో అంతర్జాతీయ యువజన దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమలత తెలిపారు.

ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రపంచ యువజన దినోత్సవ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వనపర్తి వెంకట సిద్ధులు, ఆదికేశవులు, నీరజ, విమలా విక్టోరియా, మహమ్మద్ సుల్తాన్, రామమూర్తి, ప్రభోధిని మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా అద్భుతమైన ఆఫర్లతో బాలాజీ "టెక్స్టైల్స్"చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు లోని బాలాజీ వస్...
13/08/2026

ఇండిపెండెన్స్ డే సందర్భంగా అద్భుతమైన ఆఫర్లతో బాలాజీ "టెక్స్టైల్స్"
చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు లోని బాలాజీ వస్త్ర దుకాణంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా 20% డిస్కౌంట్లతో ప్రత్యేకమైన ఆఫర్లు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ అవకాశాన్ని పులిచెర్ల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Address

Pulicherla Road
Chittoor
517113

Alerts

Be the first to know and let us send you an email when JSB With You posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share