
21/07/2025
జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజల ఆసక్తికి అద్దం పట్టే సంఘటన జరిగింది. అక్కడి కాసం షాపింగ్ మాల్లో కేవలం రూ.35కే చీర ఆఫర్ ప్రకటించడంతో స్థానిక మహిళలు భారీ సంఖ్యలో పోటెత్తారు. ఉదయం షాపింగ్ మాల్ తెరవకముందే వందలాది మంది మహిళలు బారులు తీరారు. ఇంట్లో పనులను కూడా పక్కనపెట్టి మరీ, షాపింగ్ మాల్ దగ్గర క్యూలైన్లో నిలబడ్డారు. షాపు తెరవకముందే ఇంతమంది మహిళలు గుమిగూడటం చూసి ఆ మార్గంలో వెళ్లేవారు ఆశ్చర్యపోయారు