Helapuri news television

Helapuri news television we are here to give you pure transparent news

07/09/2024

మా గోడు పట్టించుకునేవారే లేరా!!తంగేళ్ళముడి వెటర్నరీ హాస్పిటల్ దుస్థితి ఇలా ,వర్ష కాలం నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు

27/01/2024

ఖిద్మత్ సొసైటీ ద్వారా ప్రజలకు వడ్డీ రహిత రుణాలు ఇవ్వడం శుభ పరిణామం అని ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు . ఏలూరు తంగేళ్లమూడి ఎస్ ఎస్ వి ఎల్ ప్లాజా అపార్ట్మెంట్లో ఖిద్మత్ మ్యూచువల్లి ఎయిడైడ్ కో-ఆపరేటివ్ థ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్, నూతన బ్రాంచ్ ను మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సభా వేదిక తంగెలమూడి నేహర్ మసీదులో నిర్వహించారు . ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించే ఆలోచన ఇది అని ప్రశంసించారు. ఇటువంటి సొసైటీలకు తమ ప్రభుత్వం మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు ముహమ్మద్ రఫీఖ్ మాట్లాడుతూ సౌత్ ఇండియాలో 43 బ్రాంచ్ లు ఈ సంస్థ ప్రారంభించిందని ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ఏలూరుతో కలుపుకొని 13 వ.బ్రాంచ్ నేడు ప్రారంభించడం సంతోషదాయకమన్నారు

27/01/2024

అవినీతి, అక్రమ పాలనతో నిండిపోయిన వైసిపి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి జనం అంతా సిద్ధంగా ఉన్నారని, ఈ విషయం ముందుగా గ్రహించటం వల్లే జగన్ భయంతో తప్పుకుంటానని వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.

పెదవేగి మండలం అమ్మపాలెం గ్రామంలో జరిగిన బాబు షూరిటీ - భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు.
గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన 6 పధకాల విశిష్టతను గ్రామస్థులకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా టిడిపి జనసేన కూటమికి అండగా నిలిచి భారీ విజయాన్ని అందించాలని ఆయన కోరారు....
ఈ కార్యక్రమంలో పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా, సమన్వయ కమిటీ సభ్యులు తాతా సత్యనారాయణ, క్లస్టర్ ఇంచార్జ్ ఐనాల వెంకట నారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు చందు శ్రీను, నాయకులు వీరయ్య, మురళి, జ్యోతి, ఏసుపాదం సహా టిడిపి జనసేనకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..

04/10/2022

తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్న ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమం ప్రారంభించడమైనది.

తణుకు: తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో మంత్రి కారుమురి వెంకట నాగేశ్వరావుగారితో పాటు పాల్గొనటం జరిగింది. మన సంస్కృతి, సంప్రదాయాలు బావి తరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలను మంత్రి కారుమూరీ వెంకట నాగేశ్వరరావు గారు నిర్వహించడం చాలా అభినందనీయం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.

03/10/2022

ఏలూరుజిల్లా

ఫేక్ లోన్ యాప్ ముఠా గుట్టు రట్టు చేసిన ఏలూరు జిల్లా పోలీసులు

ఈ పేక్ లోన్ యాప్ లకు సంబందించి 33 బ్యాంక్ ఖాతాలలో 48 కోట్లు డిపాజిట్ అయినట్లు గుర్తింపు

ముఠా సభ్యులను ఏలూరులో మీడియా ఎదుట హాజరుపరచిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ IPS..

ఐదుగురు నిందితుల్లో తమిళనాడు కు చెందిన ముగ్గరు, హైదరాబాద్, వైజాగ్ కు చెందిన మరో ఇద్దరు అరెస్ట్

బ్యాంక్ ఎకౌంట్లను నిందితులు 0.5 కమిషన్కు అమ్మేశి నట్లు గుర్తింపు

ఆయా అకౌంట్ లలో బాధితులును బెదిరించి వసూలుచేసే సొమ్ము జమ అవుతున్నట్లు గుర్తింపు

ఏలూరు రూరల్ (మం) గుడివాకలంకకు చెందిన నాగేంద్ర మూర్తి ఫిర్యాదుతో ముఠా గుట్టు రట్టు

లోన్ యాప్ ముఠా వెనుక మరికొందరు నిందితులు ఉన్నట్లు గుర్తించాం

అంతా అన్లైన్లోనే... వ్యక్తులు కనపడకుండా తక్కువ మొత్తంలో అప్పులు ఇచ్చి అధికవడ్డీలు వసూలు చేస్తున్న ముఠా..

పేక్ లోన్ యాప్ లద్వారా వ్యక్తిగత డేటాను తస్కరించి ఖాతాలలో నగదు దోచేస్తున్న ముఠా సభ్యులు..

బాకీ తీర్చలేని బాధితుల పొటోలు అశ్లీలంగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలలో పోస్టుచేస్తాం అంటూ వాట్సప్ బెదిరింపులు

ఒకసారి బాకీ తీర్చేశినా మరలా అప్పు ఇస్తూ అధిక వడ్డీలు కట్టాల్సిందే అని డిమాడ్ చేస్తున్న ముఠా..

లోతుగా దర్యాప్తు చేస్తున్నాం.కీలక సూత్రదారులను అరెస్ట్ చేస్తాం

పేక్ లోన్ యాప్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

- ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ IPS..

17/09/2022

ఏలూరు జిల్లా..
ఏలూరు స్థానిక 44 వ డివిజన్లో ఎస్సీలకు వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు..
44వ డివిజన్ కార్పొరేటర్ పొలిమేర దాసు ఏలూరు నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆధ్వర్యంలో..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నగర అధ్యక్షులు శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నేరుసు చిరంజీవిలు, మైనార్టీ మహిళా కార్పొరేటర్లు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

17/09/2022

ఏలూరు జిల్లా..

ఏలూరు స్థానిక 16 వ డివిజన్లో ఎస్సీలకు వైయస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు..
16 వ డివిజన్ కార్పొరేటర్ జుజ్జువరపు విజయనిర్మల ఆధ్వర్యంలో..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న, మహిళా కార్పొరేటర్లు, నున్న స్వాతి, స్రవంతి, డింపుల్, మైనార్టీ మహిళా ,కార్పొరేటర్లు, స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

17/09/2022

ఏలూరు జిల్లా : షిర్డీ-విశాఖపట్నం రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..

యాంకర్ వాయిస్: ఏలూరు లో రైలు ప్రమాదం తృటిలో తప్పింది. షిర్డీ నుంచి విశాఖపట్నం వెళ్తున్న షిర్డీ రైలు , ఏలూరు రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫాం నెంబరు -2కి చేరుకునేసరికి ఎస్‌2... ఎస్‌3 బోగీల మధ్య ఉన్న కప్లింగ్‌ విరిగిపోయి లింక్‌ తెగిపోయింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు దీంతో ఘోర ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కప్లింగ్‌ విరిగిపోయిన బోగీని పక్కకు తొలగించి అందులోని ప్రయాణికులకోసం మరో బోగి అమర్చారు. మరమ్మతుల అనంతరం రైలు విశాఖపట్నం బయలుదేరింది.

12/09/2022

ఏలూరు జిల్లా...

ఏలూరు జిల్లా చైల్డ్ లైన్ 1098 సిబ్బంది అక్రమాల ఘటనలో క్రిమినల్ కేస్ నమోదుచేసారు. ఏలూరులో ఓ NGO ద్వారా నడపబడుతూ సెటిల్మెంట్స్ కి పాల్పడుతున్న చైల్డ్ లైన్ సిబ్బంది అక్రమాలపై వెల్లువెత్తిన ఆరోపణలు. మీడియా కధనాల ఆధారంగా ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ విచారణకు ఆదేశించారు.

విచారణ చేస్తున్న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారుల బృందం. చైల్డ్ లైన్ లో లక్ష రూపాయలు కట్టాలంటూ బాధితులను బెదిరించి సంతకాలు, వేలిముద్రలు సేకరించిన ఘటనపై క్రిమినల్ కేస్ నమోదు చేశారు. ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో IPC 384,506,511 సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 362/2022 గా కేస్ నమోదు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

విచారణలో మరింతగా వెలుగు చూడనున్న ఎన్నో ఏళ్లుగా అనాథ పిల్లల సంరక్షణ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఏలూరు చైల్డ్ లైన్ 1098 సిబ్బంది వ్యవహారం...

12/09/2022

ఆక్వా రంగ రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా నెక్జెన్ వారి ఇప్పుడు మన ఏలూరులో

14/08/2022

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్,భారత్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ విద్యుత్ కాంతులతో తళతళలాడిపోతోంది. మువ్వన్నెల తో విద్యుత్ దీపాలు కాంతులీనుతూ చూపరులను ఆకట్టుకున్నాయి
జాతీయ జెండా లో సత్యమేవ జయతే నినాదం పొందుపరిచి విద్యుత్ దీపాలను అలంకరించారు

12/08/2022

ఏలూరు జిల్లా

సెల్ ఫోన్ పోగొట్టుకున్న ప్రజలు సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఫోన్ నెంబర్ 9550351100 రాబడి సమాచారం మేరకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 175 సెల్ ఫోన్ రికవరీ చేసిన ఏలూరు పోలీసులు. రికవరీ చేసిన సెల్ 20 లక్షలు రూపాయలు విలువ ఉంటుందని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలియజేశారు. 37 సెల్ ఇతర రాష్ట్రంలో ఉన్నట్లు సమాచారం మేరకు ప్రత్యేక టీమును ఏర్పాటు చేసి రికవరీ చేస్తామని అన్నారు. ఇప్పటికే సెల్ ఫోన్ చోరీ కేసులో ఇద్దరు నిందితుల్ని అదుపులో తీసుకున్నామని దొంగిలించిన సెల్ ఫోన్లు సెల్ ఫోన్ షాపుల్లో ద్వారా అమ్మకాలు జరిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ హెచ్చరించారు.

Address

Eluru

Website

Alerts

Be the first to know and let us send you an email when Helapuri news television posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Helapuri news television:

Share