Eluru Digital

Eluru Digital Video Journalist

13/08/2026

*బైక్ దొంగతనం – సమాచారం అందించగలరు*

నిన్న రాత్రి 12 ఆగస్టు 2026న ఏలూరు శనివారపుపేటలోని మా ఇంటి ముందు పార్క్ చేసిన Pulsar బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు

బైక్: Pulsar
వాహన నంబర్: AP39EF 7835

ఈ బైక్‌ గురించి ఎవరికైనా సమాచారం తెలిసినా, ఎక్కడైనా కనిపించినా దయచేసి వెంటనే ఈ నంబర్లకు సమాచారం అందించగలరు

📞 90590 23556
📞 81259 13567
📞 95424 24279

దయచేసి ఈ సమాచారాన్ని షేర్ చేసి బైక్ ఆచూకీ కనుగొనడంలో సహకరించండి. 🙏

09/08/2026

మామిడి తోట రోడ్డు కోసం ప్రజా పాదయాత్ర

గున్నేపల్లి అగ్రహారం పరిధిలోని మామిడి తోట – బుల్లిగా కాలనీ రహదారి దుస్థితిపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఈరోజు ప్రజల ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించడం జరిగింది.

గత ఎన్నో సంవత్సరాలుగా అధ్వాన్నంగా ఉన్న ఈ రహదారి కారణంగా విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు, ఆటోలు సైతం రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది.

“మాటలు వద్దు – రోడ్డు కావాలి!”
“మామిడి తోట రోడ్డు నిర్మించాలి – ప్రజల కష్టాలు తీర్చాలి!”

అనే నినాదాలతో ప్రజలు తమ నిరసనను తెలియజేశారు.

ఈ పాదయాత్రలో మేడిచర్ల ఆదినారాయణ, మేడిచర్ల కృష్ణ, ఆకుల నాగబాబు, మేడిచర్ల నాగేశ్వరావు, ఆకుల గంగరాజు, వాకపల్లి శ్రీను, కుడిపూడి నాగరాజు, సాపే రాంబాబు, లంక వీరాంజనేయులు, కాండ్రేగుల భాస్కరరావు, చాగంటి గంగా భవాని, సిద్ధాబత్తుల శ్రీను, గోగి శ్రీరామమూర్తి, కొత్తపల్లి వెక్కన్నబాబు, కొత్తపల్లి సత్యనారాయణ, కేతా శివ, వాకపల్లి దొరబాబు (ఎంపీటీసీ), నూకల సూర్యచంద్రరావు, కాండ్రేగుల రాంబాబు, సప్పిడి రామకృష్ణ, వాకపల్లి జయరాజు, మద్దింశెట్టి ప్రసాదరావు, బాలిశెట్టి శివ, మద్దింశెట్టి రాజేష్, చింతపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అలాగే మామిడి తోట, బుల్లిగా కాలనీ, చాకలిపాలెం గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రహదారి నిర్మాణం కోసం తమ గళాన్ని వినిపించారు.

ప్రజల ప్రాథమిక అవసరమైన రహదారి కోసం చేపట్టిన ఈ ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి మామిడి తోట రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని డిమాండ్

మా డిమాండ్ ఒక్కటే —
మామిడి తోట రోడ్డు నిర్మించాలి!
ప్రజల కష్టాలు తీర్చాలి!

#ప్రజాపాదయాత్ర #మామిడితోటరోడ్డు #గున్నేపల్లి #రోడ్డుకోసంపోరాటం

07/08/2026

రాష్ట్రాన్ని గత వైసీపీ ప్రభుత్వం సృష్టించిన అగాధం నుంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్తోన్న ఘనత కూటమి ప్రభుత్వాధినేతలకే దక్కుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

07/08/2026

ఏలూరు జిల్లా,

బుట్టాయగూడెం మండలంలోకి ప్రవేశించిన మన్యం పెద్దపులి

కామవరం గ్రామ సమీపం లో ఆవు పై దాడి చేసి హతమార్చిన పెద్ద పులి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరిన అటవీ శాఖ అధికారులు

06/08/2026

76 లక్షల 81 వేల రూపాయల విలువైన సి ఎం ఆర్ ఎఫ్ చెక్కులు, ఎల్ ఓ సీ లను 62 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఏలూరు ఎం ఎల్ ఏ బడేటి రాధాకృష్ణ

04/08/2026

ఏలూరు జిల్లా,

పెదపాడు మండలం, కలపర్రు గ్రామంలో విషాదం

స్కూల్ బస్సు ఢీ కొని రెండేళ్ల బాలుడు మృతి, మృతుడు మజ్జిగ దీక్షిత్ (2),

ఏలూరు సర్వజన ఆసుపత్రికి మృతదేహం తరలింపు

04/08/2026

ఏలూరు ఎం పి పుట్టా మహేష్ యాదవ్ మీడియా సమావేశం

04/08/2026

ఏలూరు, 27 వ డివిజన్ చొదిమెళ్ళలో అమృత్ 2.0 పథకం ద్వారా ఐదు లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మంచినీటి వాటర్ ప్లాంట్ కు శంకుస్థాపన కార్యక్రమం

30/07/2026

పొగాకు రైతులకు మూడేళ్లపాటు వడ్డీ లేని రుణం - ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌.

‎.. బ్యారెల్ కు 50 వేల వడ్డీ లేని రుణం.
‎.. "లో గ్రేడ్‌" పొగాకు పండించిన రైతులకు మూడేళ్లపాటు వెసులుబాటు.
‎.. అంతర్జాతీయ పరిణామాలతో తగ్గిన ధర.
‎.. గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
‎.. పొగాకు బోర్డు సమావేశంలో మాట్లాడిన ఏలూరు ఎంపీ.

‎ఢిల్లీ/ఏలూరు, జూలై 30: పొగాకు రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ, గురువారం జరిగిన పొగాకు బోర్డు సమావేశానికి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల్లో పొగాకు ధర తగ్గిపోవడం, రైతుల రుణ కష్టాలను ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ బోర్డు దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం సమావేశ వివరాలపై ఒక వీడియో ప్రకటన విడుదల చేసిన ఎంపీ.. పొగాకు రైతులను ఆదుకునేందుకు తాను, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు పలుమార్లు కేంద్ర వాణిజ్య మంత్రితోనూ, బోర్డు ఛైర్మన్‌, సభ్యులతో మాట్లాడినట్లు చెప్పారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్యారల్‌ కు 50వేల వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు పొగాకు బోర్డు అంగీకరించిందని ఎంపీ వెల్లడించారు. దీని వల్ల "లో గ్రేడ్‌" పొగాకు పండించిన రైతులకు కొంతవరకూ వెసులుబాటు లభిస్తుందన్నారు.

‎ అంతర్జాతీయ పరిణామాల వల్ల ఈ ఏడాది ధర బాగా తగ్గిన మాట వాస్తవమేనన్న ఎంపీ, అనుమతించిదాని కంటే రైతులు అధికంగా పండించడం కూడా సమస్యలకు కారణమవుతోందన్నారు. లో గ్రేడ్‌ పొగాకు కొనుగోళ్లకు కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయన్న ఎంపీ, గిట్టుబాటు ధర కల్పించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామన్నారు. రైతులు సంతోషంగా ఉండటమే తమ ధ్యేయం అని, గత రెండేళ్లు పొగాకుకు మంచి ధర వచ్చేందుకు కృషి చేసి గరిష్టంగా కేజికి రూ. 470 వచ్చే విధంగా చేయగలిగామని, ఈ ఏడాది కనీసం 300 పైన ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఎంపీ వివరించారు.

30/07/2026

ఏలూరు జిల్లా,

కొయ్యలగూడెం మండలం మంగపతి దేవి పేటలో పెద్దపులి కలకలం

రెండు ఆవులపై పెద్దపులి దాడి , ఆవులు మృతి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాత్రి వేళలో ఒంటరిగా తిరగవద్దని హెచ్చరికలు జారీ చేసిన అటవీ శాఖ అధికారులు

Address

Southern Street, Near Markandeya Swamy Temple
Eluru
534001

Website

Alerts

Be the first to know and let us send you an email when Eluru Digital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share