23/06/2024
ఇవి జగన్ రెడ్డి కట్టిన ప్రభుత్వ భవనాలు అనుకుంటున్నారా ? కాదు, ఊరూరా జగన్ రెడ్డి ప్యాలెస్‌లు.
తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు యలహంకా ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్ ప్యాలెస్, రుషికొండ ప్యాలెస్, ఇడుపులపాయ ప్యాలెస్, ఇలా తొమ్మిది నగరాల్లో తన సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్న జగన్ రెడ్డి, ఇప్పుడు ఏకంగా తన పార్టీ ఆఫీసులు కోసం కూడా ప్యాలెస్ లు కట్టేస్తున్నాడు. అది కూడా ప్రజాధనంతో అనుమతులు లేకుండా.
26 జిల్లాల్లో 42.24 ఎకరాలు ప్రభుత్వ భూమి, తన పార్టీ ఆఫీసులకు ఎకరానికి రూ.వెయ్యికి, 33 ఏళ్ళు లీజుకి ఇచ్చేసాడు. 42.24 ఎకరాల భూమి విలువ రూ.688 కోట్లు కాగా, ఈ 26 ప్యాలెస్ ల నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. ఈ 26లో ఒక్క ప్రకాశం తప్ప, ఏ భవనానికి అనుమతులు లేవు. ఈ ప్యాలెస్ లు అన్నీ, వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి చెందిన రాంకీ ఇన్‌ఫ్రా సంస్థే కడుతుంది.
ప్రజలను కొట్టి, తన పార్టీకి కట్టబెట్టేసాడు జగన్ రెడ్డి.