16/08/2023
డబ్బు సహాయం చేశాడని ఓయో లో రొమాన్స్, రివర్స్ గేర్ తో రూ. 82 లక్షలు !
By eye news GTL
బెంగళూరు: బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ మహిళకు కష్టకాలంలో ఓ ప్రభుత్వ రిటైడ్ ఉద్యోగి ఆర్థిక సాయం అందించాడు. ఈ అప్పు తీర్చేందుకు, సహాయం చేసినందుకు మీ రుణం తీర్చుకుంటానని ఓయో రూమ్ కు పిలిపించి అతనితో రొమాన్స్ చేస్తూ సీక్రేట్ గా వీడియో తీశారు. హనీట్రాప్ వీడియోలు అడ్డం పెట్టుకుని ముసలాడికి దసరా పండుగా అంటూ అతన్ని బ్లాక్ మెయిల్ చేసి రూ. 82 లక్షలు లాక్కొన్నారు.
డబ్బులన్నీ పోగొట్టుకుని వీధిన పడడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అసలు సినిమా మొదలైయ్యింది. హనీట్రాప్‌లో చిక్కుకున్న వ్యక్తి బెంగళూరు నగరంలోని జయనగరలో నివాసం ఉంటున్న సుధీంద్ర (రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి)ని హనీట్రాప్ చేసింది రీనా, స్నేహ, లోకేష్ అని పోలీసులు చెప్పారు.
ఇలా ఒక మహిళ కష్టకాలం గడుపుతుంటే ప్రభుత్వ రిటైడ్ ఉద్యోగి సుధీంద్ర చలించిపోయాడు, తరువాత సుధీంద్ర రీనా ఖర్చుల కోసం ఆమెకు రూ. 5 వేలు ఇచ్చాడు. సుధీంద్ర ఆర్థిక సహాయం అందించడంతో ఆయనకు రీనా దగ్గర అయ్యింది. మీ ఆర్థిక సాయం చేస్తున్నారని, మీ రుణం తీర్చుకుంటానని చెప్పిన రీనా బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లోని ఓయో గదికి సుధీంద్రను పిలిపించింది.
తరువాత సుధీంద్రకు ఇష్టం లేకపోయినా రీనానే బలవంతంగా ఆయనతో రొమాన్స్ చేసి ఆయన కోరిక తీర్చిందని తెలిసింది. ఇద్దరూ రూమం లో రొమాన్స్ చేస్తున్న సమయంలో సుధీంద్రకు తెలీకుండా రీనా సీక్రేట్ గా వీడియోలు చిత్రీకరించింది. ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వ రిటైడ్ ఉద్యోగి సుధీంద్ర నుంచి బలవంతంగా డబ్బులు లాక్కోవడానికి రీనా సిద్ధమైంది.
ఓయో గదిలో జరిగిన రొమాన్స్ వీడియోను సుధీంద్రకు పంపించిన రీనా అతన్ని బ్లాక్ మెయిల్ చేసింది. హనీట్రాప్ వీడియోలతో సుధీంద్రను బ్లాక్ మెయిల్ చేసిన రీనా అతని నుంచి అంచెలంచెలుగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. ప్రభుత్వోద్యోగిగా పదవీ విరమణ చేయగానే వచ్చిన డబ్బులన్నీ రీనా లాగేసుకుంది.
హనీట్రాప్‌లో పడిన సుధీంద్ర నుంచి రీనా ఇప్పటి వరకు రూ. 82 లక్షలు వసూలు చేసింది. దీంతో సంతృప్తి చెందని రీనా ఆమె స్నేహితులు స్నేహా, లోకేష్ తో కలిసి సుధీంద్రను మళ్లీ బ్లాక్ మెయిల్ చేశారు. రూ. 42 లక్షలు డబ్బులు ఇవ్వకుంటే ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీ ఇంటి పక్కన నివాసం ఉంటున్న అందరికీ షేర్ చేస్తానని సుధీంద్రను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.
అయితే పదేపదే బ్లాక్ మెయిల్ చేస్తున్న రీనా టార్చర్ తట్టుకోలేక ధైర్యం చేసిన సుధీంద్ర బెంగళూరులోని జయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇస్తానని సుధీంద్రతో మంగళవారం ఫోన్ చేయించిన పోలీసులు పక్కా స్కెచ్ తో కిలాడీ లేడీలు రీనా, స్నేహా, లోకేష్ లను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరు నగరంలో 60 ఏళ్లు దాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైడ్ అయిన ముసలాడు హనీట్రాప్ లో పడ్డాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.