Rajadhani Vartalu

  • Home
  • Rajadhani Vartalu

Rajadhani Vartalu Breaking News from Capital Amarvati, AP, TS, National,International-rajadhanivartalu.com
9440662699 In print a weekly newspaper since Oct-2015.

PROFESSIONAL PROFILE

VASTITUDE MEDIA Pvt.Ltd: Founder & Managing Director - 2015 to till date
• Established a media house in 2015 to play an important role in print, digital & social media activities. Also publishing news on digital & social media plotforms like website, youtube, facebook & twitter. In addition conducting press briefs, business meet-ups
• Accredited Journalist from the government

of Andhra Pradesh since 2015, Card no: SHQ-0664

RAJADHANI VARTALU: A print publication weekly
• Editor & Publisher of ‘Rajadhani Vartalu’, a Telugu weekly newspaper. First news weekly being published from Amaravati, Capital City of AP
• Publishing people’s problems & propagate government schemes to the people, thus being a catalyst in the development of AP. This 7-year-old weekly has won the appreciation from all sections of AP
• Distribution to AP secretariat & Assembly employees, Ministers, Officers and in local communities surrounding Mangalagiri, Guntur & Vijayawada

ONLINE
• Rajadhanivartalu.com - an online website, publishing daily news
• Social Media- Publish news on regular intervals on various platforms’ like facebook, youtube, twitter

INFORMATION TECHNOLOGY: 1999 - 2014
• NRI, Returned from America, Worked in Top software firms like Oracle America, NEC Electronics, Keane, Polycom & Top 5 consulting firms like Deloitte, Fox, Barclays Bank, Dolby Labs, HCMC, Wells Fargo & UTHCT
• Lived in USA for 14 years. Senior IT professional with PeopleSoft-Oracle implementation experience incorporating best business practices. Acted as a Liaison, recruited consultants for projects, helped clients at onsite, certified in ITIL with excellent communication and inter-personal skills

ACHIEVEMENTS, COMMUNITY SERVICE & INTERESTS
• Legal: Won the case thus, helped release INR 227 Cr. on Dec 27th from the government of AP to Engineering students of year 2019-2020 under Jagananna Vidyadeevena Fees Reimbursement Scheme by filing Public Interest Litigation(PIL) - 67 of 2021
• Helped build local prayer hall for Muslim welfare society of Rayapudi by donating Rs.15 lakhs
• Sponsored students education & make them the best citizens of the Nation
• Promote Education, Youth Training & Skill development
• Mentoring students on technology, guide them on the available jobs both at home & in USA
• Creating awareness on Human rights, Greenery, government schemes for the welfare of the people
• Despite previous government’s obstacles, helped in felicitating farmer’s grievances, assigned land owners, students & farm labors, bring the issues to the notice of govt. for amicable issue resolutions
• Lives in Rayapudi, which is in the core capital area of Amaravati, AP

OTHERS
• Founder of Amaravati Welfare Council, AP – NGO, now handed over to Sri Ramanuja Trust
• President, AP Chapter-All India Small&Medium News Papers Federation (AISMNF),New Delhi– 2019

*గుంటూరు జిల్లా**తాడేపల్లి:**ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ మరియు క్రీడా భారతి అధ్యర్యంలో ఆంధ్ర క్వెస్ట్ ఫర్ ఒలంపిక్ గోల్డ్ అ...
14/09/2025

*గుంటూరు జిల్లా*

*తాడేపల్లి:*

*ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ మరియు క్రీడా భారతి అధ్యర్యంలో ఆంధ్ర క్వెస్ట్ ఫర్ ఒలంపిక్ గోల్డ్ అనే సమావేశం నిర్వహించారు..*

*జయభేరి అపార్ట్ మెంట్ సముదాయంలో జరిగిన సెమినార్ లో పాల్గొన్న క్రీడా కారులు, కోచ్ లు, మాజీ క్రీడా కారులు, క్రీడా భారతి సభ్యులు, ఇస్కా స్పోర్ట్స్ ఫౌండేషన్ సభ్యులు..*

*అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ఇస్కా స్పోర్ట్స్ ఫౌండర్ సునీల్* *మాట్లాడుతూ క్రీడల్లోని 4 రంగాల్లో అభివృద్ధిపరిస్తే 2036లో జరిగే ఒలంపిక్స్ లో ఆంధ్రప్రదేశ్ నుండి బంగారు పథకం సాధించేందుకు అవకాశం* *ఉందన్నారు..దీనికి క్రీడ భారతి ప్రభుత్వం సహకారంతో కొన్ని* *క్రీడలను దత్తత తీసుకుని ప్రైవేట్ సెక్టార్ తో కలసి ప్లేయర్స్ ను తీర్చి దిద్దనునట్టు తెలిపారు.పెద్ద గ్రూప్స్ తో కలసి ప్లేయర్స్ ను తయారు చేసి క్రీడా భారతికి*
*అనుసంధానం చేసి*
*గ్రామీణ నేపద్యం నుండి కోకో,కబడ్డీ ,పెద్ద గేమ్స్ అయిన ఫుడ్ బాల్, వాలీబాల్,బాస్కెట్ బాల్, జిమ్నాస్టిక్స్ లాంటి గేమ్స్ లో,పాల్గొనేందుకు ఒక డిజైన్ చేసేందుకు సెమినార్* *నిర్వహించామని అన్నారు.*
*సెమినార్ లో క్రీడలకు* *సంబంధించిన ప్రముఖుల సలహాలతో ప్రభుత్వనికి ఒక నివేదిక ఇవ్వనునట్టు తెలిపారు.*
*రాష్ట్ర,కేంద్ర గవర్నమెంట్ లు అలయెన్స్ గా ఉన్నాయి కాబట్టీ క్రీడలును మరింత ముందుకు* *తీసుకువెళ్తామని అన్నారు.*
*ఈ కార్యక్రమంలో క్రీడా భారతి జనరల్ సెక్రటరీ చంద్ర శేఖర్ జగుదర్, ఇస్కా స్పోర్ట్స్ ఫౌండర్ సునీల్, క్రీడా భారతి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ధనుంజయ్ రెడ్డి, బాల లత CIB డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.*

14/09/2025

*రేపటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్*

*4వ కాన్ఫరెన్సులో అంశాల వారీగా శాఖలపై సమీక్ష*

*వృద్ధిరేటు, పౌర సేవలు, ప్రభుత్వ పథకాలపై దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు*

*అమరావతి, సెప్టెంబరు 14:* ఈ నెల 15,16 తేదీల్లో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 4వ కలెక్టర్ల కాన్ఫరెన్సు జరుగనుంది. సచివాలయం ఐదో బ్లాక్ లో ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు ప్రారంభం కానుంది. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఆమేరకు అధికారులు కలెక్టర్ల కాన్ఫరెన్సులో సమీక్ష చేసేందుకు అంశాల వారీగా శాఖలను విభజించి ప్రజెంటేషన్లు రూపొందించారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో 15 తేదీన జీఎస్డీపీపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక రంగం నుంచి వ్యవసాయం అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగంలో భాగంగా పర్యాటకం, హౌసింగ్ తదితర శాఖల పురోగతి ఆయా జిల్లాల్లో ఎలా ఉందన్న అంశాన్ని కలెక్టర్ల నుంచి తెలుసుకోనున్నారు. రెండో అంశంగా సంక్షేమం, సూపర్ సిక్స్ పథకాలు, అన్నా క్యాంటీన్లు, పీ4 తదితర అంశాల అమలు ఎలా ఉందన్న దానిపై సమీక్ష జరుగనుంది. మూడో అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో భాగంగా రహదారులు, పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, సాగునీటి ప్రాజెక్టులు, ఇంధనం తదితర అంశాల పురోగతిపై వివరాలను తెలుసుకోనున్నారు. నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయితీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై ప్రజెంటేషన్ తో పాటు జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి ఏమిటన్న దానిపై కలెక్టర్ల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. ఇక రెండో రోజు 16 తేదీన ఐదో అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్ పై ప్రజెంటేషన్ తో పాటు కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఆరో అంశంగా ఐటీ, క్వాంటం వ్యాలీ, ఆర్టీఐహెచ్, వాట్సప్ లో పౌరసేవలు, డేటా లేక్, ఏఐ తదితర అంశాలను చర్చించనున్నారు. ఏడో కేటగిరీలో ఆదాయార్జన శాఖలైన రెవెన్యూ, భూములు, స్టాంపులు రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, అటవీ, ట్రాన్స్ పోర్టు, మున్సిపల్, పంచాయితీరాజ్ శాఖలపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకోనున్నారు. ఇక 8 వ అంశంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షించి సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ విభాగాలు అందించే పౌర సేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపైనా చర్చించనున్నారు.
*****"

Reg. pending fees reimbursements - RTF to colleges…
14/09/2025

Reg. pending fees reimbursements - RTF to colleges…

14/09/2025

సోము సవాల్‌కు ఉండవల్లి సై.. టైమ్, ప్లేస్ చెప్పాలన్న ఉండవల్లి!

బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్‌ను స్వీకరించిన ఉండవల్లి

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటన

సమయం, వేదిక చెబితే వస్తానంటూ వీర్రాజుకు స్పష్టీకరణ

రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో చర్చకు ఉండవల్లి సుముఖత

ఉపరాష్ట్రపతి ఎన్నికల వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ వివాదం

రాజకీయాల్లో సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మధ్య మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై బహిరంగ చర్చకు రావాలంటూ సోము వీర్రాజు విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రకటించారు. సమయం, వేదిక ఖరారు చేస్తే చర్చకు రావడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యం మైదానంలో గానీ, మీడియా సమక్షంలో గానీ ఈ చర్చను నిర్వహించుకుందామని ఉండవల్లి సూచించారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతగా సోము వీర్రాజుకు అన్ని విషయాలపై పూర్తి అవగాహన ఉంటుందని, అందుకే ఆయనతో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తికి మద్దతు ఇవ్వొద్దని ఆయన తెలుగుదేశం, వైసీపీ ఎంపీలను కోరారు. ఉండవల్లి వ్యాఖ్యలపై సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే ఆర్ఎస్ఎస్‌పై చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ఈ సవాల్‌పై తాజాగా స్పందించిన ఉండవల్లి, తాను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఎందుకు వ్యతిరేకిస్తానో ఈ బహిరంగ చర్చ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలియజేస్తానని అన్నారు. దీంతో ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం ఇప్పుడు బహిరంగ చర్చ వైపు అడుగులు వేస్తుండటంతో, ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ చర్చ జరుగుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

14/09/2025

అమరావతి

రేపు ఎల్లుండి..ఏపీ సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫెరెన్సు

కలెక్టర్ల కాన్ఫరెన్సులో 8 అంశాల పై ప్రధాన చర్చ

ఈసారి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సును విభిన్నంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్సు నిర్వహణ.

సరైన వ్యక్తి, సరైన చోట ఉండాలన్న లక్ష్యంతోనే కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశామన్న సీఎం చంద్రబాబు

రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో మొదటి రోజున జీఎస్డీపీ అంశంపై ప్రజెంటేషన్ ..

సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాల పురోగతిపై సమీక్ష..

కలెక్టర్ల నుంచి వివరాల సేకరణ..

ఇక రెండో అంశంగా సంక్షేమం, సూపర్ సిక్స్, అన్నా క్యాంటీన్లు, పీ4 అంశాలపై సమీక్ష

మూడో అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించిన ప్రజెంటేషన్
నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయితీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతి

రెండో రోజున ఐదో అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఆరో అంశంగా ఐటీ, క్వాంటం వ్యాలీ,

ఆర్టీఐహెచ్, వాట్సప్‌లో పౌరసేవలు, డేటా లేక్, ఏఐ తదితర అంశాలపై చర్చ.

ఏడో కేటగిరీలో రెవెన్యూ విభాగంలో భూములు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ లాంటి అంశాలపై జిల్లాల వారీగా వివరాల సేకరణ

రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష

ప్రభుత్వ విభాగాలు అందించే పౌరసేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపైనా చర్చ

రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ విజన్ ను పటిష్టంగా అమలు చేయాలన్న. సీఎం చంద్రబాబు

నెక్స్ జెన్ సంస్కరణలపై కమిటీ....

New delhi /AmaravathiGandikota wins 'Most Promising New Destination' award at BLTM 2025.Award received by Padmarani, AP ...
14/09/2025

New delhi /Amaravathi

Gandikota wins 'Most Promising New Destination' award at BLTM 2025.

Award received by Padmarani, AP Tourism representative, at Business Leisure Travel and MICE Exhibition.

Event held in New Delhi from September 11-13, 2025.

Gandikota recognized for its potential as a new and exciting tourist destination.

New Delhi /Amaravathi : Andhra Pradesh Tourism wins 'Most Promising New Destination' award for Gandikota at BLTM 2025. The award was received by Padmarani Seela, Chief Marketing Officer and Communication Officer of APTA, at the Business Leisure Travel and MICE Exhibition (BLTM 2025) in New Delhi.

The state's tourism department showcased its diverse offerings, including heritage sites, pristine beach destinations, rural tourism experiences, and eco-tourism initiatives, at the event held from September 11-13 at Yashobhoomi, India International Convention Centre (IICC).

Gandikota, known as "India's Grand Canyon," received the award in the 'Responsible Tourism Awards' category, supported by ICRT and the Ministry of Tourism, Government of India. This recognition is expected to boost Gandikota's appeal to adventure-seeking tourists.

During BLTM 2025, Andhra Pradesh Tourism representatives participated in B2B speed networking sessions, building relationships with corporate buyers, MICE planners, tour operators, destination management companies (DMCs), hospitality brands, and international tourism boards from countries like Sri Lanka, Israel, and St. Petersburg.

The Andhra Pradesh government aims to develop world-class MICE facilities in destinations like Visakhapatnam, Gandikota, and Suryalanka Beach, targeting conferences, corporate events, and incentive packages to become a leader in the MICE tourism segment.

The BLTM event, focused on business and MICE tourism in India, featured over 500 exhibitors and 15,000 pre-qualified buyers, showcasing Andhra Pradesh's tourism potential to a global audience.

ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత : నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల ...
14/09/2025

ప్రజా సమస్యల పరిష్కారానికే మెదటి ప్రాధాన్యత : నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

అందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరుగా హిమాన్షు శుక్లా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం తమ ప్రాణాల్ని అర్పించిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పేరుమీద ఏర్పడిన నెల్లూరు జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందన్నారు. గతంలో జిల్లా కలెక్టర్లుగా ఎంతోమంది గొప్పగా పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారని, వారి స్ఫూర్తి తో పనిచేసి అభివృద్ధిని కొనసాగిస్తా మన్నారు. ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ అధికారులు, ఇతరుల సమన్వయంతో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా గణనీయమైన పాత్ర పోషించాలని, ప్రభుత్వం చేసే మంచి పనులను అందరికీ తెలియజేయాలన్నారు.

2013 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన హిమాన్షు శుక్లా , విశాఖపట్నం అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పూర్తి చేసుకుని మొదటి పోస్టింగ్ తిరుపతి సబ్ కలెక్టర్ గా పనిచేశానని, అనంతరం టూరిజం డైరెక్టర్ గా, హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జాయింట్ కలెక్టర్ గా, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా పనిచేశానన్నారు. అనంతరం రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులుగా పనిచేస్తూ నెల్లూరు జిల్లాకు నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టానని వివరించారు.

14/09/2025

M advice police to adopt 4 R system to ensure best policing

Top priority to be given for law and order

Dot not spare criminals in the guise of politicians

CM advice police officials to use technology for better results

AMARAVATI: Chief Minister N Chandrababu Naidu directed the district Superintendents of police not to spare any one who resort to crime in the guise of politics. He said utmost priority should be given for law and order to attract investments and thereby pave way to increase growth rate of state. The Chief Minister said police should adopt four R system including React, Reach, Respond and Result for better policing. He said that police officials should give priority to react immediately and reach the spot after report of crime. At the same time they should respond immediately on fake campaign in media and social media platforms and adopt humanitarian approach towards those approach the police for help to get better results in policing.

Addressing the Superintendents of Police through video conference today, the Chief Minister stressed the need for updating of policing as the criminals resorting to crime in innovative ways and methods.

The Chief Minister said that from the very beginning he gave priority to law and order and successfully rooted out factionalism in Rayalaseema and naxalism in Telangana. As a result naxals resorted to bomb blast attack on him at Alipiri. He said Hyderabad attracted investments as he acted strictly to maintain law and order.

Stating that Vivekananda Reddy murder case itself is a case study for police, the Chief Minister said that now political leaders are resorting to crime in the guise of politics. He said at first they claimed Vivekananda Reddy’s death as a murder and demanded CBI inquiry and later involved his name in the case. He said police should study in depth over criminal politics.

The Chief Minister advised the police officials to use technology to get best results. He said police should adopt people friendly attitude and at the same time act tough on antisocial elements and on those who resort to fake campaign using social media platforms. He said if any peoples representative asked for any thing make it clear whether it is correct or not.

The Chief Minister said police should thwart the attempts of opposition parties conspiracy to create chaos in the name of protests. He said top priority should be given to maintain peace in the state for rapid growth and development of the state.

14/09/2025

పాలనలో ప్రజా సంతృప్తే కీలకం

పౌరసేవలు, పథకాల అమలుపై జవాబుదారీతనం ఉండాలి

15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పనిచేయాలి

ఈ నెల 15,16 తేదీల్లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు

ఐదేళ్లలో 125 కేబినెట్ సమావేశాలు, 25 కలెక్టర్ కాన్ఫరెన్సుల నిర్వహణ లక్ష్యం

సదస్సులో అంశాలపై మంత్రులు, కార్యదర్శులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

నెక్స్ జెన్ రిఫార్మ్స్ పై మంత్రులు, అధికారులతో కమిటీ

అమరావతి, సెప్టెంబరు 13: ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్న కలెక్టర్ల కాన్ఫరెన్సుపై శనివారం తన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పౌరసేవలు, సంక్షేమ పథకాలపై పబ్లిక్ పర్సెప్షన్‌ను విశ్లేషిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 10.5 శాతం వృద్ధి రేటుకు చేరుకున్నామని అన్నారు. 2029 నాటికి జీఎస్డీపీ రూ.29 లక్షల కోట్లకు చేరే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. 2034కు తలసరి ఆదాయం రూ.10.55 లక్షలకు చేరేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జీఎస్డీపీలో వ్యవసాయం అనుబంధ రంగాలే కీలకంగా ఉన్నాయని అన్నారు. ఈ లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో విభాగాధిపతులు పనిచేయాల్సి ఉందని సీఎం స్పష్టం చేశారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకూ 25 కేబినెట్ సమావేశాలు నిర్వహించామని.. ఐదేళ్లలో 125 కేబినెట్ సమావేశాలతో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా అదే సంఖ్యలో రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాలు నిర్వహణ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే ఏడాదిలో ప్రతీ త్రైమాసికానికి ఒకసారి చొప్పున ఐదేళ్లలో 25 జిల్లా కలెక్టర్ సమావేశాలూ నిర్వహిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో 3 శాతం వృద్ధి తగ్గిన కారణంగా రాష్ట్రం సుమారుగా రూ.6 లక్షల కోట్ల సంపద కోల్పోయిందని అన్నారు.

కలెక్టర్ల కాన్ఫరెన్సులో 8 అంశాల వారీగా చర్చ

ఈసారి జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సును విభిన్నంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పౌరసేవలు, పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్టు తెలిపారు. సరైన వ్యక్తి, సరైన చోట ఉండాలన్న లక్ష్యంతోనే కలెక్టర్లు, ఎస్పీలను బదిలీ చేశామని అన్నారు. తాను 4వ సారి ముఖ్యమంత్రి అయినా ప్రజాప్రయోజనాల కోసం నిరంతరం ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటూనే ఉంటానని సీఎం అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మెరుగైన పాలన అందించే అంశంపై అధ్యయనం చేస్తూ ఉండాలని సూచించారు. రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సదస్సులో మొదటి రోజున జీఎస్డీపీ అంశంపై ప్రజెంటేషన్ లో భాగంగా సేవలు, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం తదితర రంగాల పురోగతిపై సమీక్షిస్తామని తెలిపారు. జిల్లాలు ఈ రంగాల్లో ఎక్కడ ఉన్నాయన్న దానిపై కలెక్టర్ల నుంచి వివరాలు తెలుసుకుంటామన్నారు. ఇక రెండో అంశంగా సంక్షేమం, సూపర్ సిక్స్, అన్నా క్యాంటీన్లు, పీ4 తదితర అంశాలను సమీక్షించనున్నట్టు తెలిపారు. మూడో అంశంగా లాజిస్టిక్స్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించిన ప్రజెంటేషన్ ఉంటుందని తెలిపారు. నాలుగో అంశంగా స్వచ్ఛాంధ్ర, సర్క్యులర్ ఎకానమీ, పంచాయితీరాజ్, మున్సిపల్ తదితర అంశాలపై జిల్లాల వారీగా పురోగతి తెలుసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇక రెండో రోజున ఐదో అంశంగా మానవ వనరుల అభివృద్ధి, వైద్యారోగ్యం, విద్య, స్కిల్ డెవలప్మెంట్, ఆరో అంశంగా ఐటీ, క్వాంటం వ్యాలీ, ఆర్టీఐహెచ్, వాట్సప్‌లో పౌరసేవలు, డేటా లేక్, ఏఐ తదితర అంశాలను చర్చిస్తామని వివరించారు. ఏడో కేటగిరీలో రెవెన్యూ విభాగంలో భూములు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ లాంటి అంశాలపై జిల్లాల వారీగా వివరాలు తెలుసుకుంటామని స్పష్టం చేశారు. ఇక రెండో రోజు 8వ అంశంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సమీక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వ విభాగాలు అందించే పౌరసేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయిపైనా చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ విజన్ ను పటిష్టంగా అమలు చేయాలని సీఎం పేర్కోన్నారు.

నెక్స్ జెన్ సంస్కరణలపై కమిటీ

ఆర్టీజీఎస్ ద్వారా నేపాల్‌లో చిక్కుకు పోయిన తెలుగు వారిని వెనక్కు తీసుకువచ్చే ఆపరేషన్ విజయవంతమైందని సీఎం వ్యాఖ్యానించారు. మంత్రి నారా లోకేష్ సహా అధికారులు కృషి చేశారని, దీనిపై ప్రజల్లో ప్రభుత్వం పట్ల మంచి సానుకూల స్పందన వచ్చిందన్నారు. వివిధ సంక్షోభ సమయాల్లో సరిగ్గా స్పందిస్తేనే ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరుగుతాయని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకూ పనితీరు మెరుగుపర్చేందుకు అవసరమైన శిక్షణా కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించాలని సీఎం సూచించారు. అమరావతిలోని సీఆర్డీఏ భవనంలో మానవ వనరుల నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం ఇటీవల జీఎస్టీని రెండు స్లాబులకు కుదిస్తూ తెచ్చిన సంస్కరణ విజయవంతమైందని.. ఏపీలోనూ నాలా పన్ను రద్దు చేసి నెక్స్ జెన్ సంస్కరణను అమలు చేశామని సీఎం అన్నారు. దీనిపై మరింత అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులతో కమిటీ వేయాలని సీఎం సూచించారు. మరోవైపు చిన్న చిన్న కోర్టు వివాదాల కారణంగా ప్రభుత్వ సమయంతో పాటు ధనమూ వృధా అవుతోందని.. ఆర్బిట్రేషన్ ద్వారా కొన్ని అంశాలను పరిష్కరించుకునే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

AP Legislature welcomes...
14/09/2025

AP Legislature welcomes...

14/09/2025

*తెలుగు వైభవంగా ఎన్టీఆర్ స్మృతివనం*

*తెలుగు సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, కళలు ఉట్టిపడేలా ప్రాజెక్టు*

*అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ వంతెనపై సీఎం సమీక్ష*

*ఎన్టీఆర్ విగ్రహం నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు*

అమరావతి, సెప్టెంబరు 13: తెలుగువారి ఆత్మగౌరవం- ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని సూచించారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన అల్లూరి, పొట్టిశ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతీ సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియచెప్పేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలుగు ప్రజల ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిని కూడా ప్రతిబింబించేలా ప్రాజెక్టు చేపట్టాలన్నారు. 182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతి వనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్ ను తీర్చిదిద్దాలన్నారు. ప్రత్యేకించి పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించేందుకు అనువుగా ఆకర్షణల్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గుజరాత్ లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన డిజైన్లను కూడా సీఎం పరిశీలించారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకముందు ఎన్టీఆర్ విగ్రహ నమూనాలను పరిశీలించారు.

Address

6-45/1

522237

Opening Hours

Monday 08:30 - 21:00
Tuesday 08:30 - 21:00
Wednesday 08:30 - 21:00
Thursday 08:30 - 21:00
Friday 08:30 - 21:00
Saturday 08:30 - 21:00
Sunday 08:30 - 21:00

Telephone

+919440662699

Alerts

Be the first to know and let us send you an email when Rajadhani Vartalu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Rajadhani Vartalu:

  • Want your business to be the top-listed Media Company?

Share