TeamKasu

TeamKasu Jai Jagan Jai Kasu

మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన కందుల నర్సిరెడ్డి కుమారుడు ఉమా మహేశ్వరరెడ్డి వివాహ వేడుకలో పాల...
01/05/2026

మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన కందుల నర్సిరెడ్డి కుమారుడు ఉమా మహేశ్వరరెడ్డి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన వై.యస్.ఆర్.సి.పి పల్నాడు జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు.


మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం కాచవరం గ్రామంలో జక్కిరెడ్డి నాగిరెడ్డి (పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు) ఇటీవ...
27/04/2026

మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం కాచవరం గ్రామంలో జక్కిరెడ్డి నాగిరెడ్డి (పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షుడు) ఇటీవల్లే ప్రమాదవశాత్తు గాయపడి హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర కార్యదర్శి పెదకూరపాడు నియోజకవర్గం పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి గారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) మెంబర్ మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు మరియు కారంపూడి మండలం వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం…వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై కత్తులతో దాడి చేసిన టిడిపి గుండాలు..• తీవ్రంగా గ...
13/04/2026

పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పై కత్తులతో దాడి చేసిన టిడిపి గుండాలు..

• తీవ్రంగా గాయపడ్డ మండాది వైసీపీ నేతలు..

• ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అండతో కత్తులతో వీరంగం సృష్టించి దాడి చేసిన గుండాలు..

• పోలీసుల అలసత్వంతో దాడులకు తెగబడుతున్న టిడిపి రౌడీ మూకలు ..

కత్తులు, రాడ్లతో తమకు ఎదురు వచ్చిన వారిని, సామాన్యులపై దాడులకు పాల్పడుతూ మాచర్ల నియోజకవర్గాన్ని టిడిపి నేతలు రౌడీ రాజ్యంగా మార్చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగుతున్న టిడిపి నేతల రక్త దాహానికి సామాన్యులు, ప్రజలు, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు బలవుతున్నారు.

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అండ, పోలీసుల మెతక వైఖరితో రౌడీలు రెచ్చిపోతూ కత్తులతో దాడులకు పాల్పడుతున్నారు.

సోమవారం మాచర్లలో జరిగిన కత్తిపోట్ల దాడులు కలకలం సృష్టించాయి.

నియోజకవర్గం లోని వెల్దుర్తి మండలం మండాది గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పులి కృష్ణారెడ్డి, అయన మేనల్లుడు గాదె శ్రీనివాసరెడ్డిపై టిడిపి గుండాలు కత్తులు, రాడ్లతో విరుచుకుపడి విచక్షణ రహితంగా దాడి చేసారు.

గాదె శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత పనుల నిమిత్తం మాచర్లకు వచ్చినాడు. తన వ్యక్తిగత పనులు ముగించుకొని స్వగ్రామం మండాది వెళ్తుండగా. రింగురోడ్డు వద్ద ఉన్న టిడిపి గుండాలు శ్రీనివాసరెడ్డి బైక్ పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి బొమ్మ చూసి ఆ బొమ్మని తీసెయ్యాలి అని బెదిరించారు. తనకు అభిమానం తో పెట్టుకున్న బొమ్మను తాను తొలగించను అని చెప్పడంతో తమ వద్ద ఉన్న కత్తులతో దాడికి తెగబడ్డారు.

పక్కనే ఉన్న కొందరు శ్రీనివాసరెడ్డిని కొంచెం పక్కకు లాగడం తో మెడపై తెగల్సిన కత్తి తృటీలో తప్పి మరో చోట గాయమైంది. హుటాహుటిన బాధితుణ్ణి వైద్యం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.

శ్రీనివాసరెడ్డిని చూసేందుకు వచ్చిన కృష్ణారెడ్డి పై సైతం కత్తులతో దాడికి తెగబడి తీవ్రంగా గాయపర్చారు. మాచర్ల నడి రోడ్డుపై ఇంతటి దాడులు జరుగుతున్నా పోలీసులు చర్యలు తీసుకోక పోవడం వల్లే రౌడీ ముకలు దాడులకు తెగబడుతూ సామాన్యులపై కత్తులతో విరుచుకు పడుతున్నారని బాధితులు, మాచర్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

🚨Breaking News🚨చిలకలూరిపేట కు చెందిన టీడీపీ NRI రావి మురళీ చౌదరి సంచలన వ్యాఖ్యలు 2024 ఎన్నికల సమయంలో 10 లక్షలు సర్దమని అ...
05/04/2026

🚨Breaking News🚨

చిలకలూరిపేట కు చెందిన టీడీపీ NRI రావి మురళీ చౌదరి సంచలన వ్యాఖ్యలు

2024 ఎన్నికల సమయంలో 10 లక్షలు సర్దమని అడిగితే, తానిచ్చానని, ప్రస్తుత పరిణామాలు చూసి ఆ రోజు ఎందుకు సహాయం చేశానా అని మదన పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసారు.

చిలకులూరిపేట లో మురళి చౌదరి 60 కోట్ల రూపాయలతో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రతిపాటి అనుచరులు కబ్జా చేస్తే, జూలకంటి ని మాట సాయం చేయమంటే కూడా ముఖం చాటేశారని తన బాధను వ్యక్తం చేసారు.

ఎన్నికలప్పుడు తనను వాడుకుని, ఈరోజు సాయం కోరితే కనీసం స్పందించడం లేదని వాపోయారు.

మాచర్ల లో జూలకంటి అరాచక పాలన చూశాక తాను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమవుతుందని అన్నారు.

ఎన్నికలప్పుడు 10 లక్షలు కోసం చేయి చాచిన జూలకంటి , నేడు కోట్లకు పడగలెత్తిన తరువాత తన లాంటి వారి వైపు కన్నెత్తి చూసిన పాప పోలేదని మండిపడ్డారు.

పిన్నెల్లి ని ఓడించడానికి తన వంతుగా జూలకంటి కి డబ్బు సాయం చేసినందుకు పిన్నెల్లి గారు , జగన్ గారు తనని క్షమించాలని కోరారు.


జిల్లా బూత్ కమిటీ విభాగం విస్తృత స్థాయి సమావేశం..!!పల్నాడు జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి...
02/04/2026

జిల్లా బూత్ కమిటీ విభాగం విస్తృత స్థాయి సమావేశం..!!

పల్నాడు జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి అధ్యక్షతన పల్నాడు జిల్లా బూత్ కమిటీల విభాగం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడనుంది. ఈ సమావేశం పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యాచరణ, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించుటకు ముఖ్య వేదికగా నిలవనుంది.

ఈ సమావేశానికి పల్నాడు జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, పల్నాడు జిల్లా పార్లమెంట్ మరియు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అనుబంధ అన్ని విభాగాల అధ్యక్షులు, పల్నాడు జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు, మండల బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

📍 స్థలం: పల్నాడు జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, నరసరావుపేట
📅 తేదీ : 04-04-2026
⏰ సమయం: సాయంత్రం 4.00

పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి, భారీగా పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయండి.

వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ – మాచర్ల



18/03/2026
16/03/2026

అకారణంగా, అక్రమ కేసులు మోపి పిన్నెల్లి గారిని, ఆయన సోదరుడిని వేధించడం ఎంతవరకు న్యాయం?
అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు…

ఈరోజు మీ చేతిలో ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు.
రేపు వైసీపీ అధికారంలోకి వచ్చి ఇదే విధంగా చేస్తే…
మీరు సహించగలరా?

రాజకీయాల్లో ప్రతీకారం కాదు… న్యాయం, ధర్మం ఉండాలి.

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ వసంతాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా… రేపు ఉదయం 11:00 గంటలకు...
11/03/2026

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ వసంతాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా…

రేపు ఉదయం 11:00 గంటలకు పిడుగురాళ్ల పట్టణ వైయస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఘనంగా జెండా ఆవిష్కరణ వేడుకలు...ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారు పాల్గొంటారు...

కావున వైఎస్సాఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు అభిమానులు అందరూ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము..

Address

Gurazala

Website

Alerts

Be the first to know and let us send you an email when TeamKasu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share