11/09/2024
శ్రీ సత్య సాయి జిల్లా:
ఈనెల 13న హిందూపురం పట్టణంలో జరిగే నిమజ్జన ఊరేగింపు. కార్యక్రమం సందర్భంగా..
హిందూపురం పోలీసు వారు ముఖ్య గమనిక...
హిందూపురం పట్టణము నందు 13-09-2024 వతేదీన జరుగుతున్న వినాయక చవితి నిమజ్జనము దృష్ట్యా హిందూపురం పోలీస్ వారి సూచనలు:
హిందూపురం పట్టణము నందు వినాయక చవితి నిమజ్జనం కార్యక్రము 13-09-2024 వతేది ఉన్న సందర్భంగా, హిందూపురం ప్రజలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు తెలియ చేయడం ఏమనగా
13-09-2024 వతేది నాడు హిందూపురం పట్టణము నందు సుమారు 130 వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమము ఉన్నందున సదరు విగ్రహాలు BST సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్, పరిగి రోడ్డు, MF రోడ్డు, బై పాస్ రోడ్డు, మెయిన్ బజారు, రైల్వే రోడ్డు, బాలాజీ సర్కిల్, రహమత్ పురం సర్కిల్, MGM స్కూల్ రోడ్డు మీదుగా శ్రీ రంగనాధ స్వామి దేవస్థానము గుడ్డం వద్ద ఉన్న కోనేరు వరకు ఊరేగింపు గా వెళతాయి.
హిందూపురం పట్టణము నందు పెద్ద ఎత్తున ప్రజలు విగ్రహాలు చూసే నిమిత్తము బయటికి వచ్చే అవకాశము ఉన్నందున ఆ రోజు పట్టణము నందు ట్రాఫిక్ రద్దీ ఎక్కువ ఉండటము మూలాన, ఆ రోజు పట్టణ ప్రజలు ఎవరూ వారి వాహనాలను రోడ్ మీదికి తీసుకురావడము వలన ట్రాఫిక్ లో చిక్కుకుపోయి ఇబ్బంది పడే అవకాశము ఉన్నందున,ఎవరూ కూడా అత్యవసర పరిస్థితులలో తప్ప వారి వాహనాలను ప్రధాన రహదారుల మీదకు ముఖ్యముగా నిమజ్జమనుకు ఊరేగింపుగా వెళ్ళే మార్గములోకి తీసుకురాకూడదని తెలియచేయడము అయినది.
అత్యవసర పరిస్థితి ఏదైనా ఉంటె ప్రత్యామ్నాయ మార్గాలలో బయటకు వెళ్లవలసినదిగా తెలియచేయడము అయినది.
అలాగే 13-09-2024 ఉదయము 11 గంటల నుండి RTC బస్సులకు మరియు ఇతర భారీ వాహనాలు, కార్లు తదితర వాటికి పట్టణములోనికి ప్రవేశము లేదు. హిందూపురం పట్టణానికి సంబందించిన వాహనదారులు ఎవరైనా బయటి నుండి వస్తూ ఉంటే వారు ప్రత్యామ్నాయ మార్గాలలో (ప్రధాన రహదారులలో కాకుండా చిన్న సందులలో) పట్టణములోనికి వెళ్ళవలసి ఉంటుంది. దీనికి అనుగుణముగా హిందూపురం పట్టణ చుట్టూ ప్రక్కల ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేయడం జరిగినది.
1) అనంతపురము వైపు ట్రాఫిక్ మళ్లింపు:
అనంతపురము వైపు నుండి వచ్చు RTC బస్సులు RTC బస్ స్టాండ్ వరకు మాత్రమె రావడము జరుగును. అక్కడి నుండి తిరిగి వెనుకకు వెళ్ళిపోవలసి ఉంటుంది. అక్కడి నుండి హిందూపురం పట్టణములోనికి ఎటువంటి పరిస్థితులలో అనుమతి ఉండదు.
గోరంట్ల వైపు నుండి వచ్చు RTC బస్సులు మినహా అన్ని రకాల ఇతర వాహనాలు అన్నియూ కొట్నూరు క్రాస్ వరకు మాత్రమె అనుమతించబడుతుంది. అక్కడ నుండి అనంతపురం, పెనుకొండ, మడకశిర వైపు కు దగ్గర ఉన్న శిరా హైవే మీదుగా పోవలసి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో హిందూపురం పట్టణములోనికి అనుమతి లేదు.
2) లేపాక్షి వైపు ట్రాఫిక్ మళ్లింపు:
లేపాక్షి వైపు నుండి వచ్చు RTC బస్సులు చోళ సముద్రం క్రాస్ నుండి హైవే మీదుగా కొత్త హిందూపురం పట్టణము వైపుకు రావడం జరుగును. ఎటువంటి పరిస్థితులలో మల్లిరేద్ది పల్లి గ్రామము మీదు గా హిందూపురం పట్టణము లోనికి అనుమతి లేదు.
3) బెంగళూరు వైపు ట్రాఫిక్ మళ్లింపు:
బెంగళూరు వైపు నుండి వచ్చు RTC బస్సులతో సహా అన్ని రకాల ఇతర వాహనాలు అన్నియూ ఆటో నగర్ క్రాస్ నుండి రహమత్ పురం సర్కిల్ మీదుగా అండర్ పాస్ బ్రిడ్జి కింద నుండి కొత్త బైపాస్ మీదుగా శ్రీకంటపురం సర్కిల్ మీదుగా చోళసముద్రం క్రాస్ మీదుగా శిరా హైవే గుండా అనంతపురము వైపు కాని లేదా కొడికొండ వైపు గాని వెళ్ళవలసి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో హిందూపురం పట్టణములోనికి అనుమతి లేదు.
4)మడకశిర వైపు ట్రాఫిక్ మళ్లింపు:
మడకశిర వైపు నుండి వచ్చు RTC బస్సులు సేవమందిర్ క్రాస్ వరకు మాత్రమె అనుమంతించబడతాయి. అక్కడి నుండి తిరిగి వెనుకకు వెళ్ళిపోవలసి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలో హిందూపురం పట్టణములోనికి అనుమతి లేదు.
హిందూపురం టౌన్ నందు వినాయక చవితి విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి మొత్తము 1200 మంది పోలీసులతో గట్టి బందోబుస్ట్ ఏర్పాటు చేయడమైనది. పరమత సహనము చాలా గొప్పది. పట్టణ ప్రజలు పోలీస్ డిపార్టుమెంటు వారు నిమజ్జనము జరుగు రోజు శుక్రవారం అయినందున, అందుకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నిబంధనలను పాటించి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా నిమజ్జన కార్యక్రమము సాఫీగా జరిగేందుకు సకరించవలసినదిగా హిందూపురం పోలీసు వారి తరుపున విజ్ఞప్తి చేయడం అయినది.
సబ్-డివిజినల్ పోలీసు అధికారి, హిందూపురం.