Praja Kshetram

Praja Kshetram News compeny

11/11/2023

నామినేషన్ వేసిన బర్రెలక్క -

09/11/2023

రాజేష్ మహాసేన నా ఇంటిపై దాడి చేయబోయాడు..!TV9 Nagavalli False Complaint On Rajesh Mahasena | MHS

08/11/2023

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చెట్టు ఫోటో వేసి ఓటు హక్కు కల్పించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మూడు ఓట్లున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో ఇటువంటి అవకతవకలు లక్షలాదిగా జరిగాయి.











08/11/2023

గురువారం (నవంబరు 9) నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇందులో నాలుగు కార్యక్రమాలు ఉంటాయి. ఇందులో కీలకమైనది డోర్ టు డోర్ క్యాంపెయిన్.

- వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

08/11/2023

2014 టీడీపీ మేనిఫెస్టోని చంద్రబాబు అధికారంలోకి రాగానే వెబ్‌సైట్ నుంచి తీసేశాడు. ఆ మేనిఫెస్టోలో ఏడాదికి 12 సిలిండర్లని ఇస్తానని బాబు హామీ ఇచ్చాడు. కానీ.. గెలిచిన తర్వాత ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ ఏడాదికి మూడు సిలిండర్లని ఇస్తానని హామీ ఇస్తున్నాడు. బహుశా పాత హామీని అందరూ మర్చిపోయి ఉంటారని బాబు అనుకుంటున్నాడేమో.

- వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి



08/11/2023

ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీకి కూడా లేనంత ధీమా, విశ్వాసంతో మేము ప్రజల్లోకి వెళ్తాం. సీఎం వైయస్ జగన్ గారి విజన్, ఈ ఐదేళ్ల పాలన పట్ల మాకున్న నమ్మకం అలాంటిది. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మా ప్రభుత్వం ప్రజలను కాపాడుకుంటూ వచ్చింది. మేం చేసిన పనులను చెబుతూ ప్రజలముందుకు వెళ్తాం..



08/11/2023

సత్య సాయి బాబా వారి 98వ జన్మదిన వేడుకల్లో టెక్కలి సాయి మందిరం నుండి అంబేద్కర్ కొడాలి వరకు సత్య సాయి బాబా వారి పల్లకి ఊరేగింపులో వివిధ వేషధారణలో చిన్నారులు,
కోలాట బృందాలు, సాయి భక్తులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం టెక్కలి జోన్ సత్య సాయి కన్వీనర్ వై ఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బాబా వారి పల్లకీ యాత్రజరిగింది.

08/11/2023

ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో పంచాయతీ పారిశుధ్య కార్మికునిగా 20 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న ఇతనికి నెలకు జీతం 6000/- రూపాయలు ఇస్తున్నారని AIM జోనల్ ఇంచార్జ్ వద్ద తన బాధను వ్యక్తం చెసుకుంటున్న పారిశుధ్య కార్మికుడు.

08/11/2023

రాజానగరం నియోజకవర్గం *కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామం* నందు *“బాబు షూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ* కార్యక్రమం లో పాల్గొని కరపత్రాలు పంపిణీ చేసిన రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి *బొడ్డు వెంకటరమణ చౌదరి.

18/07/2023

కాకినాడ జిల్లా జగ్గంపేట:
ఇటీవల తోట నరసింహం మళ్ళీ కోలుకోవడంతో జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు రాంజీ మాట్లాడుతూ, “పంది ఎంత బలిసినా అది పందే అవుతుంది తప్ప ఏనుగు కాలేదు. ఇక్కడ పరిస్థితి కూడా సరిగ్గా ఇదే.

ఆయన ఇక్కడ మరో పదేళ్ళు కాదు ఇరవై ఏళ్ళు తిరిగినా మా తండ్రిగారికే ప్రజలు, కార్యకర్తలు మద్దతు ఉంటుంది. ఆయన మా నాన్నగారి గురించి ఏదేదో వాగుతున్నారు. వాటికి నేను కాదు మా నాన్నగారే సరైన సమాధానం చెపుతారు. వచ్చే ఎన్నికలలో జగ్గంపేట నుంచి ఆయనే పోటీ చేయబోతున్నారు. ఇది తధ్యం. కనుక ఆయనే నీ లెక్కలన్నీ తేల్చేస్తారు,” అని హెచ్చరించారు.

తోట నరసింహం మాట్లాడుతూ, “రాజకీయాలు మాకేమీ కొత్తకాదు. అవి మా రక్తంలోనే ఉన్నాయి. ఒక్క గంట టైమ్ ఇస్తే చాలా నీ సంగతి తేల్చేస్తాను. 100 ఎకరాలు ప్రభుత్వ భూమి కబ్జా చేశావని ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ ఆరోపించినప్పుడు సమాధానం చెప్పుకోలేకపోయావు కదా?కనీసం నీ అనుచరులు ఎవరూ కూడా వారి ఆరోపణలను ఖండించలేకపోయారు.

ప్రతిపక్షాలను చూస్తే భయపడేవాడివి నువ్వా నా గురించి మాట్లాడేది? నా గురించి మాట్లాడాలంటే పది జన్మలు ఎత్తాలని గుర్తుంచుకో. నాకు ఆరోగ్యం బాగోలేకపోవడం వలననే ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండిపోయాను. పూర్తిగా కొలుకున్నాను పార్టీ అవకాశం ఇస్తే జగ్గంపేట నుంచి పోటీ చేస్తాను.

Address

Regus, Level-1, Midtown Plaza, Road No-1, Banjara Hills. , Telangana
Hyderabad
500034

Telephone

+919948068577

Website

Alerts

Be the first to know and let us send you an email when Praja Kshetram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Praja Kshetram:

Share