17/12/2023
*ఉచితాలు కాదు – అభివృద్ధి , సంక్షేమమే*
*👉బంగారు తెలంగాణ అసలు లక్ష్యం*
సంక్షేమం – అభివృద్ది.
ప్రగతిదాయకమైన సమాజంలో ఈ రెండు అత్యంత కీలక భూమిక పోషించే అంశాలు.
ప్రజలతో ఎన్నుకొనబడిన పాలకులు ఈ రెండింటిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లవలసి ఉంటుంది.
అందుకు సమాజం కూడా బాధ్యతగా తన పాత్రను పోషించడం అత్యంత కీలకం.
ఈ రెండు అంశాల చుట్టే రాజకీయాలు తీరుగుతుంటాయి.
ప్రజలు కూడా ఈ రెండింటి అమలు విషయంలో పాలకులను నిషితంగా గమనిస్తుంటారు.
అభివృద్ది దాయకమైన సమాజంలో
సంపదను సృష్టించడం, మానవవనరులను సక్రమంగా వినియోగించడం, ఈ రెండింటి ఫలితాలను మెరుగైన సమాజ ప్రగతికి దోహదపడే విధంగా మలచుకోవడం,
పాలకుల కర్తవ్యంగా,
సమాజ హితం కోరే వారు భావిస్తుంటారు.
పేదరిక నిర్మూలన,
ఉపాధి కల్పన,
ఆర్దిక వనరుల పెంపు లాంటి అంశాల్లో వ్యవహరించే తీరును బట్టే సంక్షేమం, అభివృద్ది ఫలాల ఫలితాలను అట్టడుగు స్ధాయికి చేర్చే అవకాశం ఉంటుంది.
ఉత్పాదకతను పెంచడానికి, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు పాలకులు కొన్ని ఆకర్షనీయమైన పథకాలను అమలు పర్చడం,
వాటి నుండి రాజకీయ ప్రయోజనం పొందడం సర్వసాధారణ అంశం.
తెలంగాణ ఆవిర్బావం నుండి నేటి వరకు
పాలకులు అనేక ఉచితాలను అమలు జరుపుతున్నారు.
ఓటు బ్యాంకు రాజకీయల కోసం రాజకీయ పార్టీలు రాష్ట్ర ఆర్దిక పరిస్దితులను పరిగణలోకి తీసుకోకుండా ప్రలోభాలతో కూడిన రాజకీయ పాలనతో పబ్బం గడుపుతున్నారు.
ప్రజలు కూడా ఉచితాలపై ఆసక్తిను పెంచుకోవడంతో ఖజానా గుళ్లగా మారుతుంది.
*సంక్షేమం అనేది అవసరం అయిన వారికి అందించే సాయం.*
*ఉచితం కూడా అందరికీ సమానం అనడం సహేతుకం కానే కాదు.*
*దాని వల్ల సంపదను కొల్లగొట్టడమే తప్ప సృష్టించే అవకాశాలను కోల్సోతున్నాము.*
*మానవ వనరులను నిర్వీర్యం చేస్తున్నాము.*
ఉత్పదకత పై సామాన్యులు దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు.
యువ శక్తి నిర్వీర్యం అవుతుంది.
సోమరితనం ఆవరిస్తుంది.
ఉచిత బియం,
ఉచిత కరెంటు,
ఉచిత ప్రయాణం,
ఉచిత ఆర్దిక తోడ్పాటు అనేవి *పరిమితమైన వర్గాలకు మాత్రమే అందాలి.*
జీవనాధారం లేని వర్గాలను ఆదుకొనేందుకు మానవతా దృక్పదంతో అమలు చేయాల్సినవి.
కానీ ఈ ఉచితాల నుండి కోటీశ్వరులు,
సంపద సృష్టించేవారు, ఆర్దికంగా స్ధిరపడిన వర్గాలు కూడా ప్రయోజనం పొందుతున్నారు.
కులాలవారిగా ఆర్దిక ప్రయోజనాలు కల్పించే పథకాలు *మరో ఆర్దిక సంక్షోభానికి* దారి తీస్తున్నాయి.
ఈ ఉచితాలకు చేసే వ్యయంతో జిల్లాలు, మండల కేంద్రాల్లో *పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను* చేపట్టడం ద్వారా అర్హులైన వారిక ఉపాధి కల్పించడంతో పాటు ఉత్పాదకతను పెంచడంతో మార్కెటింగ్ వ్యవస్ద బలోపేతమై ఆర్దిక వనరులు మెరుగు పడే అవకాశం ఉంది.
అటుగా పాలకులు దృష్టి కేంద్రీకరించ లేక పోయారు.
ఉచితాలకు అలవాటు పడిన వర్గాలను దూరం చేసుకోవడం వల్ల రాజకీయంగా నష్టం వాటిల్లుతుందనే ధ్యాసే తప్ప
రాష్ట్రాన్ని ఆర్దికంగా బలోపేతం చేయడంతో, మౌలిక వనరులను పెంచి సామాజిక అసమానతలు, ఆర్ధిక అసమానతలు తొలగించే ప్రయత్నం చేసేందుకు పాలకులు సిద్దంగా లేరన్నది
ఇటీవలి పరిణామాలతో స్సష్టమవుతోంది.
అందుకే బంగారు తెలంగాన కోసం కోట్లాడిన, పోరాడిన, అనేక త్యాగాలకు వెనుకాడకుండా రాష్ట్రాన్ని సాధించుకున్న వర్గాలు
ఈ ఉచితాల పై ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను.
*నేను రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని*
నాకు Pension వస్తుంది
Income tax pay చేస్తున్నాను
నాకు కొంత భూమి వుంది
నేను వ్యవసాయం చేయడం లేదు
నాకు నాలాంటి వారికి రైతు భరోసా సహాయం అవసరం లేదు
*నాకు రైతు భరోసా వస్తే CM Relief Fund కు పంపిస్తాను*
నా భార్య గృహిణి
ఆమె పేరు మీద కొంత భూమి వుంది
వ్యవసాయం చేయడం లేదు
ఆమెకు రైతు భరోసా అవసరం లేదు
నా కుమారుడు వ్యాపారవేత్త
అతడి పేరు మీద కొంత భూమి వుంది
వ్యవసాయం చేయడం లేదు
అతనికి రైతు భరోసా అవసరం లేదు
నా కుమార్తె America లో వుంటుంది
ఆమె పేరు మీద కొంత భూమి వుంది
వ్యవసాయం చేయడం లేదు
ఆమెకు రైతు భరోసా అవసరం లేదు
నాకు, నాలాంటి వారికి,
పేద ప్రజలకు అందవలసిన ఇటువంటి సంక్షేమపథకాలు,
మాకు అవసరం లేదు
*మాలాంటి వాళ్లము ముందుకు వచ్చి , పేదలకు సంబంధించిన ఇటువంటి welfare schemes ను స్వచ్చందం గా వదులు కోవాలని విజ్ఞప్టి*
ప్రభుత్వాల పై ఆధార పడాల్సిన అవసరం లేని వర్గాలు స్వచ్ఛందంగా ఉచితాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము.
రైతులు, పేదలు, వితంతువులు, వికలాంగులకు చేయుతనివ్వడం సహేతుకమే అయినప్పటికీ ఆర్దికంగా స్దిరపడి, అత్యంత ఎక్కువ మొత్తంలో భూములు కలిగి ఉన్న వర్గాలు
రైతు బంధు లాంటి పథకాలకు ఆకర్షితులు కావడం వల్ల
రాష్ట్ర సంపదను మనమే కొల్ల గొట్టినవారం అవుతామనేది నా ఆలోచన.
*అందుకే నేను ఎలాంటి ఉచితాలు పొంద దలచుకోలేదు.*
*రైతు భరోసా పథకం ప్రయోజనం పొంద దలచుకోలేదు.*
ఇతరత్ర సహయం అవసరం లేకుండా
ఆర్దిక స్ధోమత కలిగి ఉన్న వర్గాలు
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా బంగారు తెలంగాణ ను తీర్చి దిద్దడంలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను.
తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దాలంటే
ముందుగా తెలంగాణ వాదుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాను.
రాష్ర సంపధను ఉత్పదకేతర వ్యయాలకు ఖర్చు చేయడం ద్వారా బంగారు తెలంగాణ సాధన స్వప్నం సార్దకం కాదనేది నా భావన.
యువతకు ఉపాది కల్పించాలి,
అన్ని వర్గాలకు జీవనోపాధి కల్పించడం ద్వారా
వారి కుటుంబ ఆదాయం పెంచే ప్రయత్నం జరగాలి.
అప్పుడే ఉచితాలపై ఎవరు కూడా పెద్దగా ఆసక్తి కనబర్చే అవకాశం ఉండదు.
*ఈ నా ఆలోచన మీతో పంచుకుంటున్నాను.*
మరిన్ని నా ఆలోచనలు మీతో పంచుకోవాలని భావిస్తున్నాను.
చైతన్యవంతమైన ఆలోచనలతోనే తెలంగాణను అభివృద్ది చెందిన రాష్ట్రంగా తీర్చి దిద్దుకోవాలనే నా తపనకు ఆలోచనాపరులు తోడ్పాటు కావాలని కోరుకుంటున్నాను.
*కొలను వెంకటేశ్వర రెడ్డి*
SP Jails (Retired)
*Convener*
Telangana Uniformed Employees JAC
*(Police, Prisons, Fire, Transport, Forest, Excise, Weights & Measures 7-Departments)*