RAGA tv telugu

  • Home
  • RAGA tv telugu

RAGA tv telugu telugu digital channel

11/06/2025

హీరో నిఖిల్ సినిమా షూటింగ్లో భారీ ప్రమాదం

ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్లో ఘటన

శంషాబాద్ సమీపంలో సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో లొకేషన్ మొత్తం వరద

అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు.. మరికొంత మందికి గాయాలు

కొంచెం డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు విను అన్నా.. Nara Lokesh .. కనీసం ఒక ప్రెస్ మీట్ లో కూడా వాళ్ల గురించి పెట్టలేదు.. కొంచ...
05/06/2025

కొంచెం డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు విను అన్నా.. Nara Lokesh .. కనీసం ఒక ప్రెస్ మీట్ లో కూడా వాళ్ల గురించి పెట్టలేదు.. కొంచెం సమయం పెంచమనీ , అలాగే ఒక జిల్లా కు ఒక పేపర్ అని ఇలా వాళ్ళు చాలా రోజులు నుంచి వాళ్ల వినతులు చెప్పినా పట్టించుకోకుండా ఉన్నారు..

చాలా నెగిటివ్ అవుతుంది డీఎస్సీ విషయంలో.. Even కూటమి కి ఓట్లు వేసిన వాళ్ళు కూడా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు.. ఇది చాలా దెబ్బ అవుతుంది.. ఒకసారి డీఎస్సీ అభ్యర్థుల సమస్యలు వినండి 🙏

05/06/2025

కాపాడిన జెసిబి ఆపరేటర్ కి ఆ బకెట్ తన తొండంతో తాకి ధన్యవాదాలు చెప్పేసి వెళ్లిపోయింది ఆ గజరాజు..

13/04/2025
cine actor rajanala: వృద్ధాప్యం ఎంతటి శాపం.. ‘బాబూ నువ్వొక వేషం ఇస్తే అవసరమైనవి కొనుక్కుంటాను’సీనియర్‌ నటుడు రాజనాల చివర...
13/04/2025

cine actor rajanala: వృద్ధాప్యం ఎంతటి శాపం.. ‘బాబూ నువ్వొక వేషం ఇస్తే అవసరమైనవి కొనుక్కుంటాను’
సీనియర్‌ నటుడు రాజనాల చివరి రోజుల్లో ఎంతటి దయనీయ స్థితిని ఎదుర్కొన్నారో దర్శకుడు, నటుడు దేవీ ప్రసాద్‌ తన స్వీయ అనుభవంలో పంచుకున్నారు.
‘‘కాస్ట్యూమ్‌ కృష్ణ గారి నిర్మాణంలో ‘కోడి రామకృష్ణ’ గారి (Kodi Ramakrishna) దర్శకత్వంలో జరగబోయే సినిమా కథా చర్చలు హైదరాబాద్ గ్రీన్‌పార్క్ హోటల్‌లో జరుగుతున్నప్పుడు, రోజూ డైరెక్టర్‌ గారిని కలవటానికి వచ్చేవారి తాకిడి వల్ల కథ ముందుకి సాగేది కాదు. దానివల్ల ఎవరు కాల్ చేసినా ‘డైరెక్టర్‌గారిక్కడ లేరు’ అని చెప్పాలని నిర్ణయించుకున్నాం. అప్పుడే రూంలోని ల్యాండ్‌ ఫోన్ మోగితే లిఫ్ట్ చేశాను. అవతల నుంచి ‘కోడి రామకృష్ణ గారున్నారండీ.. నన్ను రాజనాల అంటారు’ అనగానే ‘ఆయన లేరండీ’ అని అబద్ధం చెప్పి పెట్టేశాను. కథ ఓ కొలిక్కొస్తే గానీ, నేను షెడ్యూల్ ప్లాన్‌ చేసి ఆర్టిస్ట్‌లకు డేట్స్ చెప్పలేను. కో-డైరెక్టర్‌గా అదీ నా టెన్షన్. మళ్లీ రెండోరోజు ఫోనొస్తే నేనే లిఫ్ట్‌ చేశాను. అవతల నుంచి మళ్లీ అదే వణుకుతున్న గొంతు. ‘నా పేరు రాజనాల. సీనియర్ ఆర్టిస్ట్‌ని. రామకృష్ణగారు నాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పటినుంచీ తెలుసండి. ఓసారి ఆయన్ని కలిసి వెంటనే వెళ్లిపోతాను’ అనగానే ఒళ్లు ఝల్లుమంది నాకు’’
‘‘గుండమ్మ కథలో గుండమ్మని తన కంచు కంఠంతో అదిలించిన రౌడీ రాజనాల.. ఎన్టీఆర్‌, కాంతారావు గార్లతో కత్తి యుద్ధాలు చేసిన అరివీరభయంకర వ్యక్తి రాజనాల.. నా చిన్నతనంలో వెండితెర మీద నుంచే గుడ్లురిమి చూసి, వికటాట్టహాసాలతో నన్ను భయపెట్టిన రాజనాల.. అంతే.. ఎవరికీ వినపడకుండా ‘డైరెక్టర్‌గారు ఉన్నారు సర్. వచ్చేయండి’ అని పెట్టేశాను. గంట తర్వాత బెల్ మోగితే నేనే డోర్ తీశా. నమ్మ బుద్ధి కాలేదు. నా జ్ఞాపకాలలో ఉన్న రాజనాల కాదు అక్కడున్నది. చప్పి దవడలతో, ఒడలిపోయిన శరీరంతో, ఒకింత మెల్లకన్నుతో, కాళ్లకి తెల్లటి సాక్స్‌లతో ఉన్నారు. గురువు గారు (కోడిరామకృష్ణ) గౌరవంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ చెబితే, ‘వద్దు బాబూ.. షుగర్ ఎక్కువై కాలి వేలు తీసేశారు. నీ టైం వృథా చేయను. ఈ మధ్యే మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. ఓ అభిమాని తన లాడ్జ్‌లో ఓ గది ఫ్రీగా ఇచ్చాడు. మొన్నీమధ్య రామానాయుడు గారు ఓ వేషం ఇస్తే ఆ డబ్బుతో ఓ ఫ్యాన్, కావల్సిన వస్తువులు కొన్ని కొనుక్కున్నాను. నువ్వో వేషం ఇస్తే మరికొన్ని అవసరమైనవి కొనుక్కుంటాను’ అంటూ వణుకుతున్న కంఠంతో ఇంకా ఏవో చెబుతున్నారు. ఒళ్లు జలదరించింది’’
‘‘మీరిక్కడ భోజనం చేసి వెళ్లే లోపు మీకు కావల్సిన వస్తువులు మీ రూంలో ఉంటాయి’ అని రామకృష్ణగారు అన్నారు. ‘అలా వద్దు బాబూ నాకు వేషం ఇవ్వు చాలు’ అన్నారు రాజనాల. వృద్ధాప్యం ఎంతటి శాపం. ఒకప్పుడు కండలు తిరిగిన గండరగండుడినైనా.. పళ్ళూడిన ముసలి సింహాన్ని చేసి మూలన కూర్చోబెడుతుంది. అప్పుడు కూడా తన రోజువారీ ఆహారం కోసం ఆ సింహమే వేటాడుకోవాల్సివస్తే ఎంతటి దైన్యం. మా ప్రొడక్షన్ కారులో పంపిద్దామని ఆయనతో పాటు కిందికి వెళ్లాను. ‘అక్కర్లేదు ఆటోలో వచ్చాను’ అని ఆటో ఎక్కారు. ఆటోకి నేను డబ్బివ్వబోతే ‘తీసుకోడు బాబూ. వాడికి నెలకోసారి ఇస్తాను. నన్ను బాగా చూసుకుంటాడు’ అని చెప్పి వెళ్లిపోయారు. తిరిగి రూంకి వెళ్ళేసరికి నటుడిగా ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నప్పుడు రాజనాల గారు చేసిన తప్పొప్పుల పట్టికను వివరిస్తున్నారో సీనియర్ రచయిత. మహాశిఖరాన్నెక్కిన మనిషి అంచెలంచెలుగా కాక అమాంతం అగాధానికి పడిపోవడమెలా సాధ్యం? ఇప్పుడాలోచిస్తే సి.నా.రె.గారు రాసిన గీతం గుర్తుకొస్తుంది. ‘జీవితమే ఒక వైకుంఠపాళి - నిజం తెలుసుకో భాయీ.. ఎగరేసే నిచ్చెనలే కాదు - పడదోసే పాములు ఉంటాయి’ బయట ఉండే పాముల కన్నా మనలో ఉండే పాములతోనే మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలేమో’’
- దర్శకుడు, నటుడు దేవీప్రసాద్ స్వీయ అనుభవాల నుంచి..
Copy ✍️✍️ ఈనాడు ✍️✍️

Ananya nagalla
15/03/2025

Ananya nagalla

Address


Telephone

+918886326428

Website

Alerts

Be the first to know and let us send you an email when RAGA tv telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Address
  • Telephone
  • Alerts
  • Claim ownership or report listing
  • Want your business to be the top-listed Media Company?

Share