It's krishnaveni

It's krishnaveni Youtube/ krishnaveni

11/07/2025

వరలక్ష్మీ వ్రతంరోజు పూజ చెయ్యడానికి చకుదరకపోతే మొదటిశుక్రవారం మూడో శుక్రవారం పూజ చేసుకోవచ్చా?

11/07/2025

కడుపుతో ఉన్నవారు వరలక్ష్మీ వ్రతం చేసుకోవచ్చా?

10/07/2025

varalakshmi vratham doubts | varalakshmi vratham vidhanam | clarification of all doubts

10/07/2025

కామాఖ్య దేవి అమ్మవారి ఆలయంరహస్యం|The secret of Kamakhya Devi Temple|Kamakhya Devi Temple information Temple

*తిరుమల సర్వస్వం - 10* ♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️     ✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ•••┉┅━❀🕉️❀┉┅━••• *శ్రీవారి ...
09/07/2025

*తిరుమల సర్వస్వం - 10*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️

✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
•••┉┅━❀🕉️❀┉┅━•••

*శ్రీవారి భక్తాగ్రేసరులు -2*

🙏 *కుమ్మరి భీమన్న* 🙏

👉🏻 పూర్వం ఆకాశరాజు (శ్రీనివాసునికి మామగారు) తమ్ముడైన "తొండమానుడు" అనే చక్రవర్తి శ్రీవారి పాదాలకు అనునిత్యం బంగారు తులసిదళాలతో డాంబికంగా సహస్రనామార్చన చేస్తూ, తన లాంటి భక్తుడెక్కడా ఉండడని గర్వపడుతూ ఉండేవాడు. మనం ఈనాడు చూస్తున్న, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు నివసించే ఆనందనిలయాన్ని నిర్మించిన మహానుభావుడే ఈ చక్రవర్తి.

🌻 *సువర్ణపుష్పాల స్థానంలో మట్టిపువ్వులు*🌻

👉🏻 ఒక రోజు ఉదయాన్నే తొండమానుడు స్వామివారి దర్శనానికి వచ్చినపుడు తన బంగారుపుష్పాల స్థానంలో, బంకమట్టి పూలు కనిపించాయి. దానితో ఖంగుతిన్న తొండమానుడు ఒకింత నిరాశతో శ్రీనివాసుణ్ణి ఇదేమని ప్రశ్నించగా, శ్రీవారు కుమ్మరి భీమన్న వృత్తాంతాన్ని తొండమానునికి విశద పరిచారు.

[ ఆ రోజుల్లో భక్తులతో మానవభాషలో సంభాషించే శ్రీనివాసుడు తరువాతి కాలంలో తొండమానునిపై అలక వహించి ప్రత్యక్షంగా మాట్లాడడం విరమించారు. ఆ వృత్తాంతాన్ని మరో సారి ప్రస్తావించు కుందాం.]

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *శ్రీనివాసుడు ఉటంకించిన భీమన్న భక్తితత్పరత* 🙏

👉🏻 శ్రీవారికి అత్యంత ఆప్తులైన భక్తుల్లో ఒకడైన "భీమన్న" అనే కుమ్మరివాడు ఆలయానికి అవసరమైన కుండలను తయారు చేస్తూ, తన ఇంటిలోనే స్వామివారిని కొయ్యబొమ్మగా ప్రతిష్ఠించి, తన చేతి వ్రేళ్ళకు అంటినట్టి మట్టితో చేసిన పువ్వులతో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుణ్ణి నిత్యం పూజించేవాడు. ఉదయం నుండి రాత్రి వరకూ ఏ పని చేస్తున్నా స్వామినే ధ్యానించేవాడు. అతని ధ్యాసంతా శ్రీవారికి కావలసిన కుండలు తయారు చేయడం మీదనే ఉండేది. రెక్కాడితే గానీ డొక్కాడని భీమన్న నిరుపేదతనం శ్రీనివాసుని పట్ల అతనికున్న అపారమైన భక్తిని, సమర్పణాభావాన్ని ఏమాత్రం సడలించలేక పోయింది.

👉🏻 ప్రతిరోజూ చద్ది ఆరగించి, నీవే ఈ పని చేయించుకుంటున్నావంటూ శ్రీవారికి నమస్కరించి పని ప్రారంభించేవాడు. అతను తయారు చేస్తున్న ప్రతి కుండలో స్వామివారు ఆరగిస్తున్నట్లు భావించి, అత్యంత భక్తిశ్రద్ధలతో తన పని చేసుకునేవాడు. ప్రతిరోజూ కుండలను స్వయంగా కొండమీదికి తెచ్చి సమర్పిద్దామనుకునే వాడు కానీ, మరునాటికి కావలసిన క్రొత్త కుండలు తయారు చేయలేనేమోననే బెంగతో, వేంకటాచలం మీదకు వెళ్ళే కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే వాడు.

👉🏻 స్వామి ప్రతిరోజూ ఆ కుమ్మరి సమర్పించిన మట్టి కుండలలో నైవేద్యం ఆరగించడమే కాకుండా, అతడు భక్తిపూర్వకంగా అర్పించిన మట్టిపూలను కూడా పరమానందంగా స్వీకరించేవారు. తొండమానునుకి ఆనందనిలయంలో స్వామిపాదాల చెంత, తన బంగారుపూలకు బదులుగా కనిపించినవి ఆ పుష్పాలే.

♾┉┅━❀🕉️❀┉┅━♾

*భీమన్న గృహానికి తొండమానుని ఆగమనం* 🌈

👉🏻 భీమన్న భక్తి తత్పరతను సాక్షాత్తు శ్రీనివాసుని ద్వారా విన్న తొండమానునికి అహంకారపు తెరలు తొలగిపోయాయి. ఆడంబరాల కంటే ఆత్మసమర్పణే ముఖ్యమని విదితమయ్యింది. శ్రీనివాసుని అనుగ్రహానికి అంతగా నోచుకున్న భీమన్నను చూడాలనే తీవ్రమైన కాంక్షతో, తన పరివారాన్నంతటినీ కొండపైనే వదలి, ఒంటరిగా, కాలినడకతో, అలిపిరి సమీపంలో ఉన్న భీమన్న గృహానికి వెళతాడు. తిరుమలకు వెళ్ళే అలిపిరి మెట్లదారిలో, "తలయేరుగుండు" దాటిన తరువాత, ఆ కాలంలో భీమన్న నివాసంగా చెప్పబడే ప్రాంతంలో, "కుమ్మరి సారె" గుర్తులున్న శిలాఫలకాలను, భీమన్న కుటుంబీకుల బొమ్మలను నేడు కూడా చూడవచ్చు. ఆకాలంలో, ఆ ప్రదేశంలో శ్రీవారి గుర్తుగా భీమన్న నిర్మించినట్లు చెప్పబడే "గోపురం", ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది.

👉🏻 విరామం లేని ఒంటరి ప్రయాణం వల్ల, అలసి సొలసి తన ఇంటిముందు అచేతనంగా పడి ఉన్న చక్రవర్తిని చూసిన భీమన్న, తన వల్ల ఏం తప్పిదం జరిగిందా అని కలవరపడతాడు.

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *శ్రీనివాసుని సాక్షాత్కారం* 🙏

👉🏻 అంతలో, భీమన్న సపర్యలవల్ల సృహలోకి వచ్చిన తొండమానుడు చూస్తుండగానే, అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యాడు. శ్రీవారి దివ్యమంగళరూపాన్ని గాంచిన భీమన్న ఆనందాశ్చర్యాలతో నోట మాట రాక తడబడతాడు. కొంత సేపటి తరువాత తెప్పరిల్లిన భీమన్న, శ్రీవారిని పరిపరి విధాలుగా తనదైన పామరభాషలో కీర్తిస్తాడు. మంత్రతంత్రాలు, పూజా విధానాలు తనకు తెలియనందున క్షమించమని శ్రీనివాసుణ్ణి ఆర్తిగా అర్ధిస్తాడు.

♾┉┅━❀🕉️❀┉┅━♾

🌈 *మట్టిమూకుడులో స్వామివారికి నైవేద్యం* 🌈

👉🏻 స్వామివారికి నివేదిద్దామని చూస్తే, ఆ నిరుపేద ఇంటిలో ఏమీ కనపడవు. అలా చింతాక్రాంతుడై ఉన్న భీమన్నను ఓదార్చుతూ, శ్రీనివాసుడు, *"జపతపాల కన్నా అచంచలమైన భక్తే నాకు మక్కువ. నీవు తింటున్నదే నాకూ పెట్టు. అవే నాకు పంచభక్ష్య పరమాన్నాలు. నాకు ఆకలిగా ఉంది"* అని భీమన్నను సమాధాన పరుస్తాడు.

👉🏻 అప్పుడా కుమ్మరి భార్య, ఇంట్లో సిద్ధంగా ఉన్న ఒక పగిలిన పెంకులో సంకటి పెట్టి స్వామివారిని ఆరగించ వలసిందిగా వేడుకొంటుంది. ప్రేమతో ఆ ఆహారాన్ని స్వీకరించిన స్వామి యొక్క పాదాలకు నమస్కరించగానే, ఆ పరమ పవిత్రస్పర్శతో భీమన్న దంపతులు దివ్యశరీరాలు ధరించి, దేవదుందుభులు మ్రోగుతుండగా, పుష్పకవిమానంలో వైకుంఠానికి పయనమవుతారు.

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *తొండమానుని పశ్చాత్తాపం* 🙏

👉🏻 ఈ ఉదంతాన్ని కళ్ళారా కాంచిన తొండమానుడు భీమన్న నిరాడంబరమైన భక్తిని శ్లాఘిస్తూ, తాను అహంకారాన్ని విడనాడానని, తన తప్పిదాన్ని మన్నించి తనను కూడా తరింపజేయమని శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తాడు. సంతృప్తి చెందిన స్వామివారు, తొండమానునుకి దివ్యోపదేశం గావిస్తూ, నిర్మలమైన బుద్ధితో తపఃస్సాధన సాగిస్తే మరుజన్మలో మోక్షం సిద్ధిస్తుందని వరమిస్తాడు. ఆ తరువాత, తొండమానుడు నిరాడంబర భక్తితో స్వామిని చాలా కాలం సేవించి, మరు జన్మలో మోక్షాన్ని పొందుతాడు.

👉🏻 ఇప్పటికీ, శ్రీవారు ఆ మహాభక్తుడైన కుమ్మరి భీమన్న గుర్తుగా, మట్టి పెంకులో (సగం పగిలిన కొత్త మట్టి కుండ) పెరుగు అన్నాన్ని రోజూ ప్రాతఃసంధ్య వేళలో తొలి నైవేద్యంగా స్వీకరిస్తూ, భీమన్నను, అతని వారసులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఈ ఒక్క నైవేద్యాన్ని మాత్రమే కులశేఖరపడి దాటి, గర్భాలయం లోనికి తీసుకు వెళ్ళి నివేదిస్తారు. వాడిన కుండ మళ్ళీ వాడకుండా, ప్రతిరోజూ కొత్త కుండలో నైవేద్యం సమర్పిస్తారు. అన్నమయ్య, శ్రీవారిని *"తోమనిపళ్ళాల వాడని"* కీర్తించడంలోని అంతరార్థం అదే!

👉🏻 మిగిలిన సమస్త నైవేద్య విశేషాలన్నింటనీ, గర్భాలయం బయటనుంచే నివేదిస్తారు. అదీ శ్రీవారు తన భక్తుల యెడ చూపించే వాత్సల్యం!

👉🏻 తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, మనందరికీ సుపరిచితమైన *"కొండలలో నెలకొన్న... కుమ్మర దాసుడైన కురువరతి నంబి"* అంటూ, కుమ్మరి భీమన్నను తన కీర్తనలో చిరంజీవిని చేశాడు.

👉🏻 ఆవిధంగా, తొలి దర్శనం ఓ గొల్లవానికిచ్చే గోవిందుడు, తొలినైవేద్యం కుమ్మరితో తయారు చేయబడ్డ కుండపెంకులో ఆరగిస్తాడు.

👉🏻 అల్పసంతోషి అయిన ఆ అఖిలాండ నాయకునికి ఆడంబరాలు, అట్టహాసాలు అవసరమా? నిరాడంబరమైన భక్తితో ఆయన్ను ధ్యానిస్తూ, ఆయన సృష్టిలో భాగమైన ఓ అన్నార్తునికి పట్టెడన్నం పెట్టడం శ్రీవారికి నిజమైన సేవ కాదా?

[ రేపటి భాగంలో... *తిరుమలనంబి*
గురించి తెలుసుకుందాం]

♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏

తిరుమల సర్వస్వం..... సశేషం...
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️

*తిరుమల సమాచారం:*        *09-07-2025*🍁🍁🍁🍁🍁👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .👉🏻 ఉచిత దర్శనం కోసం *21 కంపార్ట్మెంట్లు...
09/07/2025

*తిరుమల సమాచారం:*

*09-07-2025*

🍁🍁🍁🍁🍁

👉🏻 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .

👉🏻 ఉచిత దర్శనం కోసం *21 కంపార్ట్మెంట్లు లో* వేచి ఉన్న భక్తులు .

👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు *12* గంటల సమయం పడుతుంది.

👉🏻 *300* రూ..శీఘ్రదర్శనంకు *2-3* గంటల సమయం పడుతుంది.

👉🏻 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *3* నుండి *5* గంటల సమయం పడుతుంది.

👉🏻 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *78,320*

👉🏻 *24,950* మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం *4.66* కోట్లు

*ఓం నమో వేంకటేశాయ* 🙏🍁🙏🏻

08/07/2025

2025 వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వచ్చింది పూజ చేసుకునే శుభ సమయం

*తిరుమల సర్వస్వం - 8* ♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️                        *శ్రీవారి ప్రసాద విశేషాలు - 3*✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు...
08/07/2025

*తిరుమల సర్వస్వం - 8*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️

*శ్రీవారి ప్రసాద విశేషాలు - 3*

✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️

🙏 *వార క్రమానుసారం అర్పించే ప్రసాదాలు*

✅ *వారక్రమానుసారం సమర్పించే ప్రసాదాలు ఈ క్రింది విధంగా ఉంటాయి.*

✅ *సోమవారం:*

🥀 51 పెద్ద దోశలు
🥀 51 చిన్న దోశలు
🥀 51 పెద్ద అప్పాలు
🥀 102 చిన్న అప్పాలు

✅ *మంగళవారం:*

🥀 ప్రత్యేక ప్రసాదాలు ఏవీ ఉండవు

✅ *బుధవారం*

🥀 పెసరపప్పు
🥀 పానకం
🥀 పాయసం

✅ *గురువారం*

తిరుప్పావడ సేవ

🥀 484 కిలోల పులిహార
🥀 51 తేనె తోళీలు
🥀 51 పెద్ద జిలేబీలు
🥀 వడలు
🥀 పాయసం

✅ *శుక్రవారం*

అభిషేకం

🥀 51 పోళీలు
🥀 పాయసం

✅ *శనివారం*

🥀 రోజువారీ నైవేద్యాలు మాత్రమే

✅ *ఆదివారం*

🥀 అమృత కలశం
లేదా గరుడ ప్రసాదం

👉🏻 ఆదివారం రోజున సమర్పించే ప్రసాదం పేరు *అమృతకలశం* లేదా *గరుడప్రసాదం.* ఈ ప్రసాదం వెనుక గల ఐతిహ్యం ఏమిటంటే, స్వామివారి వాహనమైన గరుడునికి సర్పాలంటే జాతివైరం. అందువల్ల సర్పదోష పీడితులై సంతానలేమితో బాధపడుతున్న వారు ఈ ప్రసాదం సేవిస్తే, గరుత్మంతుడు వారిని సర్పదోష విముక్తులను చేసి, సంతానప్రాప్తి కలిగిస్తాడు.

లెక్కకు మించిన ప్రసాదాలను గుర్తుంచు కోలేక, సతమతమవుతున్నారు కదూ!

👉🏻 ఈ తికమక వికటకవి తెనాలి రామలింగడికీ, నందకఖడ్గ అంశతో కారణజన్ముడిగా జన్మించిన అన్నమయ్యకు కూడా తప్పలేదు. ఆ సాహితీ, సంగీత సార్వభౌముల ముందు సామాన్యులమైన మనమెంత?

👉🏻 జగన్నాటక సూత్రధారి శ్రీవేంకటేశ్వరుడు ఇన్నిన్ని తినుబండారాలను ఆరగిస్తున్నట్లుగా నటిస్తూ, తెనాలి రామలింగడి లాంటి వికటకవుల వెటకారాలకు గురి అవుతూ (వారు కూడా శ్రీవారికి పరమభక్తులే! వెటకారంతో కూడిన వారి "నిందాస్తుతు" లలో శ్రీవారి పట్ల సాన్నిహిత్యం, చొరవ, ప్రియసఖుల పట్ల ఉండే స్వాతంత్ర్యం ధ్వనిస్తాయి) తన భక్తుల జిహ్వచాపల్యాన్ని, అన్నార్తిని తీరుస్తున్నాడు.

👉🏻 భక్తులను కాపాడడానికి, ఉద్ధరించటానికి తాను స్వయంగా శారీరక బాధలను, నీలాపనిందలను భరించటం శ్రీమహావిష్ణువుకు అన్ని యుగాల్లోనూ పరిపాటే!

👉🏻 గర్భాలయంలోని ఇతర ఉత్సవమూర్తులకు కూడా మధ్యాహ్న, సాయం సమయాల్లో నాలుగు రకాల అన్నప్రసాదాలు, నాలుగు రకాల పణ్యారాలు, పంచకజ్జాయం నివేదిస్తారు.

👉🏻 ప్రత్యేక సందర్భాలలో, అంటే – మూడు రోజుల పవిత్రోత్సవాలు, తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు, మూడు రోజుల జ్యేష్టాభిషేకం - ఉగాది, శ్రీరామనవమి, దీపావళి - ఆస్థాన సందర్భాల్లో ఈ ప్రసాదాల పరిమాణం రెట్టింపవుతుంది.

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *తోమనిపళ్ళాల వాడు* 🌈

👉🏻 అన్నమాచార్యుని *"వేడుకొందామా.... తోమనిపళ్ళాల వాడే"* అనే కీర్తన మనకు సుపరిచితం. శ్రీనివాసుణ్ణి ఈ విధంగా ఎందుకు కీర్తించారంటే -

👉🏻 స్వామి ఒకసారి ఆరగించిన పళ్ళాన్ని తోమి మరలా వాడకుండా, పారవేస్తారు. తదుపరి భోజనానికి మళ్ళీ కొత్తపళ్ళెం ఉపయోగిస్తారు. ఆ తోమనిపళ్ళాలే - *"పగిలిన మట్టికుండలు".* వీటిలో ఉంచే నైవేద్యమే *ఓడు ప్రసాదం.* కుమ్మరి భీమన్న అనే మహాభక్తుని గుర్తుగా, తరతరాల నుండి వస్తున్న ఈ సాంప్రదాయం వెనుకనున్న ఐతిహ్యాన్ని మరొకచోట వివరించడమైనది.

👉🏻 అపార కరుణామయుడైన వేంకటేశుడు తాను మాత్రం పగిలిన మట్టికుండలో భుజిస్తూ, *"తిండిమెండయ్య"* అనిపించుకుంటూ, భక్తకోటికి పంచభక్ష్య పరమాన్నాలు అందిస్తున్నాడు !

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *లడ్డూ చరిత్ర*

👉🏻 లెక్కకు మిక్కిలి ప్రసాదాలున్నా, దేనికీ లేని ఖ్యాతి తిరుపతి లడ్డూ (లాడుకము) సంపాదించుకుంది. మిగతా ప్రసాదాలకంటే ఎక్కువ కాలం మన్నటం, దేశవిదేశాలకు సునాయాసంగా ఆకారం చెడకుండా తీసుకెళ్ళ గలగటం, సులభంగా అందుబాటులో ఉండడంతో పాటుగా, దాని అద్భుతమైన రుచి కూడా "లడ్డూ" ప్రాచుర్యానికి కారణం. తిరుపతి యాత్ర చేసి వచ్చినవారు ఎవరైనా, లడ్డూ ప్రసాదం తీసుకు రాకుండా ఉండరు. శ్రీవారి ప్రసాదమంటే ఎవ్వరికైనా ఠక్కున గుర్తొచ్చేది లడ్డూయే!

👉🏻 దాదాపు, ఆలయ పరిసర ప్రాంతమంతా నోరూరిస్తూ, తియ్యటి, కమ్మని, ఘుమఘుమలాడే స్వచ్ఛమైన నేతి సువాసనలు లడ్డూల నుంచి వచ్చినవే!

👉🏻 ఎవరెన్ని రకాలుగా ప్రయత్నించినా, తిరుపతి లడ్డూ రుచి మాత్రం దేనికీ రాదు గాక రాదు. ఎందుకంటే....

👉🏻 చక్కెరమోము గల తల్లి అయిన అలమేలుమంగ యొక్క పతిదేవుని ఎంగిలి ఇతరత్రా చేసిన లడ్డూలకు తగలక పోవడమే దీనికి కారణమేమో!

👉🏻 అంతే గాక, ఎనభయ్యేళ్ళకు పైగా, ఒకే పద్ధతిలో, అదే పాళ్ళలో, లక్షలకొద్దీ లడ్డూలు నిరంతరాయంగా, శ్రీవారి పట్ల అచంచల భక్తితో, తయారు చేస్తుండడం వల్ల, *"పోటు"* బ్రాహ్మణులు ఈ విలక్షణమూ, నిత్యనూతనమూ అయిన లడ్డూ తయారీలో అత్యంత నైపుణ్యాన్ని సంపాదించారు.

👉🏻 *తిరుమల లడ్డూకు తి.తి.దే. 2009 సం. లో పేటెంటు హక్కు సాధించుకొని, జియోగ్రాఫికల్ ఇండికేటర్ జాబితాలో చేరింది*. లడ్డూ వేర్వేరు రూపాల్లో అనేక శతాబ్దాల నుంచి ఉన్నా, తీపి బూందీ ప్రసాదంగా సుమారు 1800 సం. లో విక్రయాలు మొదలై, తదనంతర కాలంలో రూపాంతరం చెందుతూ, 1940 ల్లో ప్రస్తుత లడ్డూ రూపం దాల్చుకుంది.

👉🏻 ప్రతిరోజూ ఇంచుమించు మూడు లక్షల లడ్లు తయారు చేస్తారు. ఒకప్పుడు వాడే కట్టెలపొయ్యి స్థానంలో నేడు ఆవిరి పొయ్యిలను (సుమారుగా 48 పొయ్యిలు) వాడుతున్నారు. దాదాపు 700 మంది పోటు కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారు. శ్రీవారి సంపంగి ప్రాకారానికి ఉత్తర భాగాన ఉన్న *"పడిపోటు"* అనబడే వంటశాలలో లడ్డూలను తయారు చేస్తారు. వంటలకు కావలసిన దినుసులన్నింటినీ *"ఉగ్రాణం"* అని పిలువబడే గిడ్డంగిలో భద్రపరుస్తారు.

👉🏻‌ లడ్డూల తయారీకి వాడవలసిన సరుకుల మోతాదును *"దిట్టం"* అని అంటారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొలమానాన్ని *"పడితరం దిట్టం"* గా వ్యవహరిస్తారు. దీని ప్రకారం, 5100 లడ్డూలను తయారు చేయడానికి సుమారుగా 830 కిలోల సరుకులను *"ఉగ్రాణం"* నుంచి *"పడిపోటు"* కు తరలిస్తారు.

🍁 ప్రస్తుతం మూడు రకాల లడ్డూలను తయారు చేస్తున్నారు:

*1. ఆస్థానలడ్డు -*

👉🏻 వీటిని ప్రత్యేక సందర్భాలలో తయారు చేసి అత్యంత ప్రముఖులకు మాత్రమే అందజేస్తారు. సాధారణంగా, ఈ లడ్డూల విక్రయం జరగదు. వీటి తయారీలో, అధిక మొత్తంలో నెయ్యి మరియు ముంతమామిడి పప్పు (సారపప్పు) వంటి ప్రత్యేక దినుసుల్ని ఉపయోగిస్తారు. దీని బరువు సుమారుగా 750 గ్రాములు ఉంటుంది. అమోఘమైన దీని రుచిని ఆస్వాదించి తెలుసుకోవాలే గానీ, వర్ణించనలవి కాదు.

*2. కళ్యాణోత్సవ లడ్డు -*

👉🏻 కళ్యాణోత్సవ ఆర్జిత సేవలో పాల్గొన్న గృహస్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేస్తారు. సుమారుగా 700 గ్రాముల బరువుంటుంది. దక్షిణ భారత దేశపు వివాహవిందుల్లో ఈ మధ్యకాలం వరకు – అంటే "క్యాటరింగ్" సంస్కృతి మొదలై సాంప్రదాయిక విందుభోజనాలు అంతరించి పోయేంత వరకు లడ్డూ వడ్డన తప్పనిసరి. ఈ ఆనవాయితీ, తిరుమల క్షేత్రంలో శ్రీవారి నిత్య కళ్యాణోత్సవానికి ప్రసాదంగా ఇచ్చే "లడ్డూ" ద్వారానే ప్రారంభమైందని చెపుతారు.

👉🏻 ఇలా, తరతరాలుగా మన దైనందిన జీవనంలో భాగమై పోయిన తిరుమల సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. కళ్యాణోత్సవం మరికొన్ని ఇతరసేవల్లో పాల్గొన్న భక్తులు, ఈ లడ్డూలను, దర్శనానంతరం సంపంగిప్రాకారంలో గల *"వగపడి"* నందు పొందవచ్చు.

*3. ప్రోక్తం లేదా సాధారణ లడ్డు -*

👉🏻 సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను, లెక్కగా, ఆలయం వెనుక భాగాన ఉన్న లడ్డూ కౌంటర్లలో విక్రయిస్తారు. కొన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు ఉచితంగా కూడా ఇస్తారు. దీని బరువు సుమారు 175 గ్రా. లడ్డూలన్నింటి లోకి అత్యంత ప్రాచుర్యంలోకి వచ్చింది ఇదే!

👉🏻 ఇవే కాకుండా, భక్తులకు దర్శనానంతరం ఉచిత ప్రసాదంగా ఒక్కోసారి బుల్లి లడ్డూలను కూడా అందజేస్తారు.

👉🏻 51 వస్తువుల్ని (లడ్డూ, వడ, జిలేబి లాంటివి) ఒక *"పడి"* గా వ్యవహరిస్తారు. ఒక పడి చిన్న లడ్డూలను తయారు చేయటనికి కావలసిన పదార్థాలు:

👉 1.80 కిలోల శనగపిండి
👉 1.65 కిలోల నెయ్యి
👉 4.00 కిలోల పంచదార
👉 300 గ్రాముల జీడిపప్పు
👉 160 గ్రాముల ఎండుద్రాక్ష
👉 80 గ్రాముల కలకండ (పటికబెల్లం)
👉 40 గ్రాముల యాలకులు

👉🏻 అదీ శ్రీవారికీ, భక్తులందరికీ అత్యంత ప్రీతికరమైన, ఖండఖండాంతరాల ఖ్యాతి గాంచిన *"తిరుపతి లడ్డూ"* కథ - కమామిషు..

♾┉┅━❀🕉️❀┉┅━♾

[ రేపటి భాగంలో... *శ్రీవారి భక్తాగ్రేసరులు* గురించి తెలుసుకుందాం]

♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుద.తిరుమల సర్వస్వం..... సశేషం...*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️

07/07/2025

చతుర్మాస వ్రతం విశిష్టత ఎప్పుడు ,ఎలా చేయాలో తెలుసుకుందాం

*తిరుమల సర్వస్వం - 7* ♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️                        *శ్రీవారి ప్రసాద విశేషాలు - 2*✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు...
06/07/2025

*తిరుమల సర్వస్వం - 7*
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️

*శ్రీవారి ప్రసాద విశేషాలు - 2*

✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🕉️❀┉┅━•••♾️

🙏 *శ్రీవారి ప్రసాదవిశేషాలు -2* 🙏

*ప్రసాదాల తయారీకి నిబంధనలు:*

✅ *ప్రసాదాల తయారీకి కొన్ని ఖచ్చితమైన నియమాలున్నాయి.*

✅ వంట చెరకుగా – మామిడి, ఆశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మల్నే ఉపయోగించాలి. దీనికి వ్యావహారిక పారమార్థం ఏంటంటే భూగర్భ జలాలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈ చెట్లు పెరుగుతాయి. ఇలాంటి వృక్షాలను వంటచెరకుగా వాడడం వల్ల, నేలనుండి అధికంగా నీటిని సంగ్రహించే వృక్షాలు పరిరక్షించ బడతాయి. నీటి సంరక్షణా పద్ధతుల్ని అప్పట్నించే పాటించే వారన్నమాట.

✅ పాలు కారే చెట్లనూ, ముండ్లచెట్లనూ ఉపయోగించ రాదు. కట్టెలు కొట్టేవారికి, వంట చేసేవారికి ఏ విధమైన శారీరక హాని జరగకుండా ఈ కట్టుబాటు.

✅ నివేదన సిద్ధం చేయడానికి వాడే పాత్రలు బంగారం, వెండి, రాగి, ఇత్తడి లోహాలతో గానీ, మట్టితో గానీ తయారు చేయబడి ఉండాలి. ఇతరత్రా లోహాలతో తయారు చేయబడ్డ పాత్రలు ఆరోగ్యరీత్యా మంచివి కావని అప్పుడే గ్రహించారు.

✅ మట్టికుండలను ఒక మాసం పైబడి వాడరాదు. ఎక్కువకాలం వాడితే మట్టిపాత్రలు అరిగిపోయి, ఎక్కవ వేడి తగిలినప్పుడు పగిలిపోయే ప్రమాదం ఉంది.

✅ స్వామివారికి సిద్ధం చేసిన ప్రసాదాలను వాసన చూడరాదు - అందు కొరకు వంటవారు ముక్కుకూ, నోటికీ గుడ్డ కట్టుకుంటారు. ఒకరకంగా ఇది ఈనాడు మనం నోటికి, ముక్కుకు తగిలించుకుంటున్న "మాస్కు" లాంటిదన్నమాట. ఆవిధంగా, వంటవారికి ఏమైనా శారీరక అస్వస్థతలుంటే, వారి నిశ్వాస ద్వారా వచ్చే క్రిములవల్ల ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది. ఈ రోజుల్లో మనం ఆపత్కాల పరిస్థితుల్లో మాత్రమే ప్రాధాన్యతనిచ్చే "శుచి శుభ్రత" కు ఆ రోజుల్లోనే మన పూర్వీకులు పెద్దపీట వేశారు. ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా, ఆ ప్రసాదాలు భుజించే అసంఖ్యాక భక్తులు అనారోగ్యానికి గురవుతారు.

✅‌ ఒక పాత్రలో *"ద్రోణం"* (సుమారుగా 7,168 గ్రాములు) కంటే ఎక్కువ అన్నం వండరాదు. ఇంతకంటే ఎక్కువ వండితే, వంటపాత్ర పొయ్యిమీద ఉన్నప్పుడు, పాత్రను వేరేచోటుకు తరలించడానికి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.

✅ పూర్తిగా పక్వం కానిదీ, వెంట్రుకలూ, చెమట, కీటకాలూ పడినదీ, మాడినదీ, చల్లబడినదీ అయినటు వంటి ప్రసాదాలను శ్రీవారికి నివేదించ రాదు. ఇవన్నీ కూడా అనారోగ్యకరం అని మనకు తెలుసు.

✅ పాత్రలో మిగిలిన అన్నాన్ని నివేదించరాదు. ఆనాడు, ఈనాడు కూడా మనం భుజించగా మిగిలినది అతిథులకు వడ్డించడం హైందవ సాంప్రదాయం కాదన్న విషయం మనందరికీ సుపరిచితమే.

✅ శ్రీవారికి నివేదించే వరకూ ప్రసాదాలపై అన్యుల దృష్టి పడరాదు. నోరూరుతున్న సిద్ధాన్నాలను చూస్తే, భక్తుల ధ్యాస దర్శనానికి ముందే దేవుని మీద నుండి ప్రసాదాలపైకి మళ్ళే అవకాశం ఉంది. ఆ విధంగా, ఎన్నో కష్టనష్టాలకోర్చి చేపట్టిన తిరుమల యాత్ర నిష్ఫలం కావచ్చు.

✅ ఇలా, కట్టెలు కొట్టేవారు, వంట చేసేవారు, పాత్రలను మోసే పరిచారకులు, నివేదించే అర్చకులు, ఆరగించే భక్తులు, సమస్తమైన వారి క్షేమాన్ని, భక్తుల తిరుమల యాత్రా లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని; శ్రీవారికి అత్యంత శుచి శుభ్రతలు కలిగిన ప్రసాదాలు నివేదించే లక్ష్యంతో, దాదాపు వెయ్యేళ్ళ క్రితమే ఇంతటి సమగ్రమైన విధి-విధానాలను పొందుపరచిన మన పూర్వీకుల దూరదృష్టికి జోహార్లు.

👉🏻 పూర్వం శ్రీవారి ప్రసాదాలను సిద్ధం చేయడానికి మట్టికుండలను ఎక్కువగా వాడేవారు. మిగతా అన్ని ప్రసాదాలను కులశేఖరపడికి ఇవతల నుండే నివేదించగా, తెల్లవారు ఝామున జరిగే తొలి నైవేద్యంలో మాత్రమే, *"మాత్రాన్నం"* (కుమ్మరి భీమన్న అనే మహాభక్తునికి గుర్తుగా అన్నం, గడ్డ పెరుగు, శొంఠి, ఉప్పు, వెన్నతో తయారు చేయబడిన పెరుగన్నం) మాత్రం గర్భాలయం లోనికి తీసుకొని వెళ్ళి పగిలిన కొత్తకుండ పెంకులో నివేదిస్తారు.

👉🏻 కాబట్టి దాన్ని *"ఓడు ప్రసాదంగా"* వ్యవహరిస్తారు.

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *ఎన్నిరకాల ప్రసాదాలో!* 🙏

👉🏻 శ్రీవారి ప్రసాదాన్ని, ప్రముఖంగా ఉపయోగించే దినుసులను బట్టి నాలుగు రకాలుగా విభజించవచ్చు:

✅ 1. అన్నప్రసాదాలు - బియ్యంతో చేసేటటు వంటివి - *'ముద్గాన్నం' (కట్టెపొంగలి), తింత్రిణీఫల రసాన్నం (చింతపండు పులిహోర), చక్కెర పొంగలి (బెల్లంతో చేసేది), దధ్యోజనం (పెరుగన్నం), తీపి అన్నం (పంచదారతో చేసేది), మారీచ్యాన్నం (మిరియాల అన్నం లేదా "మొళిహోర"), కదంబం (పులుసన్నం లేదా శాకాన్నం), బకాళా బాతు (మసాలా పెరుగన్నం) మరియు మాత్రాన్నం (అన్నం, గడ్డపెరుగు, శొంఠి, వెన్నతో తయారు చేయబడినది)*

✅ 2. బెల్లం లేదా చక్కెర ప్రధానంగా గలవి - *పాయసం, సిరా (కేసరి), చిన్నలడ్డు, పెద్దలడ్డు, ఆస్థానలడ్డు, అప్పం, జిలేబీ, మనోహరం (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, బెల్లం, మిరియాలతో చేసిన లడ్డు), పోళీలు, సుఖియం (పూర్ణం బూరెలు), బెల్లపుదోశె, అమృతకలశం (బియ్యం పిండి, బెల్లం, నెయ్యి, మిరియాలతో చేసేది) మరియు "కొలువు ప్రసాదం" (నల్లనువ్వులు, బెల్లం, కొంఠి మిశ్రమం)*

✅ 3. ఉప్పుతో కూడినవి (లేదా పణ్యారములు) - *వడ, దోశె, నెయ్యిదోశె, తేనెతోళీలు (పెద్ద జంతికలు లేదా మురుకులు), సుండలు (పచ్చి శనగపప్పు, కొబ్బరితో చేసిన గుగ్గిళ్ళు)*

✅ 4. అపక్వ (వండని) ప్రసాదాలు - *పంచకజ్జాయం (జీడిపప్పు, గసగసాలు, ఎండుకొబ్బరి తురుము, చక్కెర, యాలకులపొడి ఈ ఐదు పదార్థాల మిశ్రమం), బెల్లం పానకం, ఆవుపాలు, వెన్న, వడపప్పు, మధురఫలాలు (ఒక్కో రకానికి 25 ఫలాల చొప్పున), ఎండుఫలాలు, తమలపాకులు మరియు వక్కలు.*

👉🏻 అన్నప్రసాదాలను శ్రీవారి కైంకర్యనిమిత్తం సమర్పించే ముందు పాత్రలన్నింటిలో ఆవునెయ్యి వేసి, తులసిదళాలను ఉంచి, అష్టాక్షరీ మంత్రాన్ని (ఓం నమో నారాయణాయ) ఉచ్ఛరిస్తారు.

👉🏻 శ్రీవారికి త్రికాలకైంకర్యం జరుపబడుతుంది. మూడు పూటలా జరిగే నైవేద్యసమర్పణ సమయాన్ని *"మూడు ఘంటలు"* గా వ్యవహరిస్తారు:

1. *మొదటి ఘంట* -

👉🏻 ఉదయం అయిదు గంటలకు జరిగే నైవేద్యాన్ని *బాలభోగం* అని కూడా అంటారు.

👉🏻 కులశేఖరపడి లోపల శ్రీవారికి అభిముఖంగా, రెండడుగుల ఎత్తైన వేదిక మీద *మాత్రాన్నం* ఉంచుతారు.

👉🏻 శ్రీవారికి ఎడమవైపు లడ్డు, వడ వంటి పణ్యారాలు; కుడివైపు బలి ప్రసాదం (శుద్ధాన్నం లేదా తెల్ల అన్నం) ఉంచుతారు.

💫 కులశేఖరపడి బయట, శ్రీవారికి కుడివైపున దధ్యోజనం, శుద్ధాన్నం, పులిహోర, కదంబం, ముద్గాన్నం; ఎడమవైపున గుడాన్నం (చక్కెర పొంగలి), నాలుగు గంగాళాలతో దధ్యన్నం (పెరుగన్నం) ఉంచుతారు.

✅👉 *ఇది "మొదటి ఘంట" ప్రసాదాలుంచే క్రమం.*

✅ 2. *రెండవ ఘంట* -

👉🏻‌ ఉదయం 10 గం. లకు మొదలయ్యే ప్రసాద సమర్పణను *రాజభోగం* అని కూడా - అంటారు. ఈ నివేదనలో భాగంగా, శ్రీవారికి అభిముఖంగా *శుద్ధాన్నం* ఉంచుతారు.

👉🏻 బలిప్రసాదాన్ని (శుద్ధాన్నం) గర్భాలయ దక్షిణద్వారం వైపు ఉంచి; కులశేఖరపడి వెలుపల దక్షిణంవైపు సిరా, పులిహోర, కట్టెపొంగలి; ఉత్తరంవైపు చక్కెర పొంగలి, దధ్యోజనం ఉంచుతారు.

👉🏻 తరువాత ఘనసారం (ముఖవాసం లేదా తాంబూలం) పేరుతో తమలపాకులు, వక్కలు, పచ్చకర్పూరం, యాలకులు, ముక్తాచూర్ణం (ముత్యాల పొడి) సమర్పిస్తారు.

✅ 3. *మూడవఘంట లేదా రాత్రిఘంట* -

👉🏻 రాత్రి 7:30 గం. లకు సమర్పించే నైవేద్యాన్ని *శయనభోగం* గా పిలుస్తారు.

👉🏻 సన్నిధి లోపలనున్న వేదిక మీద *మారీచ్యాన్నం (మిరియాల అన్నం), బలిఅన్నం, రెండు వెదురుబుట్టలలో త్రాంద్రవం (తోమాల దోశె), లడ్డు, వడ* ఉంచుతారు.

👉🏻‌ కులశేఖరపడికి వెలుపల దక్షిణం వైపు పులిహోర, కదంబం; ఉత్తరంవైపు గుడాన్నం ఉంచుతారు.

👉🏻 పులిహోరను శ్రీవారికి అర్పించిన తరువాత *బేడి ఆంజనేయస్వామికి* నివేదించుతారు.

👉🏻 ఇవే కాకుండా, మనం చిరుతిళ్ళు తిన్నట్లే స్వామివారికి ప్రతిరోజూ నాలుగు రకాల పణ్యారములు (స్నాక్స్, లడ్డూ, జిలేబి లాంటివి) కూడా అర్పిస్తారు.

👉🏻‌ వీటితో పాటుగా, శ్రీవారికి నిశిరాత్రి (అర్థరాత్రి) నివేదన సైతం చేస్తారు. దీనిలో భాగంగా, తిరువీశం అనబడే బెల్లపు అన్నాన్ని స్వామివారికి నివేదిస్తారు.

👉🏻 సాధారణంగా, శ్రీవారికి ప్రసాదాల నివేదన జరిగే సమయంలో, తిరుమామణి మంటపంలో ఉన్న (బంగారువాకిలి ముందున్న పెద్ద మంటపం) పెద్దగంటలను వాయిస్తూ, ఆలయంలోను, పరిసర ప్రాంతాలలో ఉన్న వారందరికి నివేద సూచన నిస్తారు. శ్రీవారికి నివేదన జరిగిన తరువాత మాత్రమే ఆహారాన్ని తీసుకునే భక్తులు నేటికీ ఎందరో ఉన్నారు. అయితే, నిశిరాత్రి జరిగే *"తిరువీశం"* నివేదనలో మాత్రం పెద్దగంటలకు బదులుగా "స్నపనమండపం" లోని చిన్న గంటను మ్రోగిస్తారు. అంటే, అది దాదాపుగా నడిరేయి సమయం కాబట్టి, స్వామివారికే తప్ప భక్తులకు సూచన అవసరం లేదన్నమాట.

👉🏻 కొద్దిసేపటి తరువాత, స్వామివారు పట్టెమంచంపై శయనించటానికి సిద్ధంగా ఉన్నపుడు, ఆ రోజుకు చిట్టచివరి నైవేద్యంగా వేడిపాలతో పాటుగా, నేతిలో వేయించిన ఎండు ఫలాలు మరియు తాజా పండ్ల ముక్కలు ("మేవా" అనబడే పంచామృతం) సమర్పిస్తారు.

👉🏻 ప్రతిరోజూ జరిగే సహస్రదీపాలంకరణ సేవ, డోలోత్సవం తరువాత *పంచకజ్జాయం* నివేదిస్తారు.

👉🏻 శ్రీవారి భోజనాల "మెనూ" ను నిశితంగా పరిశీలిస్తే, మనకు కొన్ని అబ్బుర పరిచే విశేషాలు అవగత మవుతాయి.

👉🏻 శ్రీవారిది సమతుల్యాహారం – కడుపు నింపే పదార్థాలు, జిహ్వకు రుచిగా ఉండేవి, పుష్టికరమైనవి, ఔషధగుణాలు కలిగినవి, సులభంగా జీర్ణమయ్యేవి, చలువ చేసేవి, ఎముకలను పటిష్టం చేసేవి (శరీరంలో అదనపు కాల్షియం కోసం, ప్రతిరోజు అత్యంత స్వల్పమోతాదులో మంచిముత్యాల పొడిని ఆహారంలో తీసుకునే ఆనవాయితి కొందరు శ్రీమంతుల కుటుంబాల్లో నేటికీ ఉందని చెప్తారు) - వీటన్నింటి సమాహారం.

👉🏻 ఇంచుమించుగా ప్రతిరోజూ నైవేద్యక్రమం, ప్రసాదాలు ఇలాగే ఉంటాయి. అయితే ఋతువులను బట్టి స్వల్ప మార్పులు చేస్తారు. అలాగే వారంలో కొన్ని రోజులు అదనపు నైవేద్యాలు సమర్పిస్తారు (పైన చెప్పుకున్న నిత్యనైవేద్యాలతో పాటుగా).

👉🏻‌ బ్రహ్మోత్సవాలలో, ధ్వజారోహణ (గరుడిని జండా ఎగురవేయడం) సందర్భంగా, *"కోడెపొంగలి"* అనే ప్రత్యేకమైన అన్నప్రసాదాన్ని నివేదిస్తా

[ రేపటి భాగంలో... *వార క్రమానుసారం అర్పించే ప్రసాదాలు* గురించి తెలుసుకుందాం].

*తిరుమల సర్వస్వం - 6* ♾️•••┉┅━❀🔯❀┉┅━•••♾️                        *శ్రీవారి ప్రసాద విశేషాలు - 1*✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు ...
06/07/2025

*తిరుమల సర్వస్వం - 6*
♾️•••┉┅━❀🔯❀┉┅━•••♾️

*శ్రీవారి ప్రసాద విశేషాలు - 1*

✍️ శ్రీమతి&శ్రీ పల్లపోతు వాణిశ్రీ-కృష్ణబాలాజీ
♾️•••┉┅━❀🔯❀┉┅━•••♾️

*శ్రీవారి ప్రసాదవిశేషాలు -1* 🙏

*శ్రీవారి భోజనప్రియత్వం* 🍚

*శ్రీవారు అలంకార, పుష్ప, సంకీర్తన ప్రియుడే కాదు; నైవేద్యప్రియుడు కూడా !*

👉🏻 ఆనందనిలయుడైన శ్రీనివాసుడు ఆరగించే లెక్కకు మిక్కిలిగా ఉన్న పిండివంటలనూ, దివ్యాన్నాలను లెక్క పెట్టలేక తికమక పడ్డ తెనాలి రామలింగ మహాకవి, *"తిండిమెండయ్యగారు"* అని తిరుమలేశునికి ఒక బిరుదు తగిలించి ఆ స్వామివారి భోజనప్రియత్వాన్ని చాటి చెప్పాడు.

👉🏻 *"ఇందిర వడ్డించ ఇంపుగను"* అంటూ అన్నమయ్యా...., *"పాలు, వెన్న, బకాళాబాతు"* అంటూ మరొక కవి, ఇలా ఎందరెందరో కవులు తిరుమలేశుని భోజనప్రియత్వాన్ని ఎలుగెత్తి చాటారు.

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *శ్రీవారికి మడులు - మాన్యాలు* 🙏

👉🏻 శ్రీవారి నివేదనకు నాటి రోజుల్లో ఎందరో చక్రవర్తులు, సామాన్యులు మడులూ - మాన్యాలు సమర్పించారు. ఆ విధమైన మాన్యాలు తిరుపతి పరిసరాల్లోనూ, చిత్తూరు జిల్లా అంతటా, అంధ్రా, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సుదూర ప్రాంతాలలోను ఈనాటికీ లెక్కలేనన్ని ఉన్నాయి. అయితే, శ్రీవారి భక్తుల హృదయాలను కలచివేసే విధంగా ప్రసాదాల రూపంలో తరతరాలుగా కోట్లాది భక్తుల ఆకలి తీర్చిన మరెన్నో మాన్యాలు వివిధ పాలకుల హయాంలో అన్యాక్రాంతం అయ్యాయి కూడా! మిగిలివున్న వాటిని పదిలపరచు కోవాల్సిన బాధ్యత తి.తి.దే. సంస్థదే కాదు, ఆ అంతులేని ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదకు వారసులమైన మన అందరిదీ కూడా!

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *భక్తుల ఆకలి తీర్చిన ప్రసాదాలు* 🙏

👉🏻 శ్రీవారి ఆలయంలో గోడల నిండా ఉన్న శాసనాలలో ఎక్కువ భాగం ఏ ఏ రాజులు, ఏ ఏ ప్రసాదాలకు ఎంతెంత రొఖ్ఖం చెల్లించారో, ఎన్నెన్ని మాన్యాలు ఇచ్చారో లాంటి వివరాల గురించే ప్రస్తావించాయి. తిరుమల కొండపై ఏ విధమైన హోటళ్ళు, ఇతరత్రా భోజన ఏర్పాట్లు లేని ఆ రోజుల్లో ఈ ప్రసాదాలే సుదూరప్రాంతాల నుండి వచ్చి తిరుమలను సందర్శించుకునే యాత్రికుల క్షుద్బాధను తీర్చేవి. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ ప్రసాదాల పరిమాణం కూడా పెరుగుతూ వచ్చింది. ఈనాడు తిరుమలలో, ప్రసాదాలు, భోజనాల నిమిత్తం జరిగే వంట ఏర్పాట్లు ప్రపంచస్థాయిలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు. దేవాలయానికి వచ్చిన ఏ భక్తుడు ఆకలితో లేదా అర్థాకలితో తిరిగి వెళ్ళరాదనే హిందూ సాంప్రదాయం తిరుమలలో అనూచానంగా పాటించ బడుతోంది.

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *శాస్తోక్తంగా వంటలు* 🙏

👉🏻 వంటవారు "వైఖానస ఆగమ సాంప్రదాయానికి" గానీ, "పాంచరాత్ర ఆగమ సంప్రదాయానికి" గానీ చెంది ఉండాలి.

👉🏻 వైఖానసాన్ని గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. *"పాంచరాత్ర సాంప్రదాయం"* అనగా...

👉🏻 హయవదనుడు అనే రాక్షసుడు బ్రహ్మనుండి వేదాలను తస్కరించి సముద్రగర్భానికి వెళ్ళి దాక్కున్నపుడు, వేదాలు మరియు అందులో పొందు పరుచబడిన మంత్రాలూ అందుబాటులో లేనందున, అయిదు రాత్రుల పాటు దేవతలంతా మంత్రం బదులుగా, తంత్రంతో విష్ణువుకు పూజ చేశారు. ఆ అయిదు రోజులు ఒక ప్రత్యేక పద్దతిలో భగవదారాధన జరిగింది కావున ఆ పూజా విధానానికి *"పాంచరాత్రము"* మనే పేరొచ్చింది. వేదాలను అసురుల నుండి రక్షించిన, *"వేదనారాయణ స్వామి"* వారి అత్యద్భుతమైన ఆలయాన్ని తిరుపతి సమీపంలో ఉన్న *"నాగులాపురం"* అనే గ్రామంలో నేడు మనం చూడవచ్చు.

👉🏻 శ్రీవారి అర్చాప్రక్రియలో ఒక ముఖ్య ఘట్టమైన - *"భోజ్యాసనం"* అంటే, నైవేద్యం సమర్పించే ప్రక్రియ.

👉🏻 విస్తారంగా జరిగే ఈ ప్రక్రియలో ప్రసాదాల వంటలకు సంబంధించి ఖచ్చితమైన విధివిధానాలు, నివేదించే పద్ధతులు, నివేదనా సమయాలు, జరగవలసిన ఉపచారాలు, వంటలో ఉపయోగించే దినుసులు, వాటి నిష్పత్తులు మొదలైనవన్నీ తూ.చా తప్పకుండా పాటిస్తారు.

👉🏻‌ శ్రీవారికి నివేదించే హవిస్సును (ప్రసాదాలను) గర్భాలయ ప్రాకారానికి ఆగ్నేయమూలలో ఉన్న *"పోటు"* అనబడే ప్రధాన వంటశాలలో సిద్ధం చేస్తారు. వకుళమాత ఈ వంటశాల గోడకు ఉన్న రంధ్రంలోంచి చూస్తూ, తన కుమారుడైన శ్రీనివాసుని కోసం తయారయ్యే వంటలన్నింటినీ నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. తల్లి ప్రేమ మరి!

ఈ సారి తిరుమల వెళ్ళినపుడు ఈ వకుళమాతను కూడా దర్శించుకుందాం.

👉🏻 శ్రీవారి ప్రసాదాల గురించి మొట్టమొదటి, 614 వ సం. నకు చెందిన శాసనం విమానప్రాకారం లోని ఉత్తరపు గోడమీద చెక్కబడి ఉంది. ఆలయచరిత్రకు సంబంధించి మనకు లభ్యమైన తొలిశాసనం కుడా ఇదే!

👉🏻 ఈ శాసనంలో తెలిపిన వివరాల ప్రకారం నాలుగు నాలీలు (ఒక నాలీ అంటే 16 పిడికిళ్ళు, సుమారు కిలో పైన) బియ్యంతో వండిన అన్నాన్ని కులశేఖరపడి లోపల శీవారికి నివేదన చేయాలి. దీని కోసం ఒక దాత తిరుచానూరు సమీపంలోని పైడిపల్లి అనే గ్రామాన్ని అర్చకులకు దత్తత ఇచ్చారు.

♾┉┅━❀🕉️❀┉┅━♾

🙏 *ప్రసాదాల విక్రయం* 🙏

👉🏻 తిరుమల ఆలయంలో ప్రసాదాలకు సంబంధించి జనబాహుళ్యానికి అంతగా పరిచయం లేని ఆసక్తికరమైన చరిత్ర ఎంతో ఉంది. ఆలయంలో లభించిన శాసనాల ప్రకారం (శాసనం సంఖ్య 286 T. T.) ఆరేడు వందల సంవత్సరాల క్రితం అప్పటివరకూ ఏ దక్షిణభారత ఆలయంలోనూ లేనివిధంగా శ్రీవారి అర్చకులు, దేవాలయంలో పనిచేసే సిబ్బంది, ఇతర రాజోద్యోగులు, శ్రీవారి నైవేద్య కైంకర్య నిమిత్తం భూములను దానంగా ఇచ్చేవారు. అందుకు ప్రతిగా, వారు ఏ ఏ ప్రసాదాల నిమిత్తం భూములను దానమిచ్చారో, ఆయా ప్రసాదాల్లో నాలుగో వంతు వాటా వారికి దక్కేది. ఆ విధంగా వారి హక్కుభుక్తమైన వాటాను *"ప్రసాదక్కరార్"* లు అనబడే ప్రసాదం విక్రయదారులకు అమ్ముకునేవారు. అలా వారికి దత్తమైన విక్రయహక్కులకు సంబంధించి దస్తావేజులను వ్రాయించి, ఆలయ రికార్డుల్లో నమోదుచేసి ఆ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించబడేది. ఆ విక్రేతలు తమకు హక్కుగా సంక్రమించిన నాలుగవ వంతు ప్రసాదాన్ని, ఆలయంలో *"ప్రసాదంపట్టెడ"* అనే ప్రదేశంలో ఉంచి భక్తులకు విక్రయించుకునే వారు. ఇలా దేవస్థానంవారి గుర్తింపుతో చట్టబద్ధంగా జరిగే లావాదేవీలు ఉభయతారకంగా ఉండేవి. ఈ ఏర్పాటుతో, అప్పట్లోనే విపరీతంగా గిరాకీ ఉన్న ప్రసాదాలను భారీమొత్తంలో తయారుచేయడం కోసం ఆలయానికి కావలసిన ఆదాయవనరులు, సాధన సంపత్తులు సమకూరేవి. అలాగే, జీతభత్యాలు లేకుండా లేదా అరకొర ఆదాయంతో స్వామివారిని నమ్ముకొని తరతరాలుగా అర్చనలు చేస్తున్న అర్చకులకు, ఆలయంలో ఇతర విధులు నిర్వర్తిస్తున్న చిరుద్యోగులకు స్వల్ప ఆదాయం ఒనగూడేది.

👉🏻 నాలుగవ వంతు ప్రసాదం దాతలకు కేటాయించగా, మిగిలిన మూడు వంతుల ప్రసాదంలో దేవస్థాన యాజమాన్యం కొంత భాగం విక్రయించి, మరి కొంత భాగాన్ని ఆర్జిత సేవా భక్తులకు వితరణ చేసి, మిగిలిన ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంచిపెట్టేవారు. నాలుగో వంతు ప్రసాదం దాతలకు ఇచ్చే ఆనవాయితీ ఈనాడు లేకపోయినా, మొత్తం ప్రసాదంలో కొంత భాగాన్ని భక్తులకు ఉచితంగా పంచిపెట్టి, మిగిలిన దానిని దేవస్థానం వారు నిర్ణయించిన ధరలకు విక్రయించే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.

👉🏻‌ తిరుమలలో ప్రారంభమైన ఈ *"ప్రసాదం హక్కుల విక్రయ"* సాంప్రదాయం, తర్వాతి కాలంలో దక్షిణ భారతదేశం లోని అనేక దేవాలయాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.

[ రేపటి భాగంలో... *ప్రసాదాల తయారీకి నిబంధనలు* & *ఎన్ని రకాల ప్రసాదాలు* & *వార క్రమానుసారం అందించే ప్రసాదాలు* గురించి తెలుసుకుందాం]

•••┉┅━❀🕉️❀┉┅━•••
🙏 *శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 🙏

*...తిరుమల సర్వస్వం..... సశేషం...*
•••┉┅━❀🕉️❀┉┅━•••

అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలుగుడ్ మార్నింగ్ ఆల్   💕🌹🌷🙏
06/07/2025

అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
గుడ్ మార్నింగ్ ఆల్ 💕🌹🌷🙏

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when It's krishnaveni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to It's krishnaveni:

Share