Ratha Sarathi

Ratha Sarathi Ratha Sarathi Web is your number one source for all Telugu Happenings Around World. Our Experienced.

దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) అభివృద...
19/01/2023

దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం) అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో దేశానికి, దేశంలోని ప్రతి పౌరుడికి అమృత కాలమని.. ఈ సమయంలోనే దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా నిర్మించుకోవాలని అన్నారు. పరిశ్రమలను విస్తరించడం, మంచి పంటలను పండించడం వంటి కార్యక్రమాల ద్వారానే మన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి దేశంలో కేవలం 3 కోట్ల ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా నీళ్లు వచ్చేవని......

దేశ అభివృద్ధే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో (కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్.....

కుమురం భీం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లాలోని వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు ఆ పార్టీకి ...
28/12/2022

కుమురం భీం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లాలోని వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వాంకిడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 2019లో పార్టీలో చేరామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభవృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము గెలిచి అధికారం చేపట్టిన తొలి రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు రాలేదన్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ఈ విషయమై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి వారికి నచ్చజెబుతామని, సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

BRS got a shock in Kumuram Bhim district. 18 tribal sarpanchs from Wankidi mandal of the district have resigned from the party. Sarpanchs at a press

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. జనవరి ఆరో తేదీ నుంచి 18 వరకు ఇవి అందుబా...
15/12/2022

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. జనవరి ఆరో తేదీ నుంచి 18 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ కోసం ఊర్లు వెళ్లే వారి సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు బస్సులు నడపనుంది. అంతేకాదు.. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ చార్జీలే వసూలు చేయనుంది. అలాగే, ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా బస్సులు నడపనుంది. విజయవాడ నుంచి 1000 ప్రత్యేక బస్సులను పలు ప్రాంతాలకు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్ బుకింగ్ కేంద్రాల ద్వారా స్పెషల్ బస్సులకు టికెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు....

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ప్రకటించింది. జనవరి ఆరో తేదీ నుంచి 18 వరకు ఇ....

ఈ దొంగ మామూలోడు కాదు. ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటలో క...
15/12/2022

ఈ దొంగ మామూలోడు కాదు. ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని నిలిపి ఉంచారు. వేరే కేసు కోసం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అటు వెళ్లగా, వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు చోరీ చేశాడు. ఆ సమయంలో వాహనానికే తాళం ఉండటంతో సులభంగా తీసుకెళ్లిపోయాడు. ఈ తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు....

ఈ దొంగ మామూలోడు కాదు. ఏకంగా పోలీసుల వాహనాన్నే చోరీ చేశాడు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సూర్య...

హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు యాదాద్రి పెద్దగుట్టపై ప్రత్యేక పూజలు పాల్గొన్న శ్రీనివాసరావు, సీహ...
15/12/2022

హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు యాదాద్రి పెద్దగుట్టపై ప్రత్యేక పూజలు పాల్గొన్న శ్రీనివాసరావు, సీహెచ్ విద్యాసాగర్, కుటుంబ సభ్యులు సాధారణంగా కొత్త వాహనాలను ప్రారంభించడానికి ముందు పూజలు చేయడం సర్వసాధారణ విషయమే. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో నిత్యం వాహన పూజలు జరుగుతుంటాయి. అయితే, తొలిసారి ఓ హెలికాప్టర్‌కు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎండీ, హైదరాబాద్ ఎయిర్‌ లైన్స్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ బోయినపల్లి శ్రీనివాసరావు ఈ హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. యాదాద్రి పెద్దగుట్టపై నిన్న ఈ హెలికాప్టర్‌కు పూజారులు పూజలు చేశారు. చాపర్ యజమాని బోయినపల్లి శ్రీనివాసరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌ రావుతోపాటు వారి కుటుంబ సభ్యులు ఈ పూజల్లో పాల్గొన్నారు. హెలికాప్టర్‌ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

హెలికాప్టర్‌ను కొనుగోలు చేసిన బోయినపల్లి శ్రీనివాసరావు యాదాద్రి పెద్దగుట్టపై ప్రత్యేక పూజలు పాల్గొన్న శ్రీ.....

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Ratha Sarathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share