Praja Varadhi News

Praja Varadhi News Praja Varadhi Telugu news channel dedicated to report news across Telangana Andhrapradesh and other

23/09/2025

భావోద్వేగానికి లోనైనా మంత్రి సీతక్క.,..

*పూజారులు, ఆదివాసి పెద్దలు, అధికారులతో మేడారం అభివృద్ధి ప్రణాళిక పై సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో భావోద్వేగానికి లోనైనా మంత్రి సీతక్క*

మరో వెయ్యేండ్లు నిలిచిపోయేలా సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని సీఎం అభివృద్ధి పరుస్తున్నందుకు వేలవేల వందనాలు

వన దేవతల గుడిని అభివృద్ధి చేసుకునే భాగ్యం దక్కినందుకు నా జన్మ ధన్యం అయిందననీ ఎమోషనల్ అయిన మంత్రి సీతక్క

17/09/2025

వాగులో చిక్కుకున్న కూలీలు...నీటి ప్రవాహం పెరిగి వరదలో చిక్కుకుపోయిన ఐదు ఇసుక ట్రాక్టర్లు

*కొత్త యూపీఐ లావాదేవీ పరిమితులు..*New UPI Updates
15/09/2025

*కొత్త యూపీఐ లావాదేవీ పరిమితులు..*
New UPI Updates

14/09/2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు పని చేయాలి

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి

పోలింగ్ బూత్ ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి

నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి.

కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుంది.

అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుంది…

పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉంది

మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటా

జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి.

https://youtu.be/7DI6_g0sOXM?si=07pMELEZsuQCAVdZ
14/09/2025

https://youtu.be/7DI6_g0sOXM?si=07pMELEZsuQCAVdZ

టెక్స్ అకాడమీ మెగా జాబ్ మేళా...వెయ్యి మందికి పైగా విద్యార్థులు హాజ► Subscribe to Praja Varadhi News Telugu...

14/09/2025

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు.

అక్టోబర్ 3 న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగే “అలయ్ బలయ్” కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన దత్తాత్రేయ.

*తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..!!_*హైదరాబాద్‌: కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా 'మీ సేవ' నూతన ప్...
12/09/2025

*తెలంగాణలో ఇక సులభంగా కుల ధ్రువీకరణ పత్రాల జారీ..!!_*

హైదరాబాద్‌: కుల ధ్రువీకరణ పత్రాలను సులభంగా పొందేలా 'మీ సేవ' నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. బీసీ, ఎస్టీ, ఎస్సీ వర్గాలకు చెందిన పౌరులు(ప్రత్యేక కేసులు మినహా) ఇప్పుడు మీ సేవ కేంద్రాల్లో నేరుగా కుల ధ్రువీకరణ పత్రాలను పొందవచ్చు.

గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్‌ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది. దీనివల్ల ధ్రువీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో.. ఈ సమస్యను నివారించడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాలతో.. మీ సేవ విభాగం దీనిపై దృష్టిపెట్టింది. సీసీఎల్‌ఏ, బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ అధికారులు, తహసీల్దార్‌లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అనంతరం తాజా మార్పులు చేపట్టారు. ప్రయోగాత్మకంగా ఈ మార్పును 15 రోజుల క్రితం అమల్లోకి తెచ్చారు. ఇప్పటికే 17,571 మంది ఈ సేవను విజయవంతంగా పొందారు. ప్రతి సంవత్సరం దాదాపు 20 లక్షల మంది కుల ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కొత్తగా జారీ చేసే సర్టిఫికెట్‌లో.. గతంలో ఆమోదించిన అధికారి వివరాలు, తిరిగి జారీ తేదీ ఉంటాయి. ప్రత్యేక కేసుల్లో(ఉదాహరణకు హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీ-సీ కిందకు వస్తే.. జీవో ఎంఎస్‌ నం.3, తేదీ 9.9.2020 ప్రకారం) దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు.

*_సేవను ఎలా పొందాలంటే..._*

*_పాత సర్టిఫికెట్‌ నంబర్‌ తెలిస్తే: మీ సేవ కౌంటర్‌లో ఆ నంబర్‌ను అందించడం ద్వారా కొత్త ప్రింటవుట్‌ పొందవచ్చు._*

*_నంబర్‌ తెలియకపోతే: మీ సేవ సిబ్బంది మీ జిల్లా, మండలం, గ్రామం, ఉప-కులం, పేరు ఆధారంగా శోధిస్తారు. మరిన్ని వివరాల కోసం మీ సేవ వెబ్‌సైట్‌ను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చని మీ సేవ కమిషనర్‌ రవికిరణ్‌ తెలిపారు.

09/09/2025

బాపు మంచిగా ఉన్నాడా అయ్యా అనికేటీఆర్ ను... కేసిఆర్ గురించి ఆప్యాయంగా అడిగిన మహిళలు

09/09/2025

*బ్రేకింగ్ *మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్ పల్లి గ్రామంలో సిలిండర్ పేలడంతో ధ్వంసమైన ఇల్లు...

ముందుగా గ్యాస్ లీకేజీ ని గుర్తించి ఏమీ చేయలేని పరిస్థితిలో బయటకు వెళ్ళిపోయిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులు...

కొద్దిసేపటికి పేలి పోయిన సిలిండర్...

ఎవరికీ ఎలాంటి హాని జరగకపోయినప్పటికీ ఇల్లు మాత్రం పూర్తిగా కూలిపోయింది...

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Praja Varadhi News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Praja Varadhi News:

Share