21/08/2025
అమెరికా ద్వంద్వ నీతిని ఎండగట్టిన జయశంకర్.
****************************************
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచ మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చాయనే నెపంతో అమెరికా ఎప్పటికప్పుడు భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ అమెరికా ద్వంద్వ వైఖరిని సూటిగా, నిర్భయంగా ఎండగట్టిన విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ గారి వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన చెప్పిన ఒక్కో మాట అమెరికా ద్వంద్వ నీతిని బహిర్గతం చేస్తూ, భారత్ జాతీయ ప్రయోజనాల పట్ల ఎంత కట్టుబడి ఉందో చాటిచెప్పాయి.
జయశంకర్ గారు చాలా స్పష్టంగా సుత్తిలేకుండా తనదైన శైలిలో ఈ విదంగా చెప్పారు. రష్యా దగ్గర చమురు ఎక్కువగా కొనేది భారత్ కాదు, చైనానే. రష్యా గ్యాస్‌పై ఆధారపడింది భారత్ కాదు, యూరోపియన్ యూనియన్. 2022 తర్వాత రష్యాతో గరిష్టంగా వ్యాపారం కొనసాగించింది కూడా భారత్ కాదు, పాశ్చాత్య దేశాలే. అయినా భారత్ పై మాత్రమే ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు? అని ఆయన అమెరికాను నేరుగా నిలదీశారు.
ప్రపంచ మార్కెట్ సమతుల్యంగా ఉండాలని ముందుగా చెప్పింది అమెరికానే అని, అదే మాటను పట్టుకుని భారత్ కూడా తన అవసరాలకు అనుగుణంగా రష్యా నుండి చమురు దిగుమతి చేసుకుంటోందని ఆయన వివరించారు. అంతేకాదు, అమెరికా నుండి కూడా భారత్ చమురు కొనుగోలు చేస్తుందనీ భవిష్యత్తులో గణనీయంగా పెంచుతోందని జయశంకర్ గారు తేల్చిచెప్పారు. ఒకవైపు దేశ ప్రయోజనాలను కాపాడుకుంటూ, మరోవైపు అమెరికా ద్వంద్వ నీతిని బహిరంగంగా ఎండగట్టిన జయశంకర్ గారి ధైర్యవంతమైన సమాధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.