02/09/2025
                                            పీ సీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి  చర్యలు తీసుకోవద్దు: హైకోర్టు 
 తెలంగాణ హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు స్వల్ప ఊరట లభించింది. కాలేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కాలేశ్వరం కమిషన్ వేదికపై హరీష్ రావు, కెసిఆర్ దాఖలు చేసిన పిటిషన్ను సెప్టెంబర్ 2న హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కెసిఆర్, హరీష్ రావు తరపున న్యాయవాదులు సుందరం ,శేషాద్రి నాయుడు వాళ్ళని వినిపించారు.
 ప్రభుత్వం తరఫున వాదన నిర్మించిన న్యాయవాది సుదర్శన్ రెడ్డి అసెంబ్లీలో కాలేశ్వరం నివేదికపై చర్చించామని చెప్పారు. కాలేశ్వరం విచారణలను సిబిఐ కి అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని హైకోర్టుకు తెలిపారు. కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుందని ఇంకా ఎలాంటి చర్యలు జరగలేదని చెప్పారు. సిబిఐ దర్యాప్తుకు కాలేశ్వరం కమిషన్ నివేదికకు సంబంధం లేదని తెలిపారు. సిబిఐ దర్యాప్తులో నిజాలు బయటకు వస్తాయని... సిబిఐ దర్యాప్తు ఆధారంగానే చర్యలు ఉంటాయని కోర్టుకు తెలిపారు ఏజీ. అనంతరం కోర్టు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7 కు వాయిదా వేసింది.