Prajatantranews

Prajatantranews the only Telangana daily newspaper since 28 years

13/09/2026

                   *నవలా పరిచయం "నిజానికి మనుషులందరూ ఇంతేనేమో! వారు తమ అనుభవాలకు అర్థం ఇవ్వకుండా ఉండలేరు. కానీ ఆ క్రమంలో...
11/09/2026


*నవలా పరిచయం
"నిజానికి మనుషులందరూ ఇంతేనేమో! వారు తమ అనుభవాలకు అర్థం ఇవ్వకుండా ఉండలేరు. కానీ ఆ క్రమంలో మనసుకు నచ్చచెప్పుకునే కథే వాస్తవాన్ని కప్పేస్తుంది. మనకు వాస్తవం కంటే దానిగురించి తయారు చేసుకున్న కథే ఎక్కువ అవసరం, ఆసరా అవుతుంది. మనిషిలో మనం చూసే ప్రత్యేకత నిజంగా ఆ మనిషిలో ఉంటుందా? లేక మనలో ఉండే లోపాలూ, మన గతానుభవాలు, మనం చదివిన పుస్తకాలూ, ఆస్వాదించిన కళలూ, భావోద్వేగాలు, ఒంటరితనం- ఇవన్నీ కలిసి ఆ మనిషికి లేనిపోని ప్రత్యేకతను ఆపాదించాయా? ఒక సంబంధంలో మనం ప్రేమించేది ఎదుటివ్యక్తినా, లేక ఆ వ్యక్తిలో మనం చూడాలనుకుంటున్న మన ప్రపంచాన్నీ, రూపాన్నా? మిలియన్ డాలర్ ప్రశ్నే.."
-నాగినీ కందాల
ప్రూస్ట్ జ్ఞాపకాల చిత్రకారుడు
please subscribe our channel youtube.com/-n…
---------------
*కథ
లిటర(రీ)సీ
-బమ్మిడి జగదీశ్వరరావుమెరుపు తీగెలు
---------------
కవిత :జయహో కాళోజీ కవి
-జన జ్వాల
--------------------
హైకూ సమయాలు
టీచర్
-చిత్తలూరి--------------------prajatantranews.com/category/sahit… follow our page facebook.com/prajatantranew…

“తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో, ప్రభుత్వ నియామకాల బోర్డులు తమ సాంప్రదాయ విధానాలను సమూలంగా మార్చుకోవాల్సిన సమయం ...
10/09/2026

“తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో, ప్రభుత్వ నియామకాల బోర్డులు తమ సాంప్రదాయ విధానాలను సమూలంగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సాధారణంగా పోలీస్, అటవీ శాఖల వంటి విభాగాలలో శారీరక సామర్థ్య పరీక్షలు అత్యంత కీలకం. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన ప్రమాణాలను (ఉదాహరణకు పరుగు పందెం దూరం, లాంగ్ జంప్, ఎత్తు, మరియు ఛాతి కొలతలు) ట్రాన్స్‌జెండర్ల శరీర తత్వానికి,సామర్థ్యానికి అనుగుణంగా ఎలా వర్తింపజేయాలనే దానిపై ప్రభుత్వం తక్షణమే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.ట్రాన్స్‌జెండర్ల శారీరక ప్రమాణాలను పురుషులతో పోల్చడం ఎంతమాత్రం సమంజసం కాదు..”
-సంపాదకీయం
https://www.prajatantranews.com/why-is-there-a-delay-in-the-implementation-of-equality-rights/
Please follow our page Facebook.com/prajatantranewspaper

“సోమవారం జరిగిన దౌర్జన్యానికి వ్యతిరేకంగా మంగళవారం ప్రదర్శనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రమే కాదు, శాసనసభ నుంచి వంద మైళ...
10/09/2026

“సోమవారం జరిగిన దౌర్జన్యానికి వ్యతిరేకంగా మంగళవారం ప్రదర్శనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు మాత్రమే కాదు, శాసనసభ నుంచి వంద మైళ్ల అవతల ప్రతిపక్ష నాయకుడి ఇంటి ముందు చావు డప్పులు మోగించాలని అనుకోవడం మరింత హీనమైన చర్య. ఆ హీనమైన చర్య జరపడానికి వెళ్లేవారిని వెళ్లనిచ్చి, దాన్ని ఆపడానికో, తమ నాయకుడికి అండగా నిలబడడానికో వెళ్తున్నవాళ్లను మాత్రం ఆపడానికి పోలీసులను వాడడం మరింత హీనమైన చర్య. చివరికి బుధవారం ప్రధాన ప్రతిపక్ష సభ్యులందరినీ సమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం..”
-ఎన్ వేణుగోపాల్,*తెలంగాణార్థం*
Please follow our page Facebook.com/prajatantranewspaper
https://www.prajatantranews.com/ignoring-real-issues-is-a-police-state-the-only-answer/

" ఆగస్ట్ 31 మధ్యాహ్నం 2 గం లకు (అమెరికా కాలమానం)   వాషింగ్టన్ డి.సి. అమెరికా క్యాపిటల్ భవనంలో డైసీ లీ గాట్సన్ బేట్స్ విగ...
09/09/2026

" ఆగస్ట్ 31 మధ్యాహ్నం 2 గం లకు (అమెరికా కాలమానం) వాషింగ్టన్ డి.సి. అమెరికా క్యాపిటల్ భవనంలో డైసీ లీ గాట్సన్ బేట్స్ విగ్రహం ముందు నిలబడిన క్షణం, అది ఒక సాధారణ పర్యాటక అనుభవం మాత్రమే కాదు. జర్నలిజం, పౌరహక్కులు, సామాజిక న్యాయం—ఈ మూడు విలువలు ఒకే వ్యక్తిత్వంలో ఎలా కలిసిపోతాయో గుర్తు చేసే చారిత్రక క్షణం...
please subscribe our channel youtube.com/-news
మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష భావజాలాన్ని విస్తరింప జేయడంలో తన వంతు పాత్ర పోషించిన " ప్రజాతంత్ర' పత్రిక నిర్వాహకునిగా ఆ విగ్రహం ముందు నిలబడినప్పుడు సహజంగానే మన దేశ,రాష్ట్ర పరిస్థితులు గుర్తుకు వొస్తాయి. మన దగ్గర కూడా పత్రికా స్వేచ్ఛ, పౌరహక్కులు, మానవ హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలు నిరంతరం పరీక్షకు లోనవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో డైసీ బేట్స్ జీవితం ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది.."
*పత్రికను ప్రజాహక్కుల ఆయుధంగా మార్చిన మహనీయురాలు*
పూర్తి కథనం..కింద లింక్ క్లిక్ చేయండి
https://www.prajatantranews.com/a-noble-woman-who-turned-the-newspaper-into-a-weapon-for-peoples-rights/
please follow our page facebook.com/prajatantranewspaper

08/09/2026

Address

IDA, Uppal
Hyderabad
500039

Alerts

Be the first to know and let us send you an email when Prajatantranews posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Prajatantranews:

Shortcuts

Share