Common Man Media Tv

Common Man Media Tv provides information on the latest news and news updates political news, sports ne

అధికారం లో వుంది మీరే కద సార్...కుదిరితే శిక్షించండి...లేదంటే కాల్చి పడేయండి... ✍️✍️✍️PMO India Pawan Kalyan
28/05/2025

అధికారం లో వుంది మీరే కద సార్...
కుదిరితే శిక్షించండి...
లేదంటే కాల్చి పడేయండి... ✍️✍️✍️
PMO India Pawan Kalyan

*❓ పాకిస్తాన్ కాశ్మీర్ (పీ.ఓ.కె)ను ఆక్రమించుకొన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!**❓ ముంబాయి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎ...
29/04/2025

*❓ పాకిస్తాన్ కాశ్మీర్ (పీ.ఓ.కె)ను ఆక్రమించుకొన్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ ముంబాయి దాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ చైనా మన భూభాగాన్ని లాక్కున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ మన వీర సైనికుల తలలు నరికి, పాకిస్తానీలు తీసుకుపోయిప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ బోఫోర్స్ కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ సైనికుల యూనిఫామ్‌ల డబ్బులను కూడా నాకేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ దేశభక్తులైన సిక్కు సోదరులను ఊచకోత కోసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ సిమ్లా ఒప్పందం ద్వారా దేశంలో విలువలేనిదని, పాకిస్తాన్‌కు భూమి ఇచ్చిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ అస్సాంలో హిందువుల రక్తం చిందినప్పుడు, ఆ ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ కాశ్మీరీ పండిట్లను ఊచకోత కోసి, మిగిలినవారిని భయభ్రాంతులకు గురిచేసి తరిమేసినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ కామన్వెల్త్ స్కామ్ జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ బొగ్గు కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ 2జి కుంభకోణం జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ దూరదర్శన్ మోనో నుండి "సత్యం శివం సుందరం" తీసివేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ భారతీయ కరెన్సీపై నుండి "సత్యమేవ జయతే" తొలగించిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ ఒక వెధవ వందేమాతరాన్ని అవమానించినప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ మనదేశం తీసుకునే ప్రతీ నిర్ణయాన్నీ మీకు చేరవేస్తాం అని తల్లీకొడుకులు కలిసి చైనాతో రహస్య ఒప్పందం చేసుకున్నప్పటి ప్రభుత్వం ఎవరిది ?!!!*
*❓ పాకిస్తాన్ పంపిన టెర్రరిస్టులు చేసిన ముంబాయిలో బాంబులు పేల్చి వందలాదిగా అమాయకుల ప్రాణాలు తీస్తే, వారిపై కక్ష తీర్చుకోవాలనే కసితో, సర్జికల్ స్ట్రయిక్ చేయటానికి సర్వం సిద్దం చేసుకున్న మన త్రివిధ దళాలకు అనుమతి నిరాకరించి, వారిని అచేతనులుగా చేసిన ప్రభుత్వం ఎవరిది ?!!!*
*🇮🇳 ఇవన్నీ... భారతదేశంలో ఓటు వేసే ప్రతీ సామాన్య పౌరుడూ తెలుసుకోవలసిన వాస్తవాలు... మీరు దేశంకోసం ఏదైనా చేయాలనుకుంటే, ముందుగా ఈ సందేశం కనీసం ఓ పదిమందితో పంచుకోవడం, దేశానికి జరిగిన నష్టానికి బాధ్యులైన దేశద్రోహ పాలకులను గుర్తించడం అవసరం.* మన మాతృదేశాన్ని కాపాడుకునే యజ్ఞంలో మనం భాగస్వామ్యం కావడం బాధ్యతగా తీసుకుందాం.
నేను సైతం... ధన్యవాదములు✍️
*భారత్ మాతాకి జై 🇮🇳*

*మధ్య తరగతి ప్రజలు ధనవంతులు కావడం ఎలాగో చెప్పిన  కంపెనీ CEO నితిన్ కామత్*ఈ రోజుల్లో ధనవంతులు కావాలంటే అందరికి సాధ్యం కాక...
12/04/2025

*మధ్య తరగతి ప్రజలు ధనవంతులు కావడం ఎలాగో చెప్పిన కంపెనీ CEO నితిన్ కామత్*

ఈ రోజుల్లో ధనవంతులు కావాలంటే అందరికి సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు ధనవంతులు కావాలంటే కష్టమైన పని అనుకుంటారు. కానీ కొన్ని ట్రిక్స్‌ పాటించడం వల్ల మధ్య తరగతి ప్రజలు కూడా ధనవంతులు కావచ్చని జెరోధా సహ వ్యవస్థాపకుడు, CEO నితిన్ కామత్ సలహా ఇస్తున్నారు

మధ్యతరగతి ఉచ్చు అనేది ప్రజలను బయటపడటం కష్టతరమైన పరిస్థితిలో చిక్కుకుపోయేలా చేస్తుందని కూడా ఆయన అన్నారు. కొన్ని పొరపాట్ల చేయడం కారణంగా అప్పుల్లో కూరుకుపోవచ్చనేది ఆయన అభిప్రాయం.

మధ్యతరగతి ఉచ్చు అంటే ఏమిటి?
కష్టపడి పనిచేయండి.. ఉద్యోగం సంపాదించండి. అయితే అనవసరమైన రుణం తీసుకోవాలని ఇబ్బందులు పడకండి.. ఆడంబరమైన వస్తువులపై డబ్బును వృధా చేయకండని సూచించారు. ఇలాంటి విషయాలలో డబ్బును వృధా చేసి అప్పుల్లో చిక్కుకుంటారని చెబుతున్నారు.

మధ్యతరగతి ఈ ఉచ్చు నుండి బయటపడటం ఎలా?
1. మీ ఖర్చులను తగ్గించుకుని పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి. మీ నెలవారీ ఖర్చులను రాయండి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని, అందులో కేవలం 1% తీసుకొని ఇండెక్స్ ఫండ్ లాంటి సాధనంలో పెట్టుబడి పెట్టండి.

2. అత్యవసర నిధిని సృష్టించండి. కనీసం 6 నెలల ఖర్చులను ఆదా చేసుకోండి. ఉదాహరణకు, మీ నెలవారీ ఖర్చు రూ.30,000 అయితే, మీరు ఉద్యోగం కోల్పోయినప్పటికీ హాయిగా జీవించడానికి రూ.1.8 లక్షలు ఆదా చేయండి.

3. ఆరోగ్య బీమా తీసుకోవాలని నిర్ధారించుకోండి. ఈ రోజుల్లో ఆసుపత్రి బిల్లులు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి ఆరోగ్య బీమా లేకుండా రిస్క్ తీసుకోకండి.

4. దురాశ వద్దు. క్రమశిక్షణతో ఉండండి. త్వరిత రాబడి కోసం డబ్బు వృధా చేయకండి. క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి. కాలక్రమేణా డబ్బు పెరగనివ్వండి

*ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!* భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు,పులి గోళ్లతో “అ...
04/04/2025

*ఛత్రపతి శివాజీ ప్రాణాలు కాపాడిన వీరుని చరిత్ర…!!*

భారత దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు,
పులి గోళ్లతో “అఫ్జల్ ఖాన్” గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్దపులి,
ఆడవాళ్లను గౌరవించడం నేర్పిన అసలైన మగాడు. హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్దారకుడు,
కేవలం రాజ్యాలను పాలించే రాజుగా మిగిలి పోకుండా ప్రజలను ప్రేమించి “ఛత్రపతి” గా ఎదిగిన జిజియా బాయి ముద్దు బిడ్డ…!!

నేను ఎవరి గురించి చెబుతున్నానో మీకు ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. అతడే మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహరాజ్ 💪🚩🚩

కానీ ఈ వ్యాసం ఛత్రపతి శివాజీ మహరాజ్ గురించి కాదు ఆ శివాజీ మహరాజ్ ప్రాణాలనే కాపాడిన ఒక యోదుడి గురించి.

రాజు కోసం, దేశం కోసం, ధర్మ కోసం – చావును సైతం దిక్కరించి, దేహమంత రక్తంతో తడిసి ముద్ద అయినా కూడా, రాజు ఛత్రపతి శివాజీ సురక్షితుడు అయ్యాడు అన్న వార్త తెలిశాకే ప్రాణాలను వదులతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుడి గురించి. మన చరిత్ర మనం తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత…!!

అది 1660 వ సంవత్సరం.
బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న “ఆదిల్షాయులు” ఎన్నో సార్లు శివాజీ మీదకు యుద్ధానికి వెళ్లి చావు దెబ్బ తిని ఓడిపోయేవారు. అందుకే ఈ సారి ఆధీల్షాయులు “మొగల్ చక్రవర్తి ఔరంగజేబు” సహాయం తీసుకొని మరీ పన్హాలా కోటలో 600 మంది సైన్యంతో ఉన్న శివాజీని, శివాజీ కుడి భుజం, సర్వ సైన్యాధిపతి అయిన “బాజీ ప్రభు థేస్పాండే” ని 10000 వేల సైన్యం తో కోటని చుట్టుముట్టి బంధీలను చేశారు. సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని “ఆధీల్షాయులు” ఎదురు చూస్తున్నారు.

కేవలం 600 మంది సైన్యం. ఆ 600 మంది సైన్యం, 10000 మందితో పోరాడి యుద్ధం గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒక్కటే శివాజీకి ఉన్న మార్గం. కానీ 10000 మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు, పన్హాలా కోటలో ఉన్న ధాన్య శాలలో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ ఐతే ఆధీల్షాయులలోని సైన్యం కొంతభాగం ఆహారం సేకరించుటకు వెళ్తుంది. అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ ఆదేశించారు. కొన్ని నెలలు గడిచాయి పన్హాల కోటలోని ఆహారం దాన్యగారం లోని ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి.

ఇప్పడు 10000 మందికి ఆహారం కావాలి కాబట్టి ఆధీల్షాయుల సైన్యం లోని కొంతభాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు. ఛత్రపతి శివాజీ తప్పించుకొనే సమయం అస్సన్నమైనది. పన్హలా కోట నుండి “రంగీ నారాయణ్” అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న “విశాల్ఘట్ కోటకు” వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు.

13 జులై 1660 వర్షాకాలం. అమవాస్యకి దగ్గరలో వెన్నెల కాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి, ఛత్రపతి శివాజీ – బాజీ ప్రభువులతో పాటు 600 మంది సైనికులు “విశాల్ఘట్” కు అడవి మార్గం గుండా ప్రయాణించటానికి సిద్ధంగా ఉన్నారు.

సైన్యం లో శివాజీ మహారాజు పోలికలతో ఉండే “శివకాశీ” అనే ఒక సైనికుడిని శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చుగుద్దినటట్లుగా శివాజీ మహారాజు లాగా తయారు చేసి ఆధీల్షాయి సైన్యానికి కనపడే విధంగా 10 మంది సైనికులతో పంపించారు.

ఛత్రపతి శివాజీ వేషంలో ఉన్న శివకాశీ ని చూసి శివాజీ నే తప్పించుకుంటున్నాడు అనుకుని ఆదిల్షాయిల సైన్యాధిపతి తన సైన్యం అంతటినీ పిలిపించాడు. ఇదే అదును చూసి ఆదిల్షాయిల సైన్యం మొత్తం శివకాశీ దగ్గరకు వెళ్లినప్పుడు, విశాల్ఘట్ వైపుకు అడవి మార్గం గుండా అతి వేగంగా బయలు దేరారు శివాజీ అతని సైనికులు.

వర్షాల తాకిడికి అడవిగుండా ముళ్లకంపలు చెత్తా చెదారం కొట్టుకొచ్చాయి, నడిచే మార్గం అంతా బురద ముళ్ల పొదలతో భయంకరంగా ఉంది.
కానీ అక్కడ ఉన్న 600 మందికీ ఒక్కటే లక్ష్యం ఛత్రపతి శివాజీని విశాల్ఘట్ కు చేర్చటం. ఆ 600 కి ఉన్న ధైర్యం కూడా ఒక్కడే అతడే బాజీ ప్రభు దేశ్పాండే….!!

బాజీ ఉన్నంత వరకు తమను ఎవరూ ఏమి చేయలేరు అనే నమ్మకం తో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆదిల్షాయిల సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజు ను కాదని మారువేషంలో ఉన్న శివకాశీ అని తెలుసుకోటానికి ఎక్కువ సమయం పట్టలేదు.

శివకాశీ ని అక్కడికక్కడే నరికి చంపి 8000 మంది సైన్యాన్ని శివాజీ వెనుక తరముకుంటు వెళ్లి శివాజీ ని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు. తెల్లవారే సమయానికి “గోడ్కింగ్” అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకొంటున్న శివాజీ సైన్యం, ఆదిల్షాయుల సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఆదిల్షాయిల సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్ఘట్ కి చేరటం అసాధ్యం …

ఎందుకంటే ఆ సమయం లో ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుఱ్ఱం కూడా లేదు, కానీ సగం ఆదిల్షాయిల సైన్యం వద్ద గుఱ్ఱలు ఉన్నాయి. అక్కడే యుద్ధం చేసి ఆదిల్షాయిల సైన్యాన్ని ఓడించటం జరగని పని.

8000 మంది సైన్యం తో 600 మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం. ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఒకే ఒక్క దారిని బాజీ ప్రభువు రాజుతో వివరించాడు.

గోడ్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం ఈ దారిగుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు.
సైన్యం లో సగం మందిని అంటే సరిగ్గా 300 మందితో నేను గోడ్కింగ్ కు అడ్డుగా నిలబడి ఆదిల్షాయిల సైన్యం తో పోరాడుతాను. ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారిగుండా రాలేరు కాబట్టి తక్కువులో తక్కువ రెండు మూడు గంటల వరకు నేను ఆదిల్షాయిలను ఆపగలను. ఈ సమయం లో మిగిలిన 300 మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ “విశాల్ఘట్” కు చేర్చండి. శివాజీ మహారాజు సురక్షితంగా విశాల్ఘట్ కు చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను 5 సార్లు పేల్చండి.
ఫిరంగులు శబ్దం మహారాజు సురక్షితంగా విశాల్ఘట్ కు చేరారు అని నాకు సంకేతం…అని పథకాన్ని వివరించాడు. మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు.

300 మంది సైన్యం తో శివాజీ మహారాజు విశాల్ఘట్ కు బయలు దేరాడు. మిగిలిన 300 మంది సైన్యం తో బాజీ ప్రభువు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. ఆదిల్షాయిల సైన్యం గోడ్కింగ్ కు చేరుకుంది. యుద్ధం మొదలు అయ్యింది. అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్షాయిలను నరికేస్తున్నారు బాజీప్రభు అతని సైన్యం. ఇరుకైన కొండ ప్రాంతం అవ్వటం తో శివాజీ మహారాజుకు తప్పించుకోడానికి ఎక్కువ సమయం దొరికినా అవతలి వైపు ఉన్నది 8000 మంది సైన్యం 300 మంది బాజీ ప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పటం ఆపటం లేదు. సమయం గడిచేకొద్దీ బాజీ ప్రభు సైన్యం తరిగిపోతుంది , కానీ బాజీ ప్రభువు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్షాయిల వైపు 20 నుండి 30 మంది చనిపోతున్నారు . సుమారు 4 గంటలు గడిచే సరికి 8000 మంది ఆదిల్షాయిల సైన్యం లో 5000 మంది మరణించారు. కానీ బాజీ ప్రభు సైన్యం లో దాదాపు అందరు మరణించారు.

బాజీ ప్రభు తో పాటు ఆతికొద్ది మంది మాత్రమే మిగిలారు. కేవలం 300 మంది సైన్యం తో 5000 మందిని చంపటం చరిత్రలో అదే మొట్టమొదటి సారి ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తి వేట్లతో దేహం అంతా గాయాలతో…రక్తంతో… తడిసి ముద్ద అయ్యి ఎర్రగా మండుతున్న అగ్నిగోళంలా ఉన్న బాజీ ప్రభువును చూసి “మనీషా – రాక్షసుడా” అని భయపడ్డారు ఆదిల్షాయిలు. నిజానికి బాజీ ప్రభువు కి తగిలిన గాయాలు కత్తి పోట్లలో పావు వంతు తగిలినా ఒక మనిషి మరణిస్తాడు , కానీ అగ్ని పర్వతం నుండి లావా ఉబికినట్టు బాజీ ప్రభువుల అవయువాల నుండి రక్తం ప్రవహిస్తున్నా…. అతని చేయి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది.

తనరాజు “ఛత్రపతి శివాజీ మహరాజ్” విశాల్ఘట్ కు చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్యే లేదని ఒక చేతితో మృత్యువుని ఆపుతూ….. మరో చేతితో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశ్పాండే. చావుని పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభువు చెవులు యుద్ధం మొదలైన నాలుగు గంటల తరువాత ఫిరంగి పేలుడు శబ్దాలు విన్నాయి.

“నా రాజుని కాపాడుకున్నాను అనే చిరునవ్వు పెదవుల పైకి వచ్చేలోపు దేశ ప్రజలను రక్షించాను అనే గర్వం కళ్ళలోకి చేరే లోపు అతని చెయ్యి కత్తిని వదిలేసింది”.

కాళ్లు నేలకు ఒరిగాయి. కళ్ళు ఆకాశాన్ని చూస్తూ…. ప్రాణం శరీరాన్ని వదిలింది. చరిత్ర “కనీ వినీ” ఎరగని యుద్ధం చేసి, కేవలం 300 మందితో 8000 మందిని అడ్డుకొని మృత్యువునే వాయిదా వేసిన బాజీ ప్రభువు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళి అర్పించి “గోడ్కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్” అంటే పవిత్రమైమ ప్రదేశం అని ప్రకటించాడు. ఆ తరువాత బాజీ ప్రభువుల పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ…..!!

ఈ రోజు ఈ దేశం లో హిందుత్వం ఇంకా బతికి ఉంది అంటే కారణం ఇటువంటి మహా వీరులు మనకోసం తమ ప్రాణాలను అర్పించటమే ….

జై భవానీ…!
జై శివాజీ…!
జై హింద్…!!

✍🏻🚩 *సర్వే జనాః సుఖినోభవంతు* 🚩

08/02/2025
26/09/2024

పత్రికా ప్రకటన:

ఇది హిందువుల అంతర్గత వ్యవహారం

వ్యక్తులను... అన్య మతాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడవద్దు
• జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ
• ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు
• తుని, కోనసీమ ఘటనలతో కులాల చిచ్చు రగిలించాలని చూసిన వైసీపీ ఇప్పుడు మతం మంటలు రేపాలని చూస్తోంది
• పోలీసులు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తిరుమల మహా ప్రసాదం లడ్డూ తయారీలో జంతు అవశేషాలు కలిపిన నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడానికి కారకులు, అలాంటి నెయ్యి సరఫరాకు అనుమతులు మంజూరు చేసిన టీటీడీ బోర్డు సభ్యులు బాధ్యత వహించాలి. నాటి టీటీడీ బోర్డులను నియమించినవాళ్ళూ బాధ్యులే. హిందువులు పరమ పవిత్రంగా భావించే లడ్డూలో కల్తీపై వారే సమాధానం చెప్పాలి. తిరుమల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్న నాటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ విషయంలో ఆయన మతాన్ని, ఆయన పర్యటనను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాల్సిన సమయం కాదిది. వ్యక్తులను, అన్య మతాలను లక్ష్యంగా చేసుకోవద్దు.
ఇక్కడ తిరుమల ప్రసాదం అపవిత్రం కావడం, ఆలయ ఆచారాలకు భంగం వాటిల్లేలా టీటీడీ పాలక మండలి నిర్ణయాలు తీసుకోవడం అనేది హిందువుల అంతర్గత వ్యవహారం. హిందూ ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకొన్నవారే అందుకు విరుద్ధంగా వెళ్లినందున వారిని ప్రశ్నించాలి. తిరుమలలో ధర్మాన్ని కాపాడతామని బాధ్యత తీసుకున్నది శ్రీ వైవీ సుబ్బారెడ్డి, ఆ తరువాత శ్రీ కరుణాకర రెడ్డి. ఆ సమయంలో అక్కడ ఉన్నతాధికారిగా ఉన్నది శ్రీ ధర్మారెడ్డి. తొలుత ఈ ముగ్గురూ తిరుమల లడ్డూ అపవిత్రతకు గురైన అంశంపై సమాధానం చెప్పాలి. శిక్షలు ఎవరికి, ఎలా పడాలి అనేది విచారణలో తేలుతుంది. ఆపై శిక్షలు అనేవి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి చూసుకుంటాడు.
• వైసీపీ కోరుకొంటున్న గొడవలు ఇవ్వవద్దు
తిరుమల యాత్రకు వెళ్తున్న శ్రీ జగన్ నుంచి డిక్లరేషన్ తీసుకోవడం అనేది టీటీడీ అధికారుల బాధ్యత. ఈ విషయంపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. డిక్లరేషన్ ఇస్తారా లేదా... ఆలయ సంప్రదాయాలు, మర్యాదలు, నిబంధనలు పాటిస్తారా లేదా అనేది వెళ్ళే వ్యక్తి విచక్షణకు వదిలేయాలి. అధికారులూ బాధ్యత గుర్తెరగాలి. ఈ విషయంలో సదరు వ్యక్తుల తరఫువాళ్ళు కోరుకొనేది గొడవలే.
ఎందుకంటే వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా తుని ఘటన, అధికారంలోకి వచ్చాక కోనసీమ ఘటన సృష్టించింది. కులాల మధ్య చిచ్చు రేపి ప్రయోజనం పొందాలని చూసింది. ఇప్పుడు మతాల మంట రేపాలని చూస్తోంది. తుని, కోనసీమ ఘటనల్లో ప్రజలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. ఈ తరుణంలోనూ వైసీపీ కుత్సిత పన్నాగాల విషయంలో అంతే అప్రమత్తంగా ఉండాలని కోరుకొంటున్నాను. వాళ్ళు కోరుకొంటున్న గొడవలు మనం ఇవ్వవద్దు. మతాల మధ్య గొడవలు సృష్టించాలనే ఆలోచనల్లో ఉన్న వైసీపీ వ్యవహార శైలిపట్ల - పోలీసు శాఖ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

25/09/2024

🚩సనాతన్ ధర్మ బోర్డు 🚩భారత్.
ఏర్పాటు కై అందరు
షేర్ చెయ్యండి .
🔱ప్రపంచ హిందూ(ధర్మ)వుల రక్షణకై బోర్డు తప్పనిసరి.🔱

Address

Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when Common Man Media Tv posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Common Man Media Tv:

Share