11/07/2025
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శ్రీశైలం సొరంగం కుప్పకూలి 8 మంది కార్మికులు చనిపోయి ఆరుగురి శవాలు అందులోనే వదిలేసి చేతులెత్తేసినా
నో డిస్కషన్
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 52 మంది మరణించినా
నోడిస్కషన్
కల్తీకల్లు తాగి 8 మంది మరణించినా
నో డిస్కషన్
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఏడాదిన్నరగా నిలిపేసినా, అప్పటికే పూర్తయిన టెండర్లను రద్దు చేసి ప్రాజెక్టు నిర్మాణం మీద అదనపు భారం మోపినా, వట్టెం పంప్ హౌస్ నీట మునిగినా
నో డిస్కషన్
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయి నష్టం జరిగినా
నో డిస్కషన్
కాళేశ్వరం మరమ్మతులు చేయకుండా కేసీఆర్ మీద నిందలు మోపుతూ రైతుల పొలాలను ఎండబెడుతున్నా
నో డిస్కషన్
రూ.2 లక్షల రుణమాఫీ అని ఆశపెట్టి రూ.49 వేల కోట్ల రుణమాఫీని రూ.21 వేల కోట్లకు పరిమితం చేసి అయిపోయిందని అధికార మదంతో హూంకరించినా
నో డిస్కషన్
రూ.15 వేల రైతుభరోసా అని చెప్పి రూ.12 వేలకు కుదించి నాలుగు సార్లు ఎగ్గొట్టి ఒక్కసారి కూడా సంపూర్ణంగా రైతులకు ఇవ్వకున్నా
నో డిస్కషన్
కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అని చెప్పి మోసం చేసినా
నో డిస్కషన్
అడబిడ్డలకు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక దాని ఊసెత్తకున్నా
నో డిస్కషన్
ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి, జాబ్ క్యాలెండర్, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు అని చెప్పి నిండా ముంచినా
నో డిస్కషన్
లగచర్ల, దిలావర్ పూర్ , పెద్ద ధన్వాడ, ఫార్మా రైతులపై సర్కారు నిర్బంధం మీద
నో డిస్కషన్
హెచ్సీయూ భూముల విధ్వంసం మీద
నో డిస్కషన్
ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిలదీస్తున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నా
నో డిస్కషన్
మరి ఈ తెలంగాణ వ్యతిరేక మీడియా ఏం చేస్తుంది అంటే
కాళేశ్వరం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ మీద చేస్తున్న అక్రమ ఆరోపణల మీద మీడియా సంస్థలుగా నిజానిజాలు వెలికి తీయకుండా ఆరోపణల మీద కట్టుకథలు అల్లే డిస్కషన్ చేస్తుంది
కేటీఆర్ మీద కక్ష కట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన కేసుల మీద వాస్తవాలను గాలికి వదిలేసి నిందారోపణల మీద తప్పుడు చర్చలు చేస్తుంది
తెలంగాణ హక్కులు అన్యాక్రాంతం అవుతుంటే వాస్తవాలను వదిలేసి అబద్దాల మీద చర్చ చేస్తుంది
మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు, నేతలు, తెలంగాణ వ్యతిరేకులు, కేసీఆర్ వ్యతిరేకులు దున్నపోతు ఈనిందని చెబితే .. ఈ మీడియా దూడను కట్టేస్తున్నాం అని హంగామా చేస్తున్నాయి
తెలంగాణ సమాజం మరోసారి జాగృతమై తెలంగాణను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది
జై తెలంగాణ