
31/07/2025
8వ తరగతి చదువుతున్న కూతురిని 40 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసిన తల్లి
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో ఘటన
చేవెళ్ల మండలం కందివాడకు చెందిన శ్రీనివాస్ గౌడ్(40)కి, 8వ తరగతి చదువుతున్న తన కూతురు(13)ని ఇచ్చి స్థానిక ఆలయంలో పెళ్లి చేసిన తల్లి స్రవంతి
అత్తారింటికి వెళ్ళమని తల్లి బలవంతం పెట్టడంతో, స్కూల్ ప్రిన్సిపాల్‌కు జరిగిన విషయాన్ని చెప్పిన బాలిక
ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగి తల్లి స్రవంతి, పెళ్లి కొడుకు శ్రీనివాస్ గౌడ్, పెళ్లి జరిపించిన పురోహితుడు, సంబంధం చుసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాలికను ఐసీడీఎస్ అధికారుల సహకారంతో సఖి సెంటర్‌కు తరలింపు