06/04/2025
"బిజెపి ప్రస్థానం టు ప్రభంజనం...
1980 నుండి 2025 వరకు అద్భుత ఘట్టాలెన్నో....
నయా భారత్ అభినవ నరేంద్ర మోడీ ఉన్న భారత్.....
1980 ఏప్రిల్ 6న ప్రారంభమైన బీజేపీ, పలు ఉద్యమాలు, విప్లవాత్మక మార్పులతో 2025 నాటికి భారత్ లోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా మారింది.
" 1980 నుండి 2025 వరకు ప్రజల విశ్వాసంతో, దేశాభివృద్ధి దిశగా మార్పులకు పునాది వేసిన అతిపెద్ద రాజకీయ పార్టీ గా భారతీయ జనతా పార్టీని పేర్కొనవచ్చు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 1980 ఏప్రిల్ 6న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషితో ఏర్పడింది. దేశభక్తి, సంస్కృతి, మరియు జాతీయత స్ఫూర్తితో బీజేపీ ఆవిర్భవించింది. మొదట్లో 1984 ఎన్నికల్లో రెండు సీట్లు గెలిచినప్పటికీ, పార్టీకి ప్రజల్లో మద్దతు పెరిగింది. బాజపా నాయకులు చేసిన అహర్నిశ శ్రమ, వివిధ ఉద్యమాలు (రామజన్మభూమి ఉద్యమం వంటివి), మరియు పటిష్టమైన నాయకత్వం కారణంగా పార్టీ బలపడింది.
1998లో వాజపేయి గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీకి చారిత్రక విజయం లభించింది. అప్పటినుంచి బీజేపీ దేశాభివృద్ధి, ప్రజాసేవ, పారదర్శక పాలనకు పెద్దపీట వేసింది. మోడీ గారి "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్" మరియు " సబ్ కా విశ్వాస్ సబ్ కా ప్రయాస్" నినాదాలు దేశాన్ని కొత్త దిశలో నడిపించాయి.
2025 నాటికి బీజేపీ అత్యధిక మెంబర్షిప్ తో దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మారింది. ఇది కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, ఇది దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిన ఓ విశేష చరిత్రగా పేర్కొనవచ్చు.
1990 దశకంలో ఆర్థిక మాంద్యం, అవినీతి, పాలనా వైఫల్యాల సమయంలో బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది.1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత రామజన్మభూమి ఉద్యమం పార్టీని ప్రజల మద్దతు దిశగా మలిచింది. వాజపేయి , ఎల్ కే అద్వానీ నేతృత్వంలో బీజేపీ దేశ అభివృద్ధి, శాంతి-ప్రగతికి మార్గదర్శిగా నిలిచింది.
2014 – నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తిరుగులేని శక్తిగా దేశంలో పాలనకు కొత్త ప్రమాణాలు స్థాపించింది. జాతీయ భద్రత, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, యంగ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా,ఆత్మనిర్భర్ భారత్, కాశ్మీర్ నుండి 370 అధికరణ రద్దు, ఉజ్వలా, స్వచ్ఛ భారత్, జన ధన్ యోజన, ట్రిపుల్ తలాఖ్, మహిళా రిజ్వేషన్ల 33 శాతం కేటాయింపులు, కామన్ సివిల్ కోడ్, పౌరసత్వ సవరణ చట్టం, NRC, మరియు ఇటీవల వక్ఫ్ బోర్డు బిల్ వంటి ఎన్నో సంస్కరణల ద్వారా దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదించింది.
బీజేపీ నేడు 2025 నాటికి దేశంలోని అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది. 18 కోట్లకు పైగా సభ్యత్వం, 400కి పైగా పార్లమెంటరీ సీట్లు, రాష్ట్రాల పాలనలో ప్రముఖ పాత్ర... ఇవన్నీ పార్టీ నమ్మకాన్ని, ప్రజల్లోకి ఉన్న వ్యాప్తిని ప్రతిబింబిస్తున్నాయి.
వికసిత భారత్ @2047 – లక్ష్యానికి దారితీసే శక్తి
వికసిత భారత్ లక్ష్యంతో బీజేపీ యువత, రైతులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో బీజేపీ మంచి పాలనకు ప్రతీకగా మారింది.
భారతీయ జనతా పార్టీ యొక్క 45 సంవత్సరాల ఈ ప్రస్థానం ఒక పార్టీ వికాసం మాత్రమే కాదు – అది ఒక దేశ సంస్కృతి, అభివృద్ధి, సామాజిక సమగ్రతకు మార్గదర్శకం. 1980లో నాటిన విత్తనం నేడు మహా వృక్షంగా మారి, దేశ ప్రజల ఆశలకి అండగా నిలిచింది.
కొట్టె మల్లికార్జున పూర్వ సివిల్స్ విద్యార్థి & బిజెపి యువ నాయకులు