23/09/2025
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు బత్తుల ప్రభాకర్ వయసు సుమారు 35 సంవత్సరాలు. ఈ వ్యక్తిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుండి వాయిదా నిమిత్తం విజయవాడ తీసుకుని వెళ్లి, మరలా తిరిగి రాజమహేంద్రవరం తీసుకువచ్చే క్రమంలో సోమవారం రాత్రి 7:30 గంటల సమయంలో దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయాడు. ముద్దాయి పోలీసుల వద్ద నుండి తప్పించుకుని పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్ ఉన్నాయి. వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడు.
ముద్దాయి ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి రూ.50,000 పారితోషకం ఇస్తామని దేవరపల్లి సీఐ నాగేశ్వర్ నాయక్ తెలిపారు. అతని వివరాలు తెలిసిన వారు 9440796584, 9440796624 నంబర్లకు తెలపాలని ఆయన కోరారు.