Way2News Nalgonda

Way2News Nalgonda Way2News Telugu

20/11/2025

Nalgonda వార్తల కోసం Download వే2న్యూస్ App
డిండి మండలం నాగారదుబ్బతండా, మాల్యాతండా గ్రామాలకు నేటికీ బస్సు సౌకర్యం లేదు. దీంతో ఈ రెండు తండాల విద్యార్థులు పాఠశాలలకు వెళ్లిరావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల నుంచి సాయంత్రం తిరిగి ఇళ్లకు వెళ్లే సమయంలో విద్యార్థులు చీకటిలో నడిచి వెళ్లాల్సి వస్తోంది. తవక్లాపూర్ వరకే బస్సు సౌకర్యం ఉందని, అక్కడి నుంచి తమ గ్రామానికి చేరుకోవాలంటే రాత్రి వేళల్లో ఇబ్బంది అవుతుందని వారు వాపోతున్నారు.

20/11/2025

Nalgonda వార్తల కోసం Download వే2న్యూస్ App
కనగల్ మండలం ఖురంపల్లి- గడ్డం వారి ఏడవల్లి గ్రామాల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. రహదారిపై ధాన్యం ఆరబెట్టి ఉండగా ద్విచక్ర వాహనదారుడు వేగంగా వచ్చి రాళ్లు తగిలి అదుపు తప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

19/11/2025

Nalgonda వార్తల కోసం Download వే2న్యూస్ App
నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి వై.అశోక్ రెడ్డి, ఐసీడీఎస్ జిల్లా సంక్షేమ అధికారి కేవీ.కృష్ణవేణి హాజరై వయోవృద్ధులను సన్మానించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.

18/11/2025

Nalgonda వార్తల కోసం Download వే2న్యూస్ App
తిప్పర్తి మండలంలోని మామిడాల నుంచి ఆరెగూడెం వెళ్లే రోడ్డు పూర్తిగా అధ్వానంగా మారిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సరిగా లేకపోవడం వల్ల ఇటీవల 2 వడ్ల ట్రాక్టర్లు పల్టీ పడ్డాయని, వడ్లు నేలపాలై రైతులు నష్టపోయారని స్థానికుడు కొండేటి మురళి తెలిపారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డుకు మరమ్మతులు చేసి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

18/11/2025

Nalgonda వార్తల కోసం Download వే2న్యూస్ App
కమలానెహ్రూ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజక్షన్ వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థులు చికిత్స అనంతరం ఇళ్లకు చేరుకున్నారు. వైరల్ ఫీవర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇచ్చిన యాంటీబయోటిక్ ఇంజక్షన్ దీనికి కారణమని భావిస్తున్నారు. ఆదివారం 10 మంది, సోమవారం మరో ఏడుగురు చిన్నారులను డిశ్చార్జి చేసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ భానుప్రసాద్ నాయక్ తెలిపారు. మిగిలిన విద్యార్థులు కోలుకుంటున్నారు.

18/11/2025

Nalgonda వార్తల కోసం Download వే2న్యూస్ App
ఆడపిల్లల అక్రమ దత్తత, బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ పరీక్షలు వంటి ఘటనలను నివారించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. 'సేవ్ ద చైల్డ్' ప్రణాళికపై ఆమె అధికారులతో సమీక్షించారు. గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ (VCPC) సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలని, టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై, హాస్టళ్లు, పాఠశాలల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

Collector Ila Tripathi said that incidents like illegal adoption of girls, child marriages, and gender determination tests should be prevented. She reviewed the Save the Child plan with her officials. She ordered that Village Child Protection Committee (VCPC) meetings should be held mandatory and a toll-free number should be set up. SP Sharat Chandra Pawar was present and suggested that awareness should be created in hostels and schools.

14/11/2025

Prakasam వార్తల కోసం Download వే2న్యూస్ App
పెద్దారవీడు ఎమ్మార్వో దిలీప్ కుమార్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో డిప్యూటీ కలెక్టర్ కళావతి విస్తృతంగా రికార్డులను తనిఖీ చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణకు తోకపల్లి బాధితులు వారి సమస్యను తెలియజేశారు. ఎమ్మార్వో దిలీప్ కుమార్ తమ భూములను ఇతరులకు కట్టబెట్టారని విన్నవించారు. రికార్డులు పరిశీలించి తప్పకుండా తగిన న్యాయం చేస్తామని జేసీ బాధితులకు హామీ ఇచ్చారు.

Several allegations were made against Peddaravidu MRO Dilip Kumar. With this, Deputy Collector Kalavathi extensively checked the records. At the same time, the Thokapalli victims informed the District Joint Collector Gopalakrishna, who came there, about their problem. They requested that MRO Dilip Kumar had tied up their lands with others. JC assured the victims that he would examine the records and definitely provide due justice.

Address

WAY2NEWS PRIVATE LIMITED
Hyderabad
500033

Website

Alerts

Be the first to know and let us send you an email when Way2News Nalgonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share