27/04/2025
#పల్లెటూరిపిల్ల కి 75 సంవత్సరాలు...
#విశ్వవిఖ్యాత_నటసార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ #నందమూరితారకరామారావు గారు తొలిసారి తెలుగు తెరపై హీరోగా నటించిన #పల్లెటూరిపిల్ల సినిమా శోభనాచల ప్రొడక్షన్స్ వారు నిర్మాతలుగా 27-4-1950 విడుదల అయింది.
దర్శక, నిర్మాత బి. ఏ. సుబ్బారావు గారు స్వీయ దర్శకత్వంలో ఎన్.టి.రామారావు గారిని హీరోగా శోభనాచల పిక్చర్స్, బి.ఏ. సుబ్బారావు జాయింట్ ప్రొడక్షన్స్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిిిన మొట్టమొదటి చిత్రం #పల్లెటూరిపిల్ల.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, యస్.వి. రంగారావు, ఏ.వి.సుబ్బారావు, నల్ల రామమూర్తి, బాలసరస్వతి, టి.వి.రాజు, లక్ష్మీకాంతం, హేమలత, తాపీ చాణక్య, టి.వి.రాజు, కృష్ణయ్య తదితరులు నటించారు.
మొదటి సినిమా షూటింగ్ సమయంలోనే ఎద్దుతో ఫైట్ చిత్రీకరించే సమయంలో #ఎన్టీఆర్ గారు డూప్ లేకుండా నటించారు. షూటింగ్ లో ఎద్దు తన కొమ్ములతో ఎన్టీఆర్ ను విసరడంతో కుడి చేతి ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. కాగా చేతికి గాయమైనప్పటికి #ఎన్టీఆర్ మరుసటి రోజు షూటింగ్ కు హాజరై యధావిధిగా షూటింగ్ లో పాల్గొన్నారు.
#ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన తొలి చిత్రమే ఘన విజయం సాధించడంతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక మంచి హీరో లభినట్లు అప్పడు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.
#మనదేశం సినిమా ద్వారా #ఎన్టీఆర్ గారిని తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన శోభనాచల స్టూడియోస్ వెంటనే తదుపరి సినిమాలోనే #ఎన్టీఆర్ గారిని హీరోగా పరిచయం చేయటం విశేషం.
#శ్రీ_విశ్వవిఖ్యాత_నటసార్వభౌమ_ఆర్ట్స్
#నందమూరితారకరామారావు
#పెళ్లెటూరిపిల్ల
#అక్కినేని_నాగేశ్వరావు