MayukhaTalkies

MayukhaTalkies Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MayukhaTalkies, Film/Television studio, Street No. 1, Engineers Colony, Padala Ramareddy Colony, Yousufguda, Hyderabad.

🙏🙏🙏🙏🙏అంతర్జాతీయ కార్మికదినోత్సవ శుభాకాంక్షలు🌹🌹🌹🌹🌹🌹🌹ఎవరి బ్రతుకు పోరాటం వాళ్ళది...ఎవరి జీవన ఆరాటంవాళ్లది...తమ తమ దైనందినయ...
01/05/2026

🙏🙏🙏🙏🙏
అంతర్జాతీయ కార్మిక
దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹🌹🌹
ఎవరి బ్రతుకు పోరాటం వాళ్ళది...
ఎవరి జీవన ఆరాటం
వాళ్లది...
తమ తమ దైనందిన
యుద్ధాలు.
రాద్ధాంతాలు...
సిద్ధాంతాలు...
వారి , వారి
వాగ్యుద్దాల జోరులకి
బాహా బాహీ పోరులకి
కూడా....
తిండి , గూడు, నీడ
గమనం కావాలి...
మంచికి, చెడుకీ
అన్నింటికీ....అన్నీ కావాలి.
ఆ "అన్నీ" అందించే
నిశ్శబ్ద సైనికులు,
నిత్య చైతన్యాలు.
కర్పూరంలా కాలి కూలిపోయే..
కార్మికులు...కర్షకులు
ఉన్నాడో, లేడో తెలియని
దేవుళ్ళకు మల్లే..
మనమధ్యే ఉండీ, కనిపించని దేవుళ్ళు
గనుల్లో...వనుల్లో..కార్ఖానాల్లో....మూర్తీభవించివున్నారు... దర్శిద్దాం. 🙏
🙏🙏🙏🙏
అనునిత్యం కరిగిపోతూ
అరిగిపోతూ...ఒరిగిపోతూ
తమ బిడ్డల కోసమే బ్రతికే
వేతనం లేని
" అమ్మలూ...నాన్నలూ
కూడా కార్మికులే..."
అక్కున చేర్చుకోండి ..
🙏🙏🙏🙏ఉత్తేజ్

29/04/2026

Venu Yeldandi about Mayukha Talikes Film Acting School & Uttej garu 🎬
A place where passion meets acting and dreams begin. ✨

https://youtu.be/Re3OtMGVpR0

MAYUKHA TALKIES FILM ACTING SCHOOL PRESENTS🎬 Summer Camp for Children – Film Acting Workshop (45 Days) 🎭✨ “Big dreams st...
26/04/2026

MAYUKHA TALKIES FILM ACTING SCHOOL PRESENTS

🎬 Summer Camp for Children – Film Acting Workshop (45 Days) 🎭

✨ “Big dreams start small—right here.” ⭐

Dates: April 27th – June 13th
👧🧒 Age Group: 6 to 15 years

🎥 Focus Areas:
• Acting basics & storytelling
• Expression, imagination & body movement
• Voice and dialogue delivery
• Improvisation & creativity
• Confidence building through performance

✨ A perfect platform for young talents to explore storytelling, build confidence, and experience the joy of film acting.

📞 Contact:
+91 8926739739
+91 99121 85072

⚠️ Limited Seats Available – Register Now!

Let this summer be the beginning of your child’s artistic journey.

— Mayukha Talkies Film Acting School

🙏🙏🙏తాతయ్య సుద్దాల హన్మంతు...( కవి)నాన్న శ్రీరాములు ( కవి )మామయ్య సుద్దాలఅశోక్ తేజ ( కవి )ఈ కవిత్రయం ఒడిలోబడిలో పెరిగిన అ...
22/04/2026

🙏🙏🙏
తాతయ్య సుద్దాల హన్మంతు...( కవి)
నాన్న శ్రీరాములు ( కవి )
మామయ్య సుద్దాల
అశోక్ తేజ ( కవి )
ఈ కవిత్రయం ఒడిలో
బడిలో పెరిగిన అదృష్టవంతుణ్ణి....
నాన్న, తాతయ్యల
కవిత్వం నన్ను
జ్ఞానించింది..
విజ్ఞానించింది....
మామయ్య కవిత్వం
సాహిత్యానికి సన్నిహితుణ్ణి
చేసింది..రసానంద డోలికల్లో లాలించింది..
ఆడించింది..
" మామయ్య చేవ్రాలు
మా అమ్మ చనుబాలు"
అంతిష్ఠమ్..........నాకు.
నా చిన్నప్పటి నుండి
మామయ్య అక్షరాల్ని
విడవకుండా బ్రతికాను...
మా పద్మతో ప్రేమలో ఉన్నప్పుడు, నాన్న తాతయ్యల..కవిత్వo తో
పాటు ..మామయ్య కవిత్వాన్ని పాటల్ని వినిపించే వాణ్ణి... పూర్తిగా పడిపోయింది పద్దు నాప్రేమలో......
మా పెళ్లికి ఏదో కారణం వల్ల అశోక్ మామయ్య రాలేదు...మండపం లోనే ఏడ్చేశా....అప్పుడు
చూసిందిపద్దు.....
మామయ్య పట్ల నాఇష్టాన్ని ..అర్థం చేసుకుంది...
పెళ్లయిన యాడాదికే
అశోక్ బాబాయిని పిలిపించుకుందాం అంది..
ఏ బ్రహ్మముహూర్తంలో
అన్నదో.. ఏ పుణ్య ఘడియల్లో అన్నదో...
ప్రజాకవిమామయ్యని
మాఇంటికి పిలిపించుకున్నాం...
నా చిన్నప్పుడు తన వేలు పట్టుకునడిచా..
మామయ్య hyd వచ్చాక
తన పెన్ను పట్టుకుని
సినీ పరిశ్రమ వేపుకు
నడిచే అదృష్టం దక్కింది నాకు...
🙏
ప్రజాకవిగా వేన వేల పాటలతో ....జన జీవన స్రవంతిలో ..
శిఖరాయమానంగా
తన పాటల జెండా ఎగురుతోంది
అప్పటికే.........
మామయ్యకి నేను
పెద్ద FAN ని కదా...
అటు ప్రజాగీతాల వేపుకు
ఎగురుతున్న జెండాకెదురుగా నిల్చున్న.
ఈ FAN గాలికి 😊
ప్రజా గీతాల జెండా
చలనచిత్ర గీతాల వేపుకు
రెప రెప లాడుతూ తిరిగింది....
పై పైకి ఎగిరింది...గెలిచింది..
అజేయంగా..సుస్థిరంగా
తనవైన వాక్య విలువలతో.....
తనదైన అక్షర సంస్కారంతో........
మేడిపల్లి నుండి
ఇంద్రప్రస్థం దాకా.......
🙏
మామయ్య కలం
స్వచ్ఛమైన గంగాజలం
ఏ పాటల తోటనైనా., పండించగలదు...
పాళిoచగలదు..
పాలించగలదు...
😊
SUDDEN గా మామయ్య
గురించేంటని కదా....
మీ doubt.?.
😊🚗
మొన్న మామయ్య
తను కొన్న కొత్త కార్ తీసుకుని ఇంటికి వచ్చి,
కార్ చూద్దాం పద అన్నారు...
నేనూ, పాట .
పాటల కార్ ని చూడ్డానికి వెళ్ళాం..చాలా బావుంది..
లోపల కూర్చో నాన్న అన్నారు...కూర్చున్న..
సరిగ్గా అపుడు.......
ఓ MARKAR చేతి కిచ్చి
కార్ లో సంతకం చేయమన్నారు...
చేష్టలుడిగాయి
నిశ్చేష్టుణ్ణయ్యా..
ఒక్క క్షణం.
గుండె ఆగి కొట్టుకుంది.....సన్నని వణుకు....
తండ్రీ ..ఏంటిది...Plsss
అన్నాను..
సంతకం చేయి నాన్న
అన్నారు....మామయ్య గొంతుతో నాన్న అడిగినట్టుంది నాకు....
కళ్ళల్లో నీళ్ళు ఏమీ కనిపించడం లేదు....
అపుడుకూడా
మామయ్య పాటే గుర్తుకు వచ్చింది....
" కన్నీళ్లతో నీవు కూడా గమ్యాలని చూడలేవు.."
ఒసేయ్ రాములమ్మలో..
ఎంత practicality..
వాక్యాల్లో.....
ఏమీ తోచని స్థితిలో
ఆత్మానుగత బంధాన్ని
రక్తానుగత బంధాన్ని
కమ్మగా నెమరేసుకుంటూ...

జీవన చక్రం గిర్రున తిరుగుతుండగా....
HAPPY JOURNEY
తండ్రీ...ఉత్తేజ్ .అంటూ రాసి....ఉండలేక..కార్ దిగి
మామయ్య పాదాలపై పడిపోయాను.....
మామయ్య ఆప్యాయంగాలేవనెత్తి గుండెల్లో అలుముకున్నారు...
నేను పొదివి పట్టుకున్నాను.....
మా ఇద్దరి మధ్యన
ఎన్నో శబ్దాల నిశ్శబ్దం..
మా ఇద్దర్నీ పెనవేసుకుంటూ,
తాతయ్య, అమ్మమ్మ,
అమ్మ, నాన్న, పద్దు.....

ఇద్దరమ్ చెమ్మగిల్లిన కళ్ళతో...బరువుగా..
తేలికగా...హాయిగా ..
ఆనందంగా....మా ఇద్దరినీ అలా చూసిన మా "పాట"కళ్ళల్లో మెరుపుని
చూస్తూ..బంధాల విలువలని అనుభవిస్తున్నందుకు
సంతోషించాను..
( పిల్లలకి ఆ కమ్మదనం తెలియాలి....)
ఇదంతా వీడియో తీసిన మయూఖ రాజేష్
నిజమైన ఆప్యాయత కి
సాక్షిగా ఉన్న అదృష్టవంతుణ్ణి సార్ అంటూ...వాడు...
😊
సుమతీ పద్యం
తిరగేసి చదువుకున్న...
" జనులా పుత్రుని కనుగొని పొగడగ" కాదు....
జనులా "తండ్రిని "కనుగొని పొగడగ ...ఆనందాన్ని
పొందిన..పొందుతున్న
కొడుకుని...🙏
చాలా చాలా అదృష్టవంతుణ్ణి....
🙏🙏🙏🙏
సుద్దాల అశోక్ తేజ మామయ్య...
నా రక్తానుగత ఆస్తికన్నా
కూడా,
మన అందరి
సిరాస్తి
తెలుగాస్తి
సాహితీ స్థిరాస్తి....
🙏🙏🙏🙏

Lights. Camera. Action! 🎬✨Proudly inaugurating the 30th Batch of Mayukha Talkies Film Acting School – 2026 🌟A new journe...
13/04/2026

Lights. Camera. Action! 🎬✨
Proudly inaugurating the 30th Batch of Mayukha Talkies Film Acting School – 2026 🌟
A new journey begins for future stars! 🌈

https://youtu.be/Re3OtMGVpR0

పద్దూ....🌹🌹ఈరోజు మన పెళ్లిరోజు.ఇపుడు బాగా గుర్తుంటోంది. ..అప్పుడు, నీ పుట్టినరోజుని,మన పెళ్లిరోజుని మాత్రం రెండు నెలల ము...
08/04/2026

పద్దూ....
🌹🌹
ఈరోజు మన పెళ్లిరోజు.
ఇపుడు బాగా గుర్తుంటోంది. ..
అప్పుడు, నీ పుట్టినరోజుని,మన పెళ్లిరోజుని మాత్రం రెండు నెలల ముందునుండే గుర్తుపెట్టుకొని.. date వల్లె వేస్తూ ఉండేవాణ్ణి....ఎక్కడ మర్చిపోతానో అని....
ఇది అందరి మొగుళ్లకి
అనుభవైకవేద్యమే.......
ఎలా ఉన్నావు పద్దూ...
కడదాకా, నే కడతెరే దాకా
నా వెంటే ఉంటానన్నావు.
మార్గమధ్యంలో చెయ్యి వదిలేశావ్...పట్టు సడలి
కిందపడ్డాను...లేచి చూస్తే నువ్వు లేవు..పిలిచా..అరిచా..
ఏడ్చా.నువ్వులేవు..ఇంకా వెదుకుతూనే వున్నా..
సంతలో తప్పిపోయిన
పిల్లాడు అమ్మకోసం వెదుక్కున్నట్టు....
తప్పు చేసావు పద్దూ..
నన్ను మరీ dependent చేసావ్.. అన్నిటికీ తోడున్నావ్..అన్నింటికీ
ముందున్నావు. నేనున్నాను పదయ్య అన్నావు.నేనున్నాగా పర్లేదన్నావ్..ధైర్యం అయ్యావు..ఆలంబన అయ్యావు..ఆసరా అయ్యావు...ముందుంటావనుకున్నా..ముందుగా వెళ్తావనుకోలేదు...
అన్ని పనులు...
భోజనం...
ఆలనా పాలనా
ఓ magic లా సాక్షాత్కారమయ్యేవి....
తిట్టుకున్నా..అరుచుకున్న
నవ్వుతా..తుళ్ళుతా
ఉండేదానివి.......
నాన్న లా భుజం తట్టావు..
తిట్టావు కూడా..
అమ్మలా అక్కున చేర్చుకున్నావు..
ఫ్రెండ్ లా తోడున్నావు..

పాటమ్మ..కి నిన్ను తెచ్చివ్వలేను కానీ...
ఆ స్పర్శ ని అందివ్వలేను కానీ....నీ బాధ్యతని..నీ ప్రేమని అందించే ప్రయత్నం చేస్తున్న....
నాన్న లా 100% ఉంటాను..
దానికి నేనయినా ఉన్నాను...
నాకే..............లేరు..
Love you.. పద్దూ.
WE
MISSING YOU.........

🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹రంగస్థల రంగమార్తా౦డులందరకూసాంకేతిక నిపుణులకూరచయితలకూ.....ఎన్ని సాధక బాధకాలున్నామరెన్నో కష్ట నష్టాలున్నాపంటి బ...
27/03/2026

🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹
రంగస్థల
రంగమార్తా౦డులందరకూ
సాంకేతిక నిపుణులకూ
రచయితలకూ.....
ఎన్ని సాధక బాధకాలున్నా
మరెన్నో కష్ట నష్టాలున్నా
పంటి బిగువున
విచారాల నొక్కిపట్టి,
నమ్ముకున్న నాటకం కోసం..
సంతృప్తినిచ్చే నాటకం కోసం.....
ప్రేక్షకుల ఆనందం కోసం
నాటకాలు ప్రదర్శిస్తూ..
కరతాళధ్వనుల్లో
జయ జయ ధ్వానాల్లో అన్నీ మరిచిపోయి
మరో ప్రదర్శన కోసం
మళ్లీ సమాయత్తమయ్యే
మన..
రంగస్థల కళా ప్రియులందరకూ...
🌹🌹🌹🙏
ప్రపంచ రంగస్థల దినోత్సవ
శుభాకాంక్షలు...
జయహో రంగస్థలం..
🌹🌹🌹🌹🌹

శ్రీరామనవమి శుభాకాంక్షలు🌹🌹తండ్రి మాటే వేదవాక్కుగా బాధ్యతగా నడుచుకున్నది  రామతత్వం..🙏భర్త కోసం ..కష్టాన్ని సైతం ఇష్టంగా అ...
27/03/2026

శ్రీరామనవమి శుభాకాంక్షలు🌹🌹
తండ్రి మాటే వేదవాక్కుగా బాధ్యతగా నడుచుకున్నది రామతత్వం..🙏
భర్త కోసం ..కష్టాన్ని సైతం ఇష్టంగా అనుసరించినది సీత తత్వం🙏
కుటుంబ బాధ్యతగా
అన్నని కాపాడుకోవటమే
జీవితమన్నది
లక్ష్మణతత్వం.🙏
నమ్మినవారికోసం
మనసా వాచా కర్మణా
భక్తిగా..ప్రేమగా ప్రాణాలకు సైతం తెగించమన్నది ఆంజనేయతత్వం🙏
🙏🙏😊😊🙏🙏😊😊
మనిషి తోటిమనిషిని కాపాడుకుంటూ
కలిసిమెలిసి ఉండాలన్నది మానవతత్వం......
🌹🌹🌹🌹🌹🌹
శ్రీరామనవమి శుభాకాంక్షలు..
🌹🌹🌹🌹🌹🙏ఉత్తేజ్

Hii friends....😊😊సినిమా.... ప్రపంచంసృజనాత్మక కళారంగం.అందరం...25 క్రాఫ్ట్స్ఒకరినొకరం అర్థం చేసుకోవాలి.....దర్శకుడి ఆలోచనన...
25/03/2026

Hii friends....😊😊
సినిమా.... ప్రపంచం
సృజనాత్మక కళారంగం.
అందరం...25 క్రాఫ్ట్స్
ఒకరినొకరం అర్థం చేసుకోవాలి.....
దర్శకుడి ఆలోచనని
అద్భుతమైన దృశ్యంగా
మలచడానికి...
మేధో మథనాలు
శారీరక సాహసాలు
అహర్నిశలు జరుగుతూ ఉండాలి....
Technicians... Actors
కలిమిడిగా...స్నేహంగా
వేగంగా...సృజనాత్మకంగావుండాలి...వుండితీరాలి.
షూటింగ్ జరిగినన్నాళ్ళూ
అందరం అందరితో బావుంటాం...బావుండాలి.
లేదంటే సీన్స్ రక్తికట్టవు.
అందరం..అన్ని
షూటింగ్స్ లో కలవకపోయినా...తప్పనిసరిగా ఏదో ఒకరోజు ఏదోఒక షూటింగ్ లో కలుస్తాం...
కొన్ని సార్లు...కొంతమందికి సినిమాలు లేకనో , రాకనో ...పరిశ్రమ కి
కూసింత దూరంగా ఉన్నట్టయితే..
సహజంగా..తాత్కాలికంగా
మరిచిపోవడం,అననుగాని,....టచ్ లో
లేకపోవడమో... కమ్యూనికేషన్ గ్యాప్ రావడమో కద్దు......
అయితే అతి తక్కువ నిష్పత్తిలో మాత్రం..కొందరు కొందరితో చాలా దగ్గరగా స్నేహంగా ఉంటూ ఉంటారు..... అదిగో
అలాంటి స్నేహమే...
మాదీనూ.......
శివాజీ అన్నయ్య..
అలీ అన్నయ్య.. నాకు సీనియర్స్..అయినా తమ్ముడిలా నన్ను..
ఏరా ఉత్తి అంటూ శివన్న
రేయ్ ఉత్తేజ్ అంటూ అలీ
భాయ్....పలకరిస్తూ ..
పరామర్శిస్తూ ఉంటారు...
ఇలా నాకు ఇండస్ట్రీలో
చాలా మంది డార్లింగ్స్.. డియర్లు..అన్నయ్యలు...
తమ్ముళ్లు..రేయ్ లు..ఒరేయ్ లు..
"దేవుడన్నయ్య"లు..ఉన్నారు..
నా అదృష్టం ఇది...
స్నేహం మనకందిన గొప్ప వరం అంటాడు "చలం"
అలా స్నేహాన్ని కాపాడుకుంటూ...
స్నేహాన్ని పాడుకుంటూ
ముందుకెల్తూ ఉన్న....
మొన్న ఒక సినిమా షూటింగ్ లో
ముగ్గురం...కలిసాం...
ముళ్ళపూడి వెంకటరమణ గారి మాటలా చెప్పాలీ అంటే...
" ముక్కోతి కొమ్మచ్చి"
లా...కలిసాం...నవ్వుల్లో విరిసాం....

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🙏
19/03/2026

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు🙏

17/03/2026

Krishna Vamsi About Uttej & the journey of Mayukha Talkies Film Acting School.

Address

Street No. 1, Engineers Colony, Padala Ramareddy Colony, Yousufguda
Hyderabad
500073

Website

Alerts

Be the first to know and let us send you an email when MayukhaTalkies posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share