26/10/2025
ఒకరోజు నేను హైదరాబాద్ కి వెళ్లాల్సి వచ్చి 🚌 స్లీపర్ ఏసీ బస్ బుక్ చేశాను. రాయచోటి లో బస్సు ఎక్కాను. రాయచోటి - కడప మధ్యలో 🏞️ గువ్వల చెరువు ఘాట్ ఉంటుంది. ఈ ఘాట్ లో నేను ఎక్కిన బస్ మా ఎదురుగా వెళ్తున్న 🚗 ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కార్ ని గుద్దింది. కార్ వెనుక అద్దం పగిలిపోయింది 🪞💥. వెనుక భాగం లోపలికి నొక్కుకుపోయింది. లోపల ఒక 👩❤️👨 ఎంగ్ కపుల్, వారి 👶 పాప (నెలల వయసు) & ఒక 👵 పెద్దావిడ ఉన్నారు. అదృష్టం బావుండి 🙏 అందరూ సేఫ్‌గా ఉన్నారు.
ఇది పూర్తిగా బస్ డ్రైవర్ తప్పు అని తెలిసి, వెంటనే నేను నా సీట్ వద్ద నుంచి వచ్చి డ్రైవర్‌ని అరిస్తూ 😡 బస్ ఆపాను. కార్ వారి తరపున మాట్లాడి డ్రైవర్‌ని చెడా మడా తిట్టి, బస్ ఆఫీస్ కి ☎️ ఫోన్ చేశాను. ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. ఇది మామూలు విషయమే అన్నట్టు వ్యవహారించారు. డ్రైవర్ ఒకవైపు “నాదేం తప్పు లేదు, బ్రేక్స్ సరిగ్గా పడట్లేదు” అన్నాడు.
“బ్రేక్స్ సరిగ్గా పడని బస్సుని ఎందుకు తెచ్చావు రా లుచ్చా!” 😤 అని తిట్టాను. అలా తిట్టినందుకు నా పై చెడా మడా అరిచాడు.
ఒక్క పాసెంజర్ కూడా 😶 నోరెత్తి డ్రైవర్ నిర్లక్ష్యం పై మాట్లాడలేదు.
“మీ సంగతి చెప్తా ఉండండి” అని ప్రభుత్వ వ్యవస్థపై నమ్మకంతో దగ్గరలో ఉన్న 👮♂️ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాను. బస్సును నేరుగా స్టేషన్ కి తీసుకువెళ్ళాను.
అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నారు. 📞 పై అధికారులతో మాట్లాడి “ఆ కార్ ఓనర్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి” అని చెప్పాడు.
కనీసం ఆ బస్ డ్రైవర్ స్టేట్మెంట్ గానీ, పాసెంజర్ స్టేట్మెంట్ గానీ రికార్డ్ చేయలేదు.
CI తో మాట్లాడాను. “మా వాళ్ళు చూసుకుంటారు సర్” 🙄 అని భరోసాగా మాట్లాడాడు.
ఒకవైపు నాకు ఆ డ్రైవర్ డ్రైవింగ్ & బస్ కండిషన్ పై 😟 నమ్మకం లేదు.
స్టేషన్ వాళ్ళు దీన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారు అనిపించలేదు.
దీన్ని ఒక ఇష్యూ చేయాలనీ వెంటనే SP కి కాల్ చేయబోయా. కానీ బస్ లో ఉన్న పాసెంజర్స్ చాలా మంది
“ఇప్పుడు ఏమయ్యింది? ఎందుకు ఇక్కడ అనవసరంగా హడావిడి చేస్తున్నారు? మాకు లేట్ అవుతోంది, పదండీ” 🙄 అన్నారు.
ఆ కార్ లో ఉన్న వ్యక్తుల తరపున గానీ నాకు గానీ ఏ పాసెంజర్ సపోర్ట్ గా మాట్లాడకపోగా 😔 బస్ వాడిని వెనకేసుకు వచ్చారు.
అంతలో కానిస్టేబుల్ వచ్చి “బస్ ఓనర్ తో మాట్లాడి కార్ రిపేర్ ఖర్చులు భరిస్తారని చెప్పారు” అని అన్నాడు.
ఇక చేసేదేమీ లేక ఆ కార్ యజమానికి పోలీసులు, కోర్టులు అన్న భయం 😞 ఉండడంతో రాజీకి వచ్చి వెళ్ళిపోయాడు.
(తర్వాత వారం రోజులకు ఆ కార్ వ్యక్తి ఫోన్ చేసి 📱 “ఆ బస్ ఓనర్ నాకు రిపేర్ ఖర్చులు కూడా ఇవ్వలేదు సర్” అని బాధ పడ్డాడు 😢.)
నేను బస్ ఆఫీస్ కి ఫోన్ చేసి, “డ్రైవర్ ని మార్చండి లేదా నన్ను వేసే బస్ ఎక్కించండి” అని అడిగాను.
వాళ్ళు ఒప్పుకోలేదు.
ఆ బస్సులో ఉన్న పాసెంజర్స్ ని జాలిగా చూసి 😔, నేను వెంటనే నా హైదరాబాద్ ప్రయాణం క్యాన్సిల్ చేసుకొని 🛑
అర్ధరాత్రి RTC బస్ పట్టుకొని ఇంటికి వెళ్లిపోయా 🏠.
ఇంటికి వెళుతూ ఒక 10 నిమిషాల్లోనే కన్స్యూమర్ ఫోరమ్ హెల్ప్ లైన్ 📲 లో ఒక కంప్లైంట్ రైస్ చేశాను.
తర్వాత 2 రోజులకు నా టికెట్ డబ్బులు రిఫండ్ అయ్యాయి. 💰
ఇదే కాదు, సీట్ బాగాలేకపోయినా, బస్ లేట్ గా వచ్చినా, ఇస్తాము అని చెప్పిన సౌకర్యాలు ఇవ్వకపోయినా, Window డోర్ రాకపోయినా, సీటు మార్చుకొని, 30 - 100% రిఫండ్స్ పొందిన సందర్భాలు బోలెడు ఉన్నాయి.
---
నేనెప్పుడైనా ఒక వస్తువు కొని దాని సర్వీసు బాగాలేకపోతే వెంటనే కన్స్యూమర్ ఫోరమ్ కి హెల్ప్ లైన్ ద్వారా కంప్లైంట్ చేస్తాను.
అలా కంప్లైంట్ చేయడం ద్వారా Flipkart, Amazon, Private Travels, Swiggy, TV, షూస్, సబ్బు, జెండూ బామ్... ఇలా చెప్పుకుంటూ పోతే
నేను వాడిన 10 రూపాయల పెరుగు ప్యాకెట్ 🥛 బాగాలేకపోతే కూడా రిఫండ్ పొందిన సందర్భాలు ఉన్నాయి 😅.
కన్స్యూమర్ ఫోరమ్ ద్వారా మనం ఎలా రిలీఫ్ పొందవచ్చో 📚 “నువ్వు నేను రాజ్యాంగం” పుస్తకంలో ఒక చాప్టర్ గా రాసాను.
---
నేను చెప్పొచ్చేది ఏంటంటే 👉
మనము సెల్ ఫోన్ లో 📱 సొల్లు రీల్స్ చూసే 5 నిమిషాల్లో మనం కొని ఉపయోగించుకునే సర్వీస్ నాసిరకం అయితే
సులభంగా కంప్లైంట్ ఇవ్వవచ్చు.
కోర్టుకు వెళ్లి పోరాటం చేయకుండానే “ఆయా కంపెనీల గుడ్ విల్ దెబ్బ తినకుండా” మనకు తగిన రిఫండ్స్ ఇస్తారు. 💸
కేవలం ప్రయివేటు మీద మాత్రమే కాదు ⚖️ ప్రభుత్వ సంస్థల మీద కూడా కన్స్యూమర్ ఫోరమ్ కి వెళ్ళవచ్చు.
---
ఇదంతా చదివి, చేతిలో 📱 ఫోన్, 🧠 గూగుల్ & 🤖 చాట్ GPT లాంటి AI లు వాడుతూ....
“కన్స్యూమర్ ఫోరమ్ కి ఎలా కంప్లైంట్ ఇవ్వాలి?” అని అడుగుతారు చూడూ — వాళ్లే అసలైన బద్ధకస్తులు 😴.
ప్రశ్నించడం, తెలుసుకోవడం చేతకాని మూర్ఖులు 🤦♂️.
---
మనం మనకు ప్రభుత్వం గానీ, ప్రయివేటు గానీ ఇచ్చే సర్వీసుల మీద ప్రశ్నించాలి ❓
నాసిరకం అని తెలిస్తే కోర్టుల దాకా వెళ్ళగలగాలి 💪
“మా వరకూ రాలేదు లే” అని గోడమీద పిల్లిలా 🐈 ఉంటే
గుంపులో తెడో ఒకరోజు మనం కూడా అందరితో పాటు బలి అవ్వాల్సిందే ⚰️.
ఎవరైనా ప్రభుత్వాలపై ప్రశ్నించినపుడు పార్టీల వారీగా విడిపోయి అమ్మనా బూతులు తిట్టే 😡 లుచ్చా సమాజం లో మనం ఉన్నాము.
---
పాలించేది యే పార్టీ అయితే ఏంటి? 🗳️
ప్రశ్నించే పాయింట్ లో నిజం ఎంత అనే చర్చ జరగాలి.
ప్రశ్నలో ఉన్న సమస్య పై చర్చ జరగాలి. 🔍
అంతేగానీ ❌
“అసలు ప్రశ్నించడానికి నువ్వు ఎవడ్రా??”
“నీకు ఏ అర్హత ఉంది??”
“నువ్వు ఫలానా ఉద్యోగివి — మూసుకొని ఉండు!”
“నువ్వు ఫలానా పార్టీ వాడివి — ముందు నీ నాయకుణ్ణి ప్రశ్నించు!”
అనే సమాధానాలు, తిట్లు, బండ బూతులు 🤬 వాడే మనుషులు ఎక్కువ అయ్యారు.
---
⚔️ ప్రశ్నించండి. ప్రశ్నే ఆయుధం. ప్రశ్నించడమే ఆధునికత!! 🚩
(❌ పార్టీల పరంగా, కులమతాల పరంగా విడిపోయి ఒకళ్ళనొకల్లు తిట్టుకునే ఈ జనాలకు ఎంత చెప్పినా అర్థం కాదు 🤦♀️.)