Kante Prashanth

Kante Prashanth politics

07/08/2024
07/08/2024

14/06/2024

హైదరాబాద్ వాసులారా జాగ్రత్త.. హైదరాబాద్‌లో తిరుగుతున్న భయంకరమైన ధార్ గ్యాంగ్

హైదరాబాద్‌లోని హయత్ నగర్, అమీన్ పర్, వనస్థలిపురంలో తిరుగుతున్న యూపీకి, మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్ అనే దొంగల ముఠా.

తాజాగా వీరికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు పోలీసులు విడుదల చేశారు.

ఉదయం ఆటోల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి రాత్రి వేళ ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసి ఇంట్లో ఉన్నవారిని క్రూరంగా చంపుతుంటారు.

11/06/2024

తెలంగాణ సీఎం ఇంటి ముందు గురుకుల టిచర్ ఆభ్యర్తుల నిరసన

జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన తెలిపారు. మోకాళ్లపై నిలబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురుకుల టీచర్ అభ్యర్థులు అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ చేతులెత్తి దండం పెడుతూ వేడుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.

11/06/2024

కారును ఓవర్ టేక్ చేసినందుకు అంబులెన్స్ డ్రైవర్ పై దాడి

బెంగళూరు - తుమకూరులోని నేలమంగల టోల్ ప్లాజా వద్ద 5 నెలల బాలుడిని ఆక్సిజన్ పైప్ పెట్టి అత్యవసరంగా వాణి విలాస్ అనే హాస్పిటల్‌కు తరలించే సమయంలో అంబులెన్సు డ్రైవర్ ఓ ఇన్నోవా కారును ఓవర్ టేక్ చేశాడు..

అంబులెన్సు డ్రైవర్ తమని ఓవర్ టేక్ చేయటం నచ్చని ఇన్నోవా కార్ వ్యక్తులు అంబులెన్స్‌ను 5 కిలోమీటర్లు మేర వెంబడించి డ్రైవర్ పై దాడి చేశారు.

అంబులెన్స్‌లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న 5 నెలల బాలుడి తల్లిదండ్రులు దండం పెట్టి బ్రతిమిలాడినప్పటికీ కనికరించని దుండగులు.

11/06/2024

గాజా లోని హమాస్ తీవ్రవాదులు ఉన్న ప్రాంతాలపైన పూర్తి పట్టు సాధించిన ఇజ్రాయిల్ దళాలు భూగర్భ సొరంగా మార్గాలను మొత్తము కూడా ఎక్కడికక్కడ తవ్వి పేల్చి వేస్తున్న క్రమంలో..

ఒక భూగర్భ సొరంగ మార్గంలో తీవ్రవాదులు ఉన్న సమాచారం సేకరించిన ఐడిఎఫ్ దళాలు దాని దగ్గరకు వెళ్లాయి ఆ సొరంగ మార్గం నుండి ఒక హమాస్ తీవ్రవాది ఒక రాకెట్ లాంచర్ ద్వారా పక్కనే ఉన్న ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సు కు సంబంధించిన యుద్ధ ట్యాంకును పేల్చి వేయడానికి సొరంగ మార్గం నుండి బయటికి వచ్చాడు. .

ఈ విషయాన్ని ఇజ్రాయిల్ దళాలు డ్రోన్ ద్వారా గమనించి ఆ సొరంగ మార్గం లోకి బాంబులు విసిరి తీవ్రవాదిని అంతమొందించాయి. .

దానికి సంబంధించిన వీడియో విడుదల అయ్యింది. .

10/06/2024

పోలీసులకు షాక్ ఇచ్చిన మందుబాబు🤣

హన్మకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు చెరువు లోని నీటిలోనే పడుకున్నాడు

అది గమనించిన స్థానికులు చెరువులో మృతదేహం ఉందని,కేయూ పోలీసు లకు,108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నీటిపై తేలుతున్న ఆ వ్యక్తిని గమనించారు

అది గమనించిన పోలీ సులు బయటికి లాగే ప్రయత్నం చేయగా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు. దీంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. అతన్ని ప్రశ్నించగా.. అతడు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా గుర్తింపు.

గత 10 రోజుల నుండి గ్రానైట్ క్వారీలో 12 గంటలు సేపు ఎండకి పని చేసి తట్టుకోలేక నీటిలో సేదతీరడానికి వచ్చానని పోలీసులకు తెలిపాడు.

10/06/2024

ముంబై లో తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు

ముంబై విమానాశ్రయంలో ఘోరప్రమాదం తప్పింది.

ఇండోర్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా, అదే రన్వేపై ఎయిర్ ఇండియా విమానం తిరువనంతపురం వెళ్లేందుకు టేకాఫ్ అయ్యింది.

రెండు విమానాల మధ్య కొన్ని దూరమే ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

08/06/2024

జీవించి ఉండగానే సొంతంగా స్మారకం నిర్మించుకున్న వ్యక్తి చెరుకూరి రామోజీరావు గారు.

‘మరణం ఒక వరం’, ‘నాకు చావు భయం లేదు’ అని చెప్పి చూపించారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ స్మారకం ఉంది.

Address

Jagtial
Jagtial

Telephone

+919701052010

Website

Alerts

Be the first to know and let us send you an email when Kante Prashanth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kante Prashanth:

Share