06/11/2023
కరువు కోరల్లో కడప జిల్లా
భూమిలో వేసిన ఎరువులు బుగ్గిపాలు
రాజకీయాలు తప్ప రైతాంగ సమస్యలు పట్టని జగన్ సర్కార్
కరువు జిల్లాల జాబితాలో కడప లేకపోవడం విచారకరం
కరువు మండలాలు ప్రకటించి సహాయక చర్యలు చేపట్టకపోతే సామాజిక సాధికారిక బస్సు యాత్రలను అడ్డుకుంటాం
కరువు పర్యటనలో జి.ఓబులేసు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గాసభ్యులు
కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారిన కడప జిల్లా మరో మారు కరువు వాతన పడిందని భూమిలో వేసిన ఎరువులు విత్తనాలు బుగ్గిపాలయ్యాయని తక్షణం కడప జిల్లాలో కరువు జాబితాలో చేర్చి సహాయక చర్యలు చేపట్టకపోతే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికారిక బస్సు యాత్రను అడ్డుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గాసభ్యులు జి.ఓబులేసు, పి రామచంద్రయ్య హెచ్చరించారు. సిపిఐ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కరువు పర్యటనలో భాగంగా సోమవారం కమలాపురం మండలం చదిపిరాళ్ళ, ఎర్రగుంట్ల మండలంలోని దండుపల్లి, సిరాజుపల్లె, వామి కొండ రిజర్వాయర్, గ్రామాల్లో పర్యటించిన వారు మాట్లాడుతూ రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాక ఖరీఫ్,రబీ సీజన్లు పూర్తిగా సాధారణ సాగు విస్తీనానికి నోచుకోలేదన్నారు. అర, కోరగా వేసిన పంటలు కూడా పూర్తిగా ఎండిపోయాయి అన్నారు. భూగర్భ జలాలు గరినీయంగా పడిపోతున్నాయన్నారు. రైతాంగం కరువు కోరల్లో చిక్కి శల్యమవుతుంటే ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ట రాజకీయాలను నడుపుతూ ప్రజలు ప్రజా సమస్యలు పూర్తిగా విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 443 మండలాల్లో కరువు ఏర్పడినట్లు ప్రాథమిక అంచనా నివేదికలు చెబుతున్నప్పటికీ ప్రభుత్వం కేవలం 103 కరువు మండలాలు ప్రకటిస్తే అందులో కడప జిల్లాలోని ఒక్క మండలాన్ని కూడా చేర్చకపోవడం, జిల్లాలో ఎమ్మెల్యేలు ఎంపీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. ప్రాజెక్టుల్లో ఆరా కొరగా నీళ్లు ఉన్నప్పటికీ పంట కాలువల పూర్తి కాకపోవడంతో వినియోగించుకునే వెసులుబాటు కూడా లేదన్నారు. ఈ సందర్భంగా రైతులను వివరాలు సేకరించారు వర్షాలు వస్తాయన్న ఆశతో దుక్కి దున్ని, ఎరువులు విత్తనాలు ఎకరాకు 10000 నుండి 15,000 అప్పు చేసి మరీ భూమిలో విత్తితే బుగ్గిపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అరాకొరగా వేసిన శనగ, కంది, మినుము, పత్తి పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. వరుస కరువులతో తల్లడిల్లుతున్న రైతాంగానికి మరో మారు కరువు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు.
తక్షణం ప్రభుత్వం కడప జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని పెట్టుబడి సహాయాన్ని, పంట నష్టపరిహారాన్ని అందించాలని వారి డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రణాలను పూర్తిగా మాఫీ చేయాలని, ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు. పశువుల దాన, పశుగ్రాస విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని, ఉపాధి హామీ పని దినాలను 300 రోజులు కల్పించాలని, సూక్ష్మ నేటి సభ్యత్వం పరికరాలపై ఇచ్చే రాయితీని పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టుల పూర్తిపై తండ్రి ఆశయాలకు తిలోదకానిచ్చిన జగన్:
జగన్ అధికారంలోకి వస్తే తన తండ్రి ఆశయాలైన నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి గ్రామానికి త్రాగునీరు ప్రత్యేకరావు సాగునీరు అందించడం లక్ష్యంగా పనిచేస్తానని నమ్మవలికి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటిన పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, వంటకాలువలు పూర్తి చేయలేకపోయారు అన్నారు. నీటి హక్కులపై అన్యాయం జరుగుతున్న పల్లెత్తు మాట మాట్లాడలేని జగన్ నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితాన్ని ఇస్తున్న కడప జిల్లా సొంత గడ్డ ప్రజల సమస్యలు కూడా పట్టించుకోకపోతే జిల్లా ప్రజలకు క్షమించరన్నారు. కరువు మండలాలపై నోరు మెదపని ఎమ్మెల్యేలు, ఎంపీ రానున్న ఎన్నికల్లో ఓట్లు ఆడిగే హక్కు కూడా కోల్పోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు యం. వి సుబ్బారెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పీ చంద్రశేఖర్, కే.సి.బాదుల్లా, మునయ్య, నాగేశ్వర్ రావు, వరప్రసాద్, రామ్మోహన్ రెడ్డి, భవాని, చాంద్ బాషా, రాధా కృష్ణ, నాగిరెడ్డి, పక్కిరప్ప, చంద్ర, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు...