02/04/2025
🙏 *ప్రహ్లాద సమేత స్వయంభూగా వేలశి యున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము* 🙏
కదిరి పట్టణము - 515591, శ్రీ సత్యసాయి జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 - 221066, 221366
email: [email protected], [email protected]
*Web Site www.aptemples.ap.gov.in*
*_02.04.2025 వతేదిన శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం సేవ_*
*_నవ నరసింహుని క్షేత్రములలో కెల్ల భక్త ప్రహ్ల్లాద సమేతముగా స్వయంభూగా వేలశియున్న క్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయము, చారిత్రాత్మకంగా వాసికెక్కిన ప్రశిద్దిమైన వైష్ణవ క్షేత్రం_*
వసంత ఋతువు, చైత్ర మాసము శుద్ద పంచమి, కృత్తిక నక్షత్రం రోజున అనగా బుధవారం 02.04.2025 వ తేదిన స్వామి వారి బ్రహ్మోత్సవ 16 రోజుల పండగ, శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వార్లకు వసంతోత్సవము మ.4.00 గంటల నుండి ఆలయములో శ్రీస్వామి వారి రంగ మండపము నందు " *స్నపన తిరుమంజనము సేవా* ", అత్యంత వైభవముగా నిర్వహించబడినది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళు తదితర సుంగంధద్రవ్యాలతో స్వామి వార్లకు విశేషంగా అభిషేకం చేశారు, విశేష సమర్పణ చేస్తారు.అస్థాన పూజాధికార్యకమముల అనంతరము శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుల స్వామి వారి ఉత్సవర్లను ఆలయ నాలుగు తిరు మాడ వీధుల్లో ఊరేగింపు ఉత్సవమును వర్షం వలన నిలుదల చేయడం జరిగింది. శ్రీస్వామి బ్రహ్మోత్సవము యొక్క ఈ ఉత్సవము నకు 16 రోజుల పండుగ అని కూడా పిలుస్తారు..