14/08/2025
యువతలో దేశభక్తిని నింపేలా చీరాల నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ గురువారం పట్టణంలో తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు.79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా రూపొందించిన 79 అడుగుల జాతీయ జెండాతో ఈ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు సాగింది.ఆర్డీవో చంద్రశేఖర నాయుడు,మున్సిపల్ కమిషనర్ రషీద్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు,ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్ రావు,ఇతర అధికార, అనధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో జరిగిన సభలో మహేంద్ర నాథ్ జాతీయ జెండా విశిష్టతను వివరించారు.దేశ ప్రజలందరూ జాతీయ జెండాను గుండెలకు హత్తుకోవాలని పిలుపునిచ్చారు.ఆ జెండానే మనకందరికీ అండని మహేంద్ర నాధ్ చెప్పారు.ఇటీవలి కాలంలో చీరాలలో యువతను ఉత్తేజపరిచే క్రీడా కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహిస్తున్న మహేంద్ర నాధ్ తిరంగా ర్యాలీని కూడా తనదైన శైలిలో నిర్వహించి అందరి ప్రశంసలు చూరగొన్నారు.తద్వారా తన తండ్రి ఎమ్మెల్యే కొండయ్య ఇమేజ్ ని మహేంద్ర నాథ్ పెంచుతున్నారనడంలో సందేహం లేదు.