11/02/2025
*షేర్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడ్డ మహమ్మద్ సుభాని పై సి బి సి ఐ డి ఎంక్వయిరీ వేయాలి...*
*జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు కుట్టుబోయిన బ్రహ్మానందం డిమాండ్...*
Ap10 NEWS .. KAVALI
షేర్ ట్రేడింగ్ పేరుతో కావలిలో ప్రజలు ,వ్యాపారస్తులు, పోలీసులు వద్ద నుంచి సుమారు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన మహమ్మద్ సుభాని పై సిబిసిఐడి ఎంక్వయిరీ వేసి నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు బిజెపి సీనియర్ నాయకులు కుట్టుబోయిన బ్రహ్మానందం డిమాండ్ చేశారు. పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ నందు మంగళవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ షేర్ ట్రేడింగ్ పేరుతో పట్టణంలోని ముసునూరు గిరిజన కాలనీలో ఒక సమస్ధను నెలకొల్పి అనేకమంది ఏజెంట్ల ద్వారా ప్రజల వద్ద నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన మహమ్మద్ సుభాని పై పోలీస్ అధికారులు ,ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ప్రజలు కూడా అత్యాసకు పోవడం దురదృష్టకరమని గతంలో అగ్రిగోల్డ్ ,అక్షయ గోల్డ్ ,పెరల్స్ వంటి ఎన్నో కంపెనీలు ఇలానే ప్రజల నుంచి డబ్బులు కట్టించుకుని బోర్డులు తిప్పేసిన పరిస్థితి చూస్తున్నా మరల ఇటువంటి మోసగాళ్ల మాయలో పడి డబ్బులు పోగొట్టుకోవడం విచారకరమన్నారు. అలానే ఉన్నత విద్యను అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా కొందరు అధికారులు, కానిస్టేబుల్స్ ఇటువంటి దగా షేర్ ట్రేడింగ్ మార్కెట్లలో ఏజెంట్లుగా చేరి డబ్బులు ప్రజల నుంచి వసూలు చేసి పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్నారు. ఇలాంటి మహమ్మద్ సుభానిలు మరికొందరు కూడా కావలిలో ఇదే తంతు నిర్వహిస్తున్నారని వారిపై కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు . షేర్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వ్యక్తులు మాకు ఫోను చేసి 50 లక్షలు కట్టామని 30 లక్షల కట్టి మెసపోయామని మాకు న్యాయం చేయాలని కోరుతుంటే ఆశ్చర్యానికి లోనయ్యమని తెలిపారు.ఈ షేర్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితులకు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుందని జరిగిన విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ పెద్దలకు , ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి దృష్టికి ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఒకటవ పట్టణ అధ్యక్షుడు మంద కిరణ్ కుమార్, ఎస్సీ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు, పట్టణ ఉపాధ్యక్షులు సుందర శెట్టి సుజి, కోడూరు మురళీకృష్ణ, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు తూమాటి తిరుపతి స్వామి, యువ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవండ్ల రాకేష్, మణిదీప్ , నరసింహ తేజ,ఉప్పల ఎల్లయ్య ,మేఘనాథ్ తదితరులు పాల్గొన్నారు.