
15/08/2025
*ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది*
*ఎమ్మెల్యే ముప్పిడి.*
ప్రజా సంక్షేమానికి కూటమిప్రభుత్వం కట్టుబడి ఉందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని ఆయన కొవ్వూరు బస్టాండ్ లో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు లోకేష్ లకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు