24/10/2025
కుప్పంలో స్టెప్పులతో అలరించిన ఢీ సెలబ్రెటీ మణికంఠ...
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని VJ'S డాన్స్ & ఫిట్నెస్ స్టూడియోలో మే 1 నుంచి 31 వరకు సమ్మర్ డాన్స్ క్లాస్ వర్క్ షాప్ ను విజయ్ మాస్టర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమాన్ని కుప్పం VJ'S డ్యాన్స్ స్టూడియోలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈటీవీ Dhee Show లో ప్రముఖ కంటెస్టెంట్ మరియు కొరియోగ్రాఫర్, మణికంఠ మాస్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కుప్పం VJ'S డాన్స్ స్టూడియోలోని శిక్షణ పొందుతున్న పిల్లలందరికీ డాన్స్ లోని మెలకువలు నేర్పించారు. వారితో ఉత్సాహంగా స్టెప్పులు కలిపారు.
తన స్వస్థలమైన కుప్పంలో డ్యాన్స్ స్కూల్ ను స్థాపించి పిల్లలకు డాన్స్ లో ప్రావీణ్యం పొందేలా శిక్షణ ఇస్తున్న విజయ్ మాస్టర్ ను ఈ సందర్భంగా అభినందించారు.
తన గురువు ప్రముఖ డాన్స్ మాస్టర్, డైరెక్టర్, నిర్మాత, నటుడు మాస్టర్ రాఘవ లారెన్స్ సహకారంతో అనాధ పిల్లలు ఎవరైనా ఉంటే తాము దత్తత తీసుకుంటామని, ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థిని, విద్యార్థులకు తాము ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలిపారు.
కుప్పం సందర్శంచడం ఎంతో ఆనందంగా ఉందని. భవిష్యత్తులో తన గురువు ప్రముఖ డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ను కుప్పం పర్యటనకు తీసుకువచ్చేందుకు తను ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
❤️