18/09/2026
*నాగేశ్వరరావు గారు ఒక లైబ్రరీ*....... కళాభినేత్రి వాణిశ్రీ
నాగేశ్వరరావు గారితో
మాట్లాడుతున్నప్పుడు
కాసేపు పెద్ద వయసు ఉన్న
వ్యక్తిలా కనిపిస్తారు.
ప్రపంచంలో ఈ మనిషికి
తెలియని విషయం లేదేమో
అనిపిస్తుంది.
మేకప్ వేసుకుని షూటింగ్ లో
గెంతులు వేస్తుంటే ఆ మనిషి వేరేమో అనిపిస్తుంది. రైట్ ని తప్పుగా,
తప్పుని రైటుగా అనిపిస్తారు
ఆయన. నాగేశ్వరరావు గారి తో వాక్యాతుర్యంలో గెలవడం కష్టం.
ఆయనలో మొండితనం
కూడా ఎక్కువగా కనిపిస్తుంది.
ఆయన అంటూ ఉంటారు
అప్పుడప్పుడు మనిషికి
మొండితనం కాస్త కనిపించాలి.
"నీకు స్వతహాగా ఉంది కాబట్టి
నేర్చుకోవలసిన అవసరం లేదు"
ఎప్పుడైనా మా ఇద్దరిని
చూస్తే ఎదుటి వాళ్ళకి
వీళ్ళిద్దరికీ పరిచయం లేదేమో
అనిపించే అంత ముభావంగా
కూడా ఉంటుంటారు ఒక్కోసారి.
అన్ని రకాల మూడ్స్ ఉండబట్టే
నాగేశ్వరరావు గారు అంత
గొప్ప నటుడు కాగలిగారు
అనుకుంటాను.
ఏదైనా ఎవరు గురించి అయినా విమర్శించవలసినప్పుడు
అనవలసింది ఏదో అవతలి
వాళ్ళు బాధపడతారని
అనుకోకుండా తాను అనుకున్న
దాన్ని వ్యక్తం చేయగలిగిన వ్యక్తి.
పరిచయం లేని వారికి ఇదేమిటి
ఆయన ఇలా మాట్లాడుతున్నారు
అనిపిస్తుంది పరిచయం ఉన్నవారికి
మాత్రమే ఆయన స్వభావం తెలుస్తుంది.
నాకు తెలిసినంతవరకు కొత్త వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు ఆయన
దగ్గర చాలా ఉన్నాయి. నేను
చెబుతున్నది నా స్వీయ అనుభవం.
నాగేశ్వరరావు గారు ఒక
గ్రంథాలయం లాంటి వారు.
ఏ సబ్జెక్టు తీసుకున్న దాని
గురించి అనర్గళంగా చెప్పగలిగిన
శక్తి ఆయనకు ఉంది. ఏ టు జెడ్
అన్ని సబ్జెక్టులు క్షుణంగా తెలుసు
ఆయనకు ఏ విషయమైనా
తెలియదనుకొని చెప్పబోతే
బోల్తాపడే ప్రమాదం ఉంది.
కొంతమంది భావాన్ని వ్యక్తం చేయలేరు ఎదుటివారు చాలా సౌలభ్యంగా అర్థం చేసుకోగలిగే భాష ఆయనలో ఉంది.
కొత్త వాళ్ళు తనతో మొదటిసారి నటిస్తున్నప్పుడు భయపడితే
వాళ్ళ లెవెల్కు తాను దిగి తనంటే
భయం తొలగించి ఎంకరేజ్ చేస్తారు.
ఆ సీను రక్తి కట్టడం కోసం ఆయన
అలా చేస్తారు. కానీ అది
ఎదుటి మనిషి మీద ఉన్న ఇంట్రెస్ట్.
నటుడుగా, వ్యక్తిగా, ఎంతో ఎదిగిన
శ్రీ నాగేశ్వరరావు గారు
పారిశ్రామికవేత్త కూడా.
తెలుగు వారంతా గర్వించే
విధంగా అన్నపూర్ణ స్టూడియోను
ఎంతో అభిరుచి తో రూపొందించారు.
ఆ స్టూడియో ని చూస్తుంటే
అసలు కదల బుద్ధి కాదు.
ఎంతో ప్రజెంట్గా ఉంటుంది.
చుట్టూ కొండలు, కొండల మధ్య
సుందరంగా నిర్మించిన స్టూడియో.
అక్కడి నుంచి చూస్తుంటే
హైదరాబాద్ నగరం దిగువన ఉన్న అందాలొలికిస్తూ కనిపిస్తుంది.
ఇంతటి పేరు ప్రఖ్యాతులు,
డబ్బు సంపాదించాక కూడా
విశ్రాంతి తీసుకోవాల్సిన
వయసులో కూడా ఎంతో
ఉత్సాహంగా స్టూడియో పనులు
చూస్తూ కాంక్రీట్ వేయడం
దగ్గరి నుంచి మేకులు కొట్టడం
వరకు అన్ని పనులు దగ్గరుండి
చూసుకోవడం ఆయన శ్రద్ధకు
కృషికి తార్కాణం.
నాగేశ్వరరావు గారు చక్కని
అభివృద్ధితో అన్నపూర్ణ స్టూడియోను కట్టించారు. ప్రారంభ రోజుల్లోనే
ఎంతో బాగా మెయింటైన్ చెయ్యడం
చాలా గొప్ప విషయం.
ఆయన ఏ రంగంలో వెళ్లిన
విజయం సాధిస్తారని
నమ్మకం నాకుంది.
ఎందుకంటే ఆయనలో
ఆ కృషి పట్టుదల ఉన్నాయి.
అంతేకాకుండా 1954 నుంచి
ఇంతవరకు అంటే 22 సంవత్సరాలు
ఒకే వెయిట్ మైంటైన్ చేస్తున్నారట నాగేశ్వరరావు గారు.
ఇది చాలా గొప్ప విషయం.
నేను నాగేశ్వరరావు గారితో
ఎన్నో సినిమాలు చేశాను.
వాటిలో విజయ శాతం కూడా ఎక్కువ. నాగేశ్వరరావు గారు అన్ని
విషయాలు తెలిసిన ఒక లైబ్రరీ
వంటి వారు
పిక్చర్ ఫీల్డ్ పత్రిక నుంచి ఈ ఇంటర్వ్యూ తీసుకోబడినది
సేకరణ నవీన్ ప్రసాద్
9849070838