Madhira RachaBanda మధిర రచ్చబండ

Madhira RachaBanda మధిర రచ్చబండ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhira RachaBanda మధిర రచ్చబండ, News & Media Website, Madhira.

People Pulse................ Revant Reddy👍 Bhatti 👎
30/05/2023

People Pulse................ Revant Reddy👍 Bhatti 👎

*క‌మ‌ల‌మా… హ‌స్త‌మా… మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌న్న పొంగులేటి, జూప‌ల్లి* తెలంగాణ రాజకీయాల్లో ఈటల, పొంగులేటి, జూపల్లి రహస్య...
30/05/2023

*క‌మ‌ల‌మా… హ‌స్త‌మా… మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌న్న పొంగులేటి, జూప‌ల్లి*
తెలంగాణ రాజకీయాల్లో ఈటల, పొంగులేటి, జూపల్లి రహస్య భేటీ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గన్‌మెన్లకు కూడా అనుమతి లేకుండా ఈటల జూపల్లి, పొంగులేటితో ఏం చర్చించా రనన్న అంశంపై ఉత్కంఠ రేపుతోంది. మ‌రో వైపు కాంగ్రెస్ కూడా ఈ ఇద్ద‌రిని హ‌స్తం గూటికి చేర్చేందుకు త‌మ వంతు ప్ర‌యత్నాల‌ను ముమ్మ‌రం చేసింది.. దీంతో ఏ పార్టీలో చేరాల‌నే విష‌యంలో ఈ ఇద్ద‌రు నేత‌లు మ‌ల్ల‌గుల్ల‌లు ప‌డుతున్నారు.. కాగా రానున్న అసెంబ్లి ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలనే పట్టుదలతో బీజేపీ నాయకత్వం ఉంది. దీంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో అసం తృప్తి నేతలే టార్గెట్‌గా ఆ పార్టీ ప్రయ త్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలో బలమైన నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని, మహబూబ్‌నగర్‌ జిల్లా రాజకీ యాల్లో కీలక నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఎలాగైనా బీజేపీలోకి తీసుకు రావాలన్న పట్టుదలతో బీజేపీ ఉంది. అయితే బీజేపీలో చేరే విషయమై పొంగులేటి, జూపల్లి తేల్చకపో వడంతో సస్పెన్స్‌ కొనసాగుతోంది. వారిని ఎలాగైనా తమ వైపు తిప్పుకునేలా బీజేపీ పావులు కదుపుతుంది.

30/05/2023
🔁మూలమలుపుల తో  ఎన్నో ప్రమాదాలు🚷కనిపించని హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, ఆర్ అండ్ బి నిర్లక్ష్యానికి బలవుతున్న ప్రజ...
30/05/2023

🔁మూలమలుపుల తో ఎన్నో ప్రమాదాలు
🚷కనిపించని హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, ఆర్ అండ్ బి నిర్లక్ష్యానికి బలవుతున్న ప్రజలు
🚫ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని ఆర్ అండ్ బి , సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు
🚦🚧రోడ్డు ప్రమాదాలను నివారించుటకు అవసరమైన ప్రదేశాల్లో హెచ్చరిక బోర్డ్ లను ఏర్పాటు , వెంటనే మరమ్మతులతో తగిన చర్యలు చేపట్టాలని వాహనదారులు, ప్రజల డిమాండ్
👉మధిర మండల పరిధిలోని మధిర నుండి దేశినేనిపాలెం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే మధిర ఆర్ అండ్ బి పరిధి. పరిధి పరిమితమైన ప్రమాదాలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. దీనికి ముఖ్య కారణం ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యమే అంటున్న ప్రజలు. అనేక మూలమలుపులు జంక్షన్ లో ఎటువంటి హెచ్చరిక బోర్డులు స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుని అనేకమంది క్షతగాత్రులు కొందరు ప్రాణాలు కోల్పోతున్న ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్య ద్వారా లేదని అలానే ప్రజాప్రతినిధులు కూడా ఏమి పట్టినట్టు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రాయపట్నం గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్ లో ఎన్నో ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. ఈ మలుపుల వలన అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆర్ అండ్ బి రోడ్డుకి ఆనుకొని డ్రైనేజీ ఉండడం వల్ల మూలమలుపు ప్రాంతంలో ఎదురెదురుగా వచ్చిన వాహనాలు తప్పుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్ అండ్ బి కి సంబంధించిన అధికారులు ఎటువంటి హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయలేదు దీనివల్ల కొత్తగా వచ్చే వాహనదారులు ప్రమాద మలుపును గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. ఇదే కోవాలో నేడు మధిర బైపాస్ మధిర సిటీ నుండి వెళ్ళు "Y" జంక్షన్ ప్రదేశంలో ప్రమాదం చోటుచేసుకుని ఒక యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మధిర- రాయపట్నం ఆర్ అండ్ బి రోడ్ బ్రిడ్జి తర్వాత "Y" జంక్షన్ లో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. Y జంక్షన్ ప్రాంతంలో ఎటువంటి హెచ్చరిక బోర్డులను కానీ, స్పీడ్ బేకర్స్ ను కాని ఏర్పాటు చేయకపోవడం వల్ల వాహనదారులు అయోమయంలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు , సంబంధిత ఉన్నత అధికారులు ,ఆర్ అండ్ బి అధికారులు మరిన్ని ప్రమాదాలు జరగకముందే సమస్యను గుర్తించి పరిష్కరించవలసిందిగా *మీడియా* ద్వారా తెలియజేస్తున్నారు.

మధిర సిపిఎస్ స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటు.              మన ఊరు మనబడి పథకంలో భాగంగా ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఎంపిక చేస...
26/05/2023

మధిర సిపిఎస్ స్కూల్లో సీసీ కెమెరాల ఏర్పాటు.
మన ఊరు మనబడి పథకంలో భాగంగా ప్రభుత్వం కొన్ని పాఠశాలలను ఎంపిక చేసి మౌలిక వసతులను కల్పిస్తుంది. ఈ మేరకు MADHIRA GHS CPS పాఠశాలకు వేసవిలో రక్షణగా సీసీ కెమెరాలను నేడు అమర్చడమైనది. ఈ సీసీ కెమెరాలు జిల్లా కేంద్రానికి, రాష్ట్ర కేంద్రానికి అనుసంధానంగా పనిచేస్తాయి.

*చాకచక్యం  వ్యవహరించి  ప్రాణాలు కాపాడిన ఏర్రుపాలెం బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ఉపేందర్.* కుటుంబ కలహాలతో చనిపోదం అని ఏర్రుపాల...
26/05/2023

*చాకచక్యం వ్యవహరించి ప్రాణాలు కాపాడిన ఏర్రుపాలెం బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ఉపేందర్.*
కుటుంబ కలహాలతో చనిపోదం అని ఏర్రుపాలెం రైల్వే ట్రాక్ పై చనిపోవడానికి జుజ్జురు గ్రామానికి చెందిన యువకుడు ప్రయత్నించినడాని 100 డయల్ కాల్ కి సకాలంలో స్పందించి, గూగుల్ లొకేషన్ ద్వారా యవకుడు వద్దకు సాహసోపేతంగా గా చేరుకొని యువకుడు రక్షించడం జరిగింది. అట్టి యువకుడిని కౌన్సిలింగ్ చేసి తన కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది.

*💥బ్రేకింగ్ న్యూస్**అక్రమo గా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పట్టుకున్న ఎస్ఐ**దళిత బంధు ట్రాక్టర్లతో ఇసుక తరలింపు*అక్...
26/05/2023

*💥బ్రేకింగ్ న్యూస్*
*అక్రమo గా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పట్టుకున్న ఎస్ఐ*
*దళిత బంధు ట్రాక్టర్లతో ఇసుక తరలింపు*
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పది ట్రాక్టర్లను మధిర పట్టణ అదనపు ఎస్సై స్వప్న అదుపులోకి తీసుకున్నారు ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని రాయపట్నం శివారులో వైరా ఏరు నుండి గత కొంతకాలంగా అర్ధరాత్రిలు అపరాత్రులు అనకుండా ఇసుక మాఫియా ఇసుకను తరలించే చర్యలను కొనసాగిస్తూ వస్తుంది ఈ విషయమై గ్రామ సర్పంచ్ మండల రెవెన్యూ అధికారులకు పోలీసులకు లిఖితపూర్వక సమాచారాన్ని ఫిర్యాదును అందజేసింది. ఈ మేరకు కొద్ది రోజులు ఎటువంటి కార్యకలాపాలు చేపట్టని ఇసుక మాఫియా గడిచిన మూడు రోజులుగా విచ్చలవిడిగా తోలకాలకు సిద్ధమైంది సమాచారం అందుకున్న మధిర పట్టణ ఎస్సై స్వప్న మాటువేసి ఇసుకను తరలించేందుకు వచ్చిన పది ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ట్రాక్టర్లలో మధిర పట్టణ ప్రాంతానికి చెందిన ట్రాక్టర్లతో పాటు రాయపట్నం గ్రామానికి చెందిన ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. ఈ ట్రాక్టర్లలో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం అందజేసిన ట్రాక్టర్లను ఈ అక్రమ ఇసుక రవాణాకు కొంతమంది వ్యక్తులు అద్దె ప్రాతిపదికగా తీసుకొని ఈ దందాను కొనసాగిస్తున్నారని సమాచారం. గ్రామ సర్పంచ్ పూర్తి ఆధారాలతో పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పోలీస్ లు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పట్టణ అదనపు ఎస్ఐ స్వప్న ట్రాక్టర్ల యజమానులు డ్రైవర్ల పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

*పొంగులేటి , జూపల్లి తో ఈ రోజు ఉదయం భేటీ అయినBJP  చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్**హైదరాబాద్ లో శివారు లోని ఫాంహౌస్ ల...
26/05/2023

*పొంగులేటి , జూపల్లి తో ఈ రోజు ఉదయం భేటీ అయినBJP చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్*
*హైదరాబాద్ లో శివారు లోని ఫాంహౌస్ లో*రహస్య సమావేశం*
*సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఈ సమావేశం జరుగుతున్నట్లుప్రచారం*

*మధిర*//ది: 01.05.2023▪️ *శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు.*▪️ *శ్రామికుల భాగస్వామ్యం తోనే అభివృద్ధి సాధ్యం.*▪️ *కేసీఆర...
01/05/2023

*మధిర*//ది: 01.05.2023
▪️ *శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదు.*
▪️ *శ్రామికుల భాగస్వామ్యం తోనే అభివృద్ధి సాధ్యం.*
▪️ *కేసీఆర్ గారి పాలనలో లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు.*
▪️ *కార్మికలోకానికి మేడే శుభాకాంక్షలు*
➖ మధిర లో జరిగిన మేడే వేడుకల్లో జడ్పీ చైర్మన్ *లింగాల కమల్ రాజు గారు*
_________________________________
శ్రామిక శక్తిని మించిన ఆస్తి లేదని శ్రామికుల భాగస్వామ్యం తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు. సోమవారం నాడు మేడే సందర్భంగా మధిర నియోజకవర్గ కేంద్రం మధిర పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ముందుగా పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి కార్మిక సంఘం మధిర నియోజకవర్గ ఇంచార్జ్ జిల్లేపల్లి బాబూరావు గారు RWS కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండాను లింగాల కమల్ రాజు గారు ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు అలానే అంబేద్కర్ సెంటర్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం అక్కడే పెయింటర్స్ అసోసియేషన్ గద్దల ఏసు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడే స్పూర్తితో బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని కార్మికుల కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు అలానే ఉత్పత్తి, సేవా రంగాలను బలోపేతం చేసే దిశగా పారిశ్రామిక విధానం రూపొందించడం వినూత్న పారిశ్రామిక విధానాలతో సంపద సృష్టించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. కార్మిక శాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్లైన్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకుందని, కార్మికులు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభించిందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావడం వల్ల అంతర్జాతీయంగా పేరు పొందిన పలు కంపెనీలు మన రాష్ట్రానికి వస్తున్నాయన్నారు తద్వారా కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఉపాధి, వేతనం లభిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రామికులు, కార్మికుల పక్షపాతి అని వారి భద్రతకు, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తన రక్తాన్ని స్వేదంగా మార్చి అవరోధాలను అభివృద్ధి మెట్లుగా మలిచే కార్మిక లోకానికి ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్మిక సోదరులు పాల్గొన్నారు

*▪️చిన్న కష్టం వచ్చినా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, అదైర్య పడొద్దు.**♻️ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.**...
18/04/2023

*▪️చిన్న కష్టం వచ్చినా ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం, అదైర్య పడొద్దు.*
*♻️ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.*
*♻️ సర్పంచ్ అబ్బూరి సంధ్య రాణి గారు*
▪️మధిర మండలం అత్కూరు గ్రామ వాసులకు కూలి పనులకు వెళ్తుండగా ఖాజిపురం వద్ద 11 మంది కూలీలకు రోడ్ ప్రమాదం జరగడం జరిగింది,గాయపడిన వారిని గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్య రాణి గారితో కలిసి పరామర్శించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు,గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్య రాణి గారు గాయపడిన వారికి ఒక్కొ కుటుంబానికి 25కేజీల బియ్యాన్ని అందజేయడం జరిగింది.
👉 ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.

*భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు*మధిర అంబే...
14/04/2023

*భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్ కమల్ రాజు గారు*
మధిర అంబేద్కర్ సెంటర్ లో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్మన్ విద్యాలత గార్లతో కలిసి వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళుర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేళ..యావత్ భారతజాతి గర్వపడే విధంగా..హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆ మహోన్నత మూర్తికి సమున్నత నివాళి అర్పిస్తోంది కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. పీడిత వర్గాల కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం, పీడిత ప్రజల బాగు కోసం,బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో వెలుగు నింపడం కోసం డా.బి.ఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో వారిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు అదే బాటలో సాగుతున్నారన్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలోనే మనమందరం కూడా నడిచి పేదవారి ఆకలి తీర్చడం కోసం, బడుగు బలహీన వర్గాల ఉన్నతి కోసం పనిచేయడమే వారికి నిజమైన నివాళి అన్నారు.భారతదేశంలో 90శాతం ఉన్న బడుగుబలహీన వర్గాల ప్రజలు అభివృద్ధి చెందితేనే, డా.బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి నిజమైన గౌరవం ఇచ్చిన వారమవుతామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నందు రాజ్యాంగ నిర్మాత dr. B.R అంబేద్కర్ గారి 125అడుగుల గారి విగ్రహ ఆవిష్కరణకు మధిర నుండి హైదరాబాద్  కు బయలుదేర...
14/04/2023

హైదరాబాద్ నందు రాజ్యాంగ నిర్మాత dr. B.R అంబేద్కర్ గారి 125అడుగుల గారి విగ్రహ ఆవిష్కరణకు మధిర నుండి హైదరాబాద్ కు బయలుదేరిన BRS నాయకులు,జెండా ఊపి ప్రారంభించిన ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు మరియు మధిర మునిసిపల్ చైర్మన్ మొండితోక లత గారు*
👉భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 125 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మధిర అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ గారి విగ్రహనికి పూల మాల వేసి నివాళి అర్పించిన అనంతరం 2 బస్సులలో 100మంది ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ కు బయలుదేరారు.
👉ఈ కార్యక్రమం లో మునిసిపల్ కమీషనర్ రమాదేవి గారు,ఎంపీడీఓ విజయ్ భాస్కర్ గారు, మునిసిపల్ వైస్ చైర్మన్ విద్యా లత గారు,11వార్డ్ కౌన్సిలర్ మాధురి గారు,8వార్డ్ కౌన్సిలర్ అప్పారావు గారు,సొసైటీ చైర్మన్ బిక్కి ప్రసాద్ గారు, మధి
ర టౌన్ పార్టీ అధ్యక్షులు కనుమూరి వెంకటేశ్వరరావు గారు,BRS నాయకులు కరివేద సుధాకర్ గారు, BVR గారు, వెంకట్ రెడ్డి గారు, ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Address

Madhira
507203

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhira RachaBanda మధిర రచ్చబండ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share