11/08/2025
నేతన్నలను కార్పొరేట్ వ్యాపారస్తులుగా తీర్చిదిద్దడమే మంత్రి నారా లోకేష్ ధ్యేయం – చేనేతలకు హామీల అమలుపై కృతజ్ఞతతో భారీ ర్యాలీ
మంగళగిరి పట్టణంలో 100 అడుగుల చీరతో చేనేత వృత్తిదారులు, కళాకారులు, కుటుంబ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. నేతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, ఉచిత విద్యుత్, త్రిఫ్ట్ ఫండ్, మార్కెటింగ్ ఒప్పందాలు వంటి పథకాలతో చేనేత రంగానికి ఊతమిస్తున్నందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌కు నేతన్నలు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాన పథకాలు:
• మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్
• రూ.5 కోట్ల త్రిఫ్ట్ ఫండ్ కేటాయింపు
• చేనేత ఉత్పత్తులకు టాటా, ఆదిత్య బిర్లా, తమిళనాడు కోఆపరేటివ్‌తో ఒప్పందాలు
• ఎన్టీఆర్ భరోసా కింద 92,724 మందికి నెలకు ₹4,000 పింఛన్ (మొదటి ఏడాదిలో ₹370.89 కోట్లు)
• నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఎగ్జిబిషన్లు, ఈ–కామర్స్ ద్వారా నేరుగా విక్రయాలు
• జాతీయ హ్యాండ్‌లూమ్ ప్రోగ్రాం కింద 10 క్లస్టర్లు
• వీవర్స్ ముద్రా స్కీమ్ ద్వారా రుణాలు
• చేనేత మహిళలకు రూ.10 వేల విలువైన నూలు, ఏటా ₹125 కోట్ల వ్యయం
నేతలు మాట్లాడుతూ 2019–24 మధ్య వైసీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నేతన్నల ఆర్థిక–సామాజికాభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. మంగళగిరికి ఇచ్చిన మేజార్టీకి ప్రతిఫలంగా స్థానికాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించే దిశగా నూతన టెక్స్టైల్స్ పాలసీని రూపొందించినట్లు, చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య జయంతిని ప్రభుత్వ స్థాయిలో జరపడం, విగ్రహం ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలు చేనేతలకు గౌరవం తీసుకువచ్చాయని నాయకులు అభిప్రాయపడ్డారు.