Naresh Nakka goud BRS

Naresh Nakka  goud BRS తెలంగాణ కు తెలంగాణ ప్రజలకు శ్రీరామా రక్షా KCR గారు

13/08/2025

5 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ గంటకు పైగా ఆలస్యం

బైక్‌పై తీసుకెళ్లగా యువతి పరిస్థితి విషమం

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రెడ్డిగూడెం గ్రామంలో నిన్న బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న గుగులోత్ హరిక అనే యువతి

అంబులెన్స్‌కి కాల్ చేసి గంటకు పైగా ఎదురుచూసినా రాకపోవడంతో.. సెలైన్ బాటిల్ పెట్టించి బైక్‌పై యువతిని తీసుకెళ్లిన కుటుంబసభ్యులు

మార్గమధ్యంలో అంబులెన్స్ ఎదురు రాగా, అప్పటికే యువతి పరిస్థితి విషమం

అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో గంటన్నరకు పైగా సమయం వృధా అయి.. హారిక పరిస్థితి విషమించిందని విలపించిన బంధువులు

సకాలంలో ఆసుపత్రికి తరలించి ఉంటే పరిస్థితి విషమించేది కాదని.. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే అంబులెన్స్ ఆలస్యమైందని కుటుంబసభ్యుల ఆవేదన

04/08/2025

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ గారి మరణం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం

ఆదివాసీల హక్కుల కోసం, ప్రాంతీయ అస్తిత్వం కోసం వారు చేసిన పోరాటం.. తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తి

శిబూ సోరెన్ మరణం దేశ అస్తిత్వ, జాతీయ ఫెడరల్ రాజకీయాలకు తీరని లోటు - బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిబూ సోరెన్ మృతి పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారు సంతాపం ప్రకటించారు.

శిబూ సోరెన్ గారి మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, జాతీయ ఫెడరల్ స్ఫూర్తికి, ఆదివాసీ సమాజానికి తీరని లోటని అన్నారు।

ఈ సందర్భంగా శిబూ సోరెన్ తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి వారందించిన సహకారాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.

దేశ ఫెడరల్ స్ఫూర్తిని ప్రతిఫలించే దిశగా, శిబూ సోరెన్ చేపట్టిన జార్ఖండ్ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమం.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి స్ఫూర్తి నింపిందన్నారు.

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) స్థాపన సమయంలో శిబూ సోరెన్ గారిని హైదరాబాద్‌లో జరిగిన తొలి సభకు మొదటి అతిథిగా ఆహ్వానించుకున్నామని గుర్తు చేశారు.

నాటి తెలంగాణ ఉద్యమానికి వారు తెలిపిన సంపూర్ణ సంఘీభావం మర్చిపోలేనిదని కేసీఆర్ గారు గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించిన శిబూ సోరెన్, తాను ప్రారంభించిన తెలంగాణ మలి దశ ఉద్యమానికి అండగా నిలిచారని కేసీఆర్ తన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు.

2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కూడా శిబూ సోరెన్ మద్దతుగా నిలిచారని,

జార్ఖండ్ మరియు తెలంగాణ ప్రజల ఉద్యమ విజయాలు... దేశ ఫెడరల్ స్ఫూర్తికి, ప్రాంతీయ, సామాజిక న్యాయానికి దిక్సూచిగా నిలిచాయని కేసీఆర్ తెలిపారు.

శిబూ సోరెన్ గారి JMM పార్టీ, తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండడంతో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒత్తిడి తేవడంలో కీలక పాత్ర పోషించిందని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతర కాలంలో, 2022లో జార్ఖండ్‌లో శిబూ సోరెన్ గారిని కలిసి వారి ఆశీస్సులు తీసుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

శిబూ సోరెన్ ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు.

తండ్రిని కోల్పోయి దుఃఖ సంద్రంలో మునిగిన వారి కుమారుడు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

04/08/2025
28/07/2025

రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న నాటకాలను తెలంగాణ ప్రజలు గుర్తించాలి

ప్రతిపక్ష పార్టీ అంటే ప్రభుత్వ పార్టీని ప్రశ్నించాలి కానీ తెలంగాణ బీజేపీ నాయకులు మాత్రం బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు

గోదావరి జలాల గురించి ఒక్క కాంగ్రెస్ ఎంపీ మాట్లాడడు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడడు.. బండి సంజయ్‌కి ఎలాగో సదువు రాదు కాబట్టి స్పందించడు

తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని స్పష్టం అవుతుంది – బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారు

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఝలక్ రేవంత్ పాలనపై స్వయంగా రిపోర్ట్ తయారు చేయమని మీనాక్షికి ఆదేశాలు ఈనెల 31 నుంచి రాష్ట్రంల...
28/07/2025

రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఝలక్

రేవంత్ పాలనపై స్వయంగా రిపోర్ట్ తయారు చేయమని మీనాక్షికి ఆదేశాలు

ఈనెల 31 నుంచి రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర

ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డిపై మంత్రుల ఫిర్యాదు

పాలన ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అని హెచ్చరికలు

సోనియా గాంధీ పేరు వాడి నా పాలన అద్భుతమన్న రేవంత్

రేవంత్ మాటలను నమ్మని రాహుల్, నిగ్గు తేల్చడానికే మీనాక్షితో సర్వే

రేవంత్ రెడ్డి పనైపోయిందా!మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దేనికి సంకేతంసీఎంగా రేవంత్ రెడ్డి ఉండగా మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు క...
28/07/2025

రేవంత్ రెడ్డి పనైపోయిందా!

మీనాక్షి నటరాజన్ పాదయాత్ర దేనికి సంకేతం

సీఎంగా రేవంత్ రెడ్డి ఉండగా మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఇవ్వడంతో ఆందోళనలో రేవంత్ అనుచరగణం

75 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో సొంత రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో ఒక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జికి పాదయాత్రకు అనుమతి ఇవ్వడం మొదటిసారి

రేవంత్ రెడ్డితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే గెలవలేమని ఫిక్స్ అయిన కాంగ్రెస్ అధిష్టానం

సాధారణంగా పాదయాత్రలకు అనుమతి ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణలో పాదయాత్రకు అధిష్టానం అనుమతి ఇవ్వడంపై అనుమానాలు

గతంలో పాదయాత్ర కోసం 6 నెలలు తిరిగి అధిష్టానం అనుమతి తీసుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి

వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తానంటే అనుమతి ఇవ్వని కాంగ్రెస్ పార్టీ

ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి కుర్చీ కిందకు నీళ్ళు వచ్చాయని స్పష్టంగా అర్థమవుతుంది అంటున్న రాజకీయ విశ్లేషకులు

28/07/2025

మహా న్యూస్ మీద దాడి కేసులో ఎలాంటి సంబంధం లేని గెల్లు శ్రీనివాస్ సతీమణి మీద అట్టెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు

ఆయన భార్యకు ఇచ్చిన నోటీసులో మర్డర్ అటెంప్ట్ 109(1) సెక్షన్ పెట్టారు

ఇదెక్కడి న్యాయం అని మళ్లీ కేటీఆర్ ప్రశ్నించగానే ఆమె మీద మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టలేదు అంటూ పోలీసులు చెప్తున్నారు - మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు

ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితుల్లో 16 వేల ఆర్టీసీ కుటుంబాలుపింఛను లేదు, బకాయిలు రావు అంటూ ఉద్యోగ విరమణ చేసిన సి...
28/07/2025

ఆర్థిక ఇబ్బందులతో దిక్కుతోచని పరిస్థితుల్లో 16 వేల ఆర్టీసీ కుటుంబాలు

పింఛను లేదు, బకాయిలు రావు అంటూ ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది ఆవేదన

ఇక ప్రతి సోమవారం రోడ్డెక్కి నిరసనలు తెలపాలని నిర్ణయం

గత వారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం స్వయంగా ఆర్టీసీ లాభాల్లో ఉందని ప్రకటించినప్పటికీ.. పని చేసి ఉద్యోగ విరమణ పొందిన వేల మంది ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల కోసం ఆర్టీసీ కార్యాలయాల వద్ద ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొని ఉండటం, పెన్షన్ లేకపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం శోచనీయం

రిటైర్ అయిన ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకపోగా, కనీసం ఎప్పు డిస్తారో కూడా చెప్పకపోవటంతో రిటైర్ అయిన ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వర్ణనాతీతం

పెన్షన్ లేని ఉద్యోగం కావటంతో.. తక్కువ జీతాలతో పనిచేసి పేదరికంలో మగ్గుతున్న శ్రామిక్, డ్రైవర్, కండక్టర్

ఒకరు, ఇద్దరు కాదని.. దాదాపు 16 వేల కుటుంబాలు నానా అవస్థలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న సిబ్బంది

💥 *రికార్డు బ్రేకింగ్*హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోనున్న రేవంత్సౌత్ ఇండియాలో మొదటిసారి 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీ వెళ్లిన స...
28/07/2025

💥 *రికార్డు బ్రేకింగ్*

హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోనున్న రేవంత్

సౌత్ ఇండియాలో మొదటిసారి 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎంగా నిలిచి రికార్డ్ నెలకొల్పిన రేవంత్ రెడ్డి

వచ్చే నెల 5,6,7 తేదీల్లో 50వ సారి డిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

మూడు రోజుల పాటు ఢిల్లీలోనే సీఎం రేవంత్ బృందం

Address

Medak
Medak
502336

Alerts

Be the first to know and let us send you an email when Naresh Nakka goud BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Naresh Nakka goud BRS:

Share