02/07/2025
జిల్లా పోలీస్ కార్యాలయం
మెదక్ జిల్లా
పత్రిక ప్రకటన 02.07.2025
*ప్రతి విద్యార్ధి మరో ముగ్గురకి సైబర్ నేరల పై అవగాహనా కల్పించాలి*
*విద్యార్థులు తమ విధిగా మీ గ్రామంలో అవగాహనా కల్పించాలి.*
*కాలేజ్ లలో విద్యార్థులను కూడా సైబర్ వారియర్స్ గా తీర్చిదిద్దుతాం.*
*ఆశ, అత్యాశ్యలే సైబర్ నేరలకు కారణం.*
*సైబర్ నేరల పైన అవగాహనా, అప్రమతతే ముఖ్యం.*
*మెదక్ అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ గారు.*
ఈ రోజు మెదక్ టౌన్ లో జిల్లా ఎస్పీ శ్రీ. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ డీగ్రీ కళాశాలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమని అదనపు ఎస్పీ శ్రీ ఎస్ మహేందర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
• సైబర్ నేరానికి గురైతే ఎలా స్పందించాలి అనే అంశాలపై విద్యార్థులకు సైబర్ క్రైమ్ సిబ్బంది పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా కండ్ల కట్టినట్టు వివారించారు.
• సైబర్ క్రైమ్ సిబ్బందికి వచ్చిన కేసులను విద్యార్థులకు వివరించడం జరిగింది.
• సైబర్ క్రైమ్ డియస్పి శ్రీ. సుభాష్ చంద్ర బోస్ గారు మాట్లాడుతూ..
• మల్టీలెవల్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్స్,లొన్ యాప్స్ ఫ్రాడ్స్, apk links ద్వారా జరిగే ప్రాడ్స్, కార్డు స్కిమ్మింగ్ ఫ్రాడ్స్, AEPS ఫ్రాడ్స్, గిఫ్ట్ ఫ్రాడ్స్, ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిపారు.
• పోలీసు అధికారులు నేరుగా వాట్సాప్ వీడియోకాల్స్ చేయరని,డిజిటల్ అరెస్టులని కాల్స్ వస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
• ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే గోల్డెన్ అవర్ లో ఫిర్యాదు చేసినట్లయితే అమౌంట్ను ఫ్రీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అన్నారు.
• అమ్మాయిలు, మహిళలు తమ సోషల్ మీడియా ఖాతాలో ఫోటోలను షేర్ చేయడం ద్వారా కూడా నేరగాళ్ళు ఫోటోలను మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ గారు మాట్లాడుతూ.....
• ప్రతి విద్యార్ధి మీ గ్రామంలో మరో ముగ్గురికి సైబర్ నేరాల పైన, డ్రగ్స్ తీసుకోవడం వలన కలిగే నష్టాల గురించి వివరించాలని అన్నారు.
• మొదట చిన్న చిన్న అమౌంట్ కు లాభాలు వెంటనే ఇస్తారని, ఎక్కువ అమౌంట్ పెట్టక రెస్పాండ్ కారని అన్నారు.
• సైబర్ నేరగాళ్ల వలలో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమని అన్నారు.
• ప్రజల బలహీనతలే సైబర్ నేరగాళ్ల బలంగా మారిందని, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా ఉండటానికి అప్రమత్తతే ప్రధాన ఆయుధం అని అదనపు ఎస్పీ గారు అన్నారు.
• ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని అన్నారు.
• ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలని తెలిపారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారు కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయి నేరాలు చేసే అవకాశం ఉంటుందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని నరాలు గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలిపారు.
• మధక ద్రవ్యలకు ఎవరైనా బానిసలైతే డి- అడిక్షన్ సెంటర్ కు తరలిస్తామని అన్నారు.
• డ్రగ్స్ కలిగి ఉన్నట్లుఐతే వెంటనే 1908 లేదా 100 కాల్ చేసి తెలపలన్నారు.
ఈ కార్యక్రమం లో డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ. హూసేన్ గారు మరియు Dcrb ఇన్స్పెక్టర్ మధు సుధన్ గౌడ్ గారు మరియు సైబర్ క్రైమ్ సిబ్బంది సతీష్ గారు, సాయికిరణ్ గారు, సయ్యద్ గారు మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.