21/12/2023
*🔊33 నేరాల్లో జైలుశిక్ష పెంపు*
*🔶83 నేరాల్లో జరిమానా హెచ్చింపు*
*🔷హత్యానేరం సెక్షన్ ఇక 101*
*🔶దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్*
*🔷మూక హింసకు మరణ దండన*
*🔶నేర జాబితా నుంచి ‘ఆత్మహత్యాయత్నం’ తొలగింపు*
*🔷సత్వర న్యాయానికి సమయ నిర్దేశం*
*🔶3 నేర బిల్లులకు ఆమోదం*
*🍥దిల్లీ: బ్రిటిష్ హయాం నుంచీ అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన 3 నేర శిక్షాస్మృతి బిల్లులకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాత చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్).. పేరుతో ఈ కొత్త బిల్లులను తీసుకొచ్చింది. గురు, శుక్రవారాల్లో ఏదో ఒక రోజున వాటిని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అక్కడా ఆమోదం పొంది రాష్ట్రపతి సంతకమైతే అవి చట్టాలుగా మారతాయి.*
*💥పాత కొత్త బిల్లుల్లో..*
*♦️పాత చట్టంలో అత్యాచారానికి 375, 376 సెక్షన్లు ఉండేవి. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 63గా పేర్కొన్నారు.*
*♦️పాత చట్టంలో హత్యకు 302 సెక్షన్ ఉండగా.. కొత్త బిల్లులో దానిని 101 సెక్షన్‌గా పెట్టారు.*
*♦️కిడ్నాప్‌నకు పాత చట్టంలో 359వ సెక్షన్ ఉండేది. కొత్త బిల్లులో దానిని సెక్షన్ 136 కింద చేర్చారు.*
*💥న్యాయ సంహిత బిల్లు*
*◼️కొత్తగా 20 నేరాల చేర్పు.*
*◼️ఐపీసీలోని 19 నిబంధనల తొలగింపు.*
*◼️33 నేరాల్లో జైలు శిక్ష పెంపు.*
*◼️83 నేరాల్లో జరిమానా పెంపు.*
*◼️23 నేరాల్లో తప్పనిసరి కనీస శిక్ష విధింపు.*
*◼️కొత్తగా 6 నేరాల్లో సమాజ సేవా శిక్ష.*
*◼️పిల్లలకు నిర్వచనం.*
*◼️జెండర్‌లో ట్రాన్స్‌జెండర్ల చేర్పు.*
*◼️దస్త్రాలుగా ఎలక్ట్రానిక్, డిజిటల్ రికార్డుల పరిగణన.*
*◼️చరాస్తికి విస్తృత నిర్వచనం.*
*◼️మహిళలు, పిల్లలపై నేరాలకు కొత్త అధ్యాయం.*
*◼️నేర ప్రయత్నం, ప్రేరణ, కుట్రకు ప్రత్యేక అధ్యాయం.*
*◼️వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలు, హిట్ అండ్ రన్, మూక దాడి, పిల్లలను నేరాలకు వినియోగించడం, మహిళలను వ్యభిచార వృత్తిలోకి దింపడం, గొలుసు దొంగతనం, విదేశాల్లో నేరాలను ప్రోత్సహించడం, భారత సార్వభౌమత్వాన్ని, సమగ్రతను, ఐక్యతను దెబ్బతీయడం, ఫేక్ వార్తలను ప్రచురించడం వంటి నేరాలకు నిర్వచనం.*
*◼️ఆత్మహత్యకు ప్రయత్నించడం నేర జా