ABC News - Palnadu

ABC News - Palnadu Accurate || Broadcast || Coverage

18/07/2026

I got over 50 reactions on my posts last week! Thanks everyone for your support! 🎉

18/07/2026

*దేశంలోనే తొలి భారీ క్రెడిట్ ఔట్‌రీచ్‌కు నరసరావుపేట వేదిక కావడం గర్వకారణం*

- *నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు*

నరసరావుపేట జులై 17:

నరసరావుపేటలో నిర్వహించిన భారీ క్రెడిట్ ఔట్‌రీచ్ (రుణ వితరణ) కార్యక్రమం పల్నాడు జిల్లా ఆర్థికాభివృద్ధి చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. భారతదేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో 1,03,246 మంది లబ్ధిదారులకు రూ. 3,216 కోట్ల రుణాలు పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కేంద్రంగా నిర్వహించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సహకారం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మద్దతుతో ఈ మహత్తర కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. వేలాదిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, లబ్ధిదారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రెడిట్ ఔట్‌రీచ్ కార్యక్రమం ద్వారా చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, విద్యార్థులు, చేనేత కార్మికులు, స్వయం ఉపాధి రంగంలోని యువత, మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా అందుతున్న రుణాలు ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు కుటుంబాల ఆర్థిక స్వావలంబనకు దోహదపడతాయని వివరించారు.ఈ కార్యక్రమాన్ని పల్నాడుకు తీసుకురావడంలో నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని, కార్యక్రమం విజయవంతం కావడంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ విశేష కృషి చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.
దాదాపు 20 రోజులపాటు రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా యంత్రాంగం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ఇతర బ్యాంకుల అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి రుణాల పంపిణీకి కృషి చేశారని ఆయన అభినందించారు.

పల్నాడు జిల్లాకు తొలిసారిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విచ్చేసి ప్రజల సంక్షేమం కోసం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జిల్లాకు గౌరవకారణమని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు, దేశ ప్రజలు అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైపు ఆశతో చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలు చూపిన ఆదరణ, ఆశీర్వాదాలే ఈ కార్యక్రమం ఘన విజయానికి కారణమని చెప్పిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పల్నాడు జిల్లా అభివృద్ధి, ప్రజల ఆర్థిక పురోగతే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చివరగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, బ్యాంకర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

02/07/2026

📢 ABC News - Palnadu

💛 పేద కుటుంబాల భవిష్యత్తుకు మరో భరోసా!

💰 ప్రతి నెల ₹1,000 పొదుపు చేయండి...
🎁 12 నెలలు పూర్తయిన తర్వాత ₹1,000 ప్రోత్సాహకం పొందండి!

చిన్న పొదుపు... పెద్ద భరోసా!
ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం.

🎥 పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

📺 ABC News
Accurate | Broadcast | Coverage

👍 YouTube | Facebook: ABC News

🔔 తాజా రాజకీయ, ప్రభుత్వ పథకాలు, స్థానిక వార్తల కోసం ABC News ను Subscribe చేయండి, Facebookలో Follow చేయండి.

🟡 నరసరావుపేటలో తెల్లవారుజామునే ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు గారి సేవా కార్యక్రమంJuly 1 ఉదయం 6:00 గంటలకే'NTR బరోసా సా...
01/07/2026

🟡 నరసరావుపేటలో తెల్లవారుజామునే ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు గారి సేవా కార్యక్రమం

July 1 ఉదయం 6:00 గంటలకే
'NTR బరోసా సామాజిక పింఛన్ల' పంపిణీ కార్యక్రమాన్ని నరసరావుపేట శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద బాబు గారు స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి ప్రారంభించారు.

వృద్ధులు, దివ్యాంగులు, అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు Share చేయండి
🔔 మరిన్ని తాజా వార్తల కోసం ABC NEWS ను Subscribe చేసి Bell Icon నొక్కండి.

ABC NEWS – Accurate | Broadcast | Coverage

29/06/2026

🌱 అంతర్జాతీయ సహకార దినోత్సవం ఘనంగా నిర్వహణ

నరసరావుపేట సాయి నగర్ లో అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం అందించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సహకార సంఘ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

📍 స్థలం: నరసరావుపేట సాయి నగర్

👉 పూర్తి వీడియో కోసం ABC News YouTube ఛానల్‌ను Subscribe చేయండి.
👍 ఈ పోస్ట్‌ను Like • Share • Comment చేయండి.

29/06/2026

📢🌾 ABC News ప్రత్యేక కథనం

🚜 "ఏరువాక సాగాలో... అన్నో చంద్రన్న..!"

నరసరావుపేట మండలం కేతుముక్కల అగ్రహారంలో ఘనంగా నిర్వహించిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో రైతులతో కలిసి నాగలి పట్టిన నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు గారి ప్రత్యేక దృశ్యాలు ఇప్పుడు ABC News - Palnadu

👍 ఒక Like • 💬 ఒక Comment • 📲 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, రైతు సోదరులతో Share చేయండి.

29/06/2026

🌾 "ఏరువాక సాగాలో... అన్నో చంద్రన్న..!" రైతులతో కలిసి నాగలి పట్టిన ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు | కేతుముక్కల అగ్రహారంలో ఏరువాక పౌర్ణమి సంబరాలు | ABC News

24/06/2026

మెగా డీఎస్సీపై బ్లూ మీడియా అసత్య ప్రచారం – నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే కుట్ర : ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని నవయుగ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన "మెగా డీఎస్సీపై బ్లూ మీడియా అసత్య ప్రచారం – నిరుద్యోగ యువతిపై గొడ్డలి వేటు" అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తోందని తెలిపారు. అయితే కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం బ్లూ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తూ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

నిరుద్యోగ యువత ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంచాలని, వాస్తవాలను తెలుసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే అరవింద బాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విద్యావేత్తలు, యువజన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొన్నారు.

🔵 ABC NEWS – PALNADUమెగా డీఎస్సీపై బ్లూ మీడియా అసత్య ప్రచారం.. నిరుద్యోగ యువతిపై గొడ్డలి వేటు!నరసరావుపేట కోటప్పకొండ రోడ్...
23/06/2026

🔵 ABC NEWS – PALNADU

మెగా డీఎస్సీపై బ్లూ మీడియా అసత్య ప్రచారం.. నిరుద్యోగ యువతిపై గొడ్డలి వేటు!

నరసరావుపేట కోటప్పకొండ రోడ్డులోని నవయుగ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మెగా డీఎస్సీపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ, నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ABC NEWSనరసరావుపేట, జూన్ 23:నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ, సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా స...
23/06/2026

ABC NEWS

నరసరావుపేట, జూన్ 23:

నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాశాఖ, సమగ్ర శిక్ష పల్నాడు జిల్లా సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ఉచిత బహుకరణ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారు హాజరై ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు బహుమతులు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. విద్య ప్రతి చిన్నారికి హక్కు అని, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

అదేవిధంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృత్తికా శుక్లా గారు కూడా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.

విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా వారి భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ABC NEWS – ప్రజలతో... ప్రజల కోసం... 📰📺

Address

Narasaraopet
522601

Website

Alerts

Be the first to know and let us send you an email when ABC News - Palnadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share