28/05/2022
https://www.facebook.com/104974455560714/posts/110364631688363/
Big Breaking News
లోకేష్ ను కలసిన ఆనం కైవల్య రెడ్డి..!!
- టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం ఐనట్లేనా..?
- ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతోనేనా..?
- లోకేష్ ని కలవడంలో ఆనం వ్యూహం ఏంటి.
- జిల్లా రాజకీయాల్లో మారనున్న రాజకీయం
- మాజీ మంత్రి అనిల్ చెప్పింది నిజమేనా..?
- మంత్రి కాకాణి ఏం సమాధానం చెప్తారు.
- ఇదే ఇప్పుడు ఆసక్తికర అంశం
----
N3 న్యూస్
--
గత కొద్దిరోజులుగా నెల్లూరు జిల్లా రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. ఒకరిమీద ఒకరు ఆరోపణలు, విమర్శలు.. వేధింపులు, ఒకరే లక్ష్యం గా వ్యూహాలు.., ప్రత్యర్థులతో లోపాయకారి ఒప్పందాల తో తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు వంటి ఘటనలతో ఈ వేసవిలో రాజకీయాలు సెగలు రగిలిస్తున్నాయి. ఈ నేపధ్యంలో శనివారం వెంకటగిరి MLA ఆనం రామనారాయణ రెడ్డి కుమార్తె ఆనం కైవల్య రెడ్డి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని ఒంగోలు లో కలవడం, ఆయన్ను అభినందించడం, శాలువా, పుష్పగుచ్చం తో సత్కరించటం పలు సందేహాలకు అవకాశం కల్పిస్తుంది. ఆమె తండ్రి ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ శాసన సభ్యులుగా ఉండడం.. ప్రత్యక్ష రాజకీయాల్లో కైవల్య అడుగుపెడుతోంది అనే ప్రచారం జరుగుతుండటంతో పాటు వచ్చే ఎన్నికల్లోపు ఆనం వారు వైసీపీకి గుడ్ బై చెబుతారన్న చర్చ జరుగుతున్న ఈ నేపధ్యంలో ఆమె లోకేష్ ని కలవడంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయాలు మారుతున్నాయా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కైవల్య రెడ్డి లోకేష్ ని కలవడం పక్కా వ్యూహం తోనే జరిగిందని.. ఇటువంటి సాహసం ఆమె తన తండ్రికి తెలియకుండా చేయదని, ఇది ఆనం ఆదేశాలతోనే జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఏది నిజమో ఆనం నోరు విప్పితేనే స్పష్టత వస్తుందని అంటున్నవారూ లేకపోలేదు.
---
అనిల్ చెప్పింది నిజమేనా..?
మంత్రివర్గ విస్తరణ తర్వాత జిల్లా రాజకీయాల్లో అనేక మార్పులు సంభవించాయి. ఈ క్రమంలోనే గత మూడేళ్ళుగా కాస్త మౌనంగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి ఒక్కసారిగా స్వరం పెంచారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై పరోక్ష యుద్దానికే దిగారు. కొన్ని చోట్ల పలు ఆరోపణలు కూడా చేసారు. ఫ్లెక్సీ ల ఏర్పాటు విషయంలో నగరంలో కొన్ని ఆంక్షలున్నా... మంత్రి కాకాణి కోసం ఆనం వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లను తొలగించడంపై కూడా ఆనం కుటుంబ నేతలు నగర mla పై దోషణలకు కూడా దిగారు. ఈ క్రమంలో నూ అనిల్ స్పందించారు. ఆనం ఏ పార్టీలో ఉంటారు..? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ప్రకటించాలని బహిరంగంగా.. మీడియా సాక్షిగా సవాల్ కూడా విసిరారు. దానికి ఆనం కుటుంబం నుంచి మౌనం. ఈ నేపథ్యంలో ఆనం కైవల్య ఒంగోలులో నారా లోకేష్ ని కలవడం చర్చనీయాంశంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చూపుగా ఆమె ద్వారా మార్గం సుమగం చేసుకుంటున్నారా..? అనే సందేహం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా అనిల్ చెప్పినట్లు ఆనం కుటుంబం పార్టీ మారేందుకే సిద్ధం అయ్యిందా అని చర్చ జరుగుతోంది.
--
మంత్రి కాకాణి ఏం చెబుతారు
గత కొన్నేళ్లుగా ఆనం, కాకాణి కుటుంబాల మధ్య సఖ్యత లేని విషయం తెలిసిందే. అయితే గోవర్ధన్ రెడ్డి మంత్రి అయ్యాక జిల్లాలో ఆనం కుటుంబం ఎంతో ఆనందించింది. ఆయనకు ఘాన స్వాగతం కూడా పలికారు. ఆత్మీయ సదస్సు లో సైతం ఆనం మాజీ మంత్రి పై, ఇరిగేషన్, రైతాంగం, ప్రాజెక్టులపై ఆరోపణలు కూడా చేశారు. ఇది కొంత కాకాణి కి ఇబ్బంది కలిగించినా... ఆనం ను వారించలేకపోయారు. దాంతో పథకం ప్రకారం ఇలా చేస్తున్నారా..? మాజీ మంత్రిని ఒంటరిని చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా..? అనే అనుమానాలు కూడా పార్టీ శ్రేణుల్లో, జిల్లా ప్రజల్లో వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో అనిల్ ని, కాకాణి ని స్వయంగా CM పిలిపించి మాట్లాడారు కూడా.. అప్పటి నుంచి సమస్య కొంత సద్ధిమణిగినా.. ఆనం కుటుంబం మాత్రం రగిలిపోతుంది. ఆ సామాజికవర్గం అంతా కలసి బీసీ నేత అయిన మాజీ మంత్రిని ఒంటరిని చేయాలన్న కుట్ర జరుగుతున్నట్లు ఆ సామాజికవర్గం, నగర ప్రజల్లో కూడా చర్చ జరిగింది. మంత్రి గోవర్ధన్ రెడ్డి ఆనం ను వెనకేసుకొస్తున్నారని అనుకుంటున్న క్రమంలో.. ఆనం కుమార్తె లోకేష్ ను కలవడం ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగుతోంది. దీనికి మంత్రి ఏం చెబుతారో అని కూడా అంతా ఎదురు చూస్తున్నారు.
ఏది ఏమైనా... ఆనం కైవల్య ద్వారా టీడీపీ లో చేరికకు ఆనం కుటుంబం మార్గం వేస్తోందా అని జిల్లాలో సరికొత్త చర్చకు దారితీస్తోంది.
--
లోకేష్ ని కలవడం తన వ్యక్తిగతం: ఆనం
అయితే ఇదే విషయంపై ఆనం రామనారాయణ రెడ్డిని మీడియా వివరణ కోరితే... తన కుమార్తె కైవల్య రెడ్డి చిన్న పిల్ల కాదని తనకు ఏది మంచో.. ఏది చేడో తెలుసునని, లోకేష్ ని ఎందుకు కలసిందో అది తన వ్యక్తిగతం అని, తనకు సంబంధం లేదని, ఆ విషయాన్ని ఆమెనే అడగండి అంటూ... సమాధానం దటవేసి వెళ్లిపోవడం విశేషం.
---
సునీల్, ఆర్
Coming soon
N 3 - News
--